India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో కూటమి ప్రభుత్వం రెండు నెలల్లోనే ప్రజల విశ్వాసం కోల్పోయిందని మాజీ సీఎం జగన్ మేనమామ, కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లా వి.కోటలోని వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఇలాగే పరిపాలిస్తే రెండేళ్లలో ప్రభుత్వం పడిపోవడం ఖాయమని పేర్కొన్నారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలను వేధిస్తున్నారని.. ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని విమర్షించారు.
మదనపల్లె ట్రాఫిక్ ఏఎస్‌ఐగా పనిచేస్తున్న జేఎన్‌ఏ బాషా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా.. విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా గురువారం ఇండియన్ పోలీస్ మెడల్‌ను అందుకున్నారు. ఈ సందర్భంగా జేఎన్‌ఏ బాషా మాట్లాడుతూ… ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఇండియన్ పోలీస్ మెడల్ అందుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా పలువురు పోలీసు సిబ్బంది ఆయన్ను అభినందించారు.
రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డికి కేంద్ర ప్రభుత్వం భద్రత పెంచింది. ఇటీవల మిథున్ రెడ్డి పుంగనూరు వెళ్లినప్పుడు అల్లర్లు జరిగాయి. ఈక్రమంలో ఆయనకు అపాయం పొంచి ఉందని నిఘా వర్గాలు కేంద్ర హోంశాఖకు నివేదిక ఇచ్చాయి. దీంతో ఆయనకు 8 మంది CRPF బలగాలతో బందోబస్తు కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. సదరు సిబ్బంది గురువారం మిథున్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు.
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కడప కలెక్టర్ లోతేటి శివశంకర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎట్ హోం కార్యక్రమంలో MLA పుట్టా సుధాకర్ యాదవ్, పలువురు నాయకుడు పాల్గొన్నారు. కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా ప్రజాప్రతినిధులకు, అధికారులకు విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ కార్యక్రమంలో గురువారం ఎస్పీ హర్షవర్ధన్ రాజు, డిఆర్ఓ గంగాధర్ గౌడ్ పాల్గొన్నారు.
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కడప కలెక్టర్ లోతేటి శివశంకర్ ఆధ్వర్యంలో, ఏర్పాటు చేసిన ఎట్ హోం కార్యక్రమంలో శాసనసభ్యులు పుట్టా సుధాకర్ యాదవ్ పాల్గొన్నారు. కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా ప్రజాప్రతినిధులకు, అధికారులకు విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు. కార్యక్రమంలో ఎస్పీ హర్షవర్ధన్ రాజు, డిఆర్ఓ గంగాధర్ గౌడ్ పాల్గొన్నారు.
జిల్లాలో పోలీస్ శాఖలో విశిష్ట సేవలందించిన వారికి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సేవా పతకాలను రాష్ట్ర న్యాయ, మైనారిటీ శాఖ మంత్రి ఫరూక్ అందజేశారు.
1)SSSV కృష్ణారావు, అడిషనల్ SP ఏఆర్ కడప
2. ఎం అరుణాచలం, ఏఎస్ఐ, కడప ట్రాఫిక్ పిఎస్
3. కె ఆనంద్, హెచ్సి 2008, సిద్దవటం పిఎస్
4. సి శ్రీనివాసులు, పీసీ 1233, ప్రొద్దుటూరు ట్రాఫిక్ పిఎస్
5. కె విజయలక్ష్మి, డిసిఆర్బి, కడప
మైదుకూరు పట్టణానికి చెందిన కృష్ణ చైతన్య యాదవ్ రూ.56 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం సాధించినట్లు తండ్రి కృష్ణయ్య పేర్కొన్నారు. మైక్రో సాప్ట్ వేర్ కంపెనీ నందు భారీ వేతనంతో ఉద్యోగం పొందినట్లు చెప్పారు. కృష్ణ చైతన్య ఐఐటీ ఢిల్లీ నందు విద్యాభ్యాసం పూర్తి చేసినట్లు చెప్పారు. అత్యధిక వేతనంతో ఉద్యోగం రావడంతో తల్లిదండ్రులు, బంధువులు
పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
కరోనా సమయంలో కరోనా వారియర్‌గా పేరు పొందిన పోరుమామిళ్ల మండలం అక్కల్ రెడ్డి పల్లెకు చెందిన ఓబులాపురం రాజశేఖర్‌ను డాక్టరేట్ వరించింది. కరోనా సమయంలో ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచిన రాజశేఖర్‌కు ఇంటర్నేషనల్ ఫేస్ యూనివర్సిటీ జర్మనీ వారు పాండిచ్చేరిలో ఈ అవార్డు అందజేశారు. నిరుపేద కుటుంబంలో పుట్టిన రాజశేఖర్ ఆటో తోలుకుంటూ ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారని గ్రామస్థులు కొనియాడారు.
స్వాతంత్ర్య ఉద్యమాల్లో పాల్గొని జైలు జీవితం అనుభవించిన సమరయోధులలో బాల ఎల్లారెడ్డి(103) ఒకరు. చెన్నూరుకు చెందిన ఆయన 1921 జనవరిలో జన్మించారు. బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా బాలయల్లారెడ్డి కొండపేట వంతెనను కూల్చేశారు. జిల్లాలో 15 మంది స్వాతంత్ర సమరయోధులు జైలు జీవితాలు గడపగా వారిలో ఇప్పటికే 14 మంది మృతిచెందారు. శతాధిక వయసులో ఉన్న బాల ఎల్లారెడ్డి ప్రస్తుతం చెన్నూరులో జీవిస్తున్నారు.
సెలవుల నేపథ్యంలో ఇతర ప్రాంతాల్లో ఉన్న వారి రాకపోకలకు జిల్లా ఆర్టీసీ అధికారులు 36 ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేశారు. జిల్లాలోని ఆరు డిపోల నుంచి కేవలం బెంగళూరుకు 30 బస్సులు, హైదరాబాదుకు 3, చెన్నైకు 3 బస్సుల చొప్పున ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ ఆర్ఎం గోపాల్ రెడ్డి తెలిపారు. వరుస సెలవులు రావడంతో ప్రయాణికుల రద్దీ పెరిగిందని, ఆ మేరకు బస్సు సర్వీసులను ఏర్పాటు చేశామని చెప్పారు.
Sorry, no posts matched your criteria.