Y.S.R. Cuddapah

News August 15, 2024

కడప జిల్లాలో ఐదుగురు సీఐల బదిలీ

image

కర్నూల్ రేంజ్ పరిధిలో ఐదుగురు సీఐలను బదిలీ చేస్తూ డీఐజీ కోయ ప్రవీణ్ బుధవారం ఉత్తర్వులను జారీ చేశారు. ఇందులో భాగంగా
☛ సి. శంకర్ రెడ్డిని వీఆర్ కడపకు
☛ జి. జీవన్ గంగానాథ్ బాబు – పులివెందుల యూపీఎస్
☛ ఎన్. వెంకటరమణ – పులివెందుల రూరల్
☛ జి. వెంకటేశ్వర్లు – కడప తాలూకా
☛ ఎన్.వి నాగరాజు – రాజంపేటకు బదిలీ చేసినట్లు పేర్కొన్నారు.

News August 15, 2024

ప్రతి ఇంటిపై జాతీయ జెండా రెపరెపలాడాలి: కలెక్టర్

image

స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని నేడు ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని జిల్లా కలెక్టర్ శివశంకర్, ఎస్పీ హర్షవర్ధన్ రాజులు ప్రజలకు సూచించారు. కడప పోలీస్ మైదానంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సంబంధించి జిల్లా కలెక్టర్ అధ్యక్షతన బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో ఎక్కడ ఇబ్బందులు లేకుండా చూడాలని, అన్ని సచివాలయాలలో జాతీయ జెండా ఎగురవేయాలని ఆదేశించారు.

News August 14, 2024

కడప దర్గాలో కొణిదెల నిహారిక ప్రార్థనలు

image

కడప నగరంలో ప్రసిద్ధిగాంచిన అమీన్ పీర్ పెద్ద దర్గాను ప్రముఖ నది కొణిదెల నిహారిక దర్శించుకున్నారు. నిర్మాతగా వ్యవహరించిన కమిటీ కుర్రోళ్లు చిత్ర విజయోత్సవ ర్యాలీలో భాగంగా కడపకు విచ్చేశారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌‌తో కలిసి కొణిదెల నిహారిక దర్గాను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా దర్గా ప్రత్యేక విశిష్టతను నిహారికకు ప్రతినిధులు వివరించారు.

News August 14, 2024

రూ.10 నాణేలు అన్నీ చెల్లుబాటు అవుతాయి: కలెక్టర్

image

రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసిన 14 రకాల ₹10 నాణేలన్నీ చెల్లుబాటు అవుతాయని జిల్లా కలెక్టర్ శివ శంకర్ లోతేటి బుధవారం తెలిపారు. రూ.10 నాణేముల అవగాహన కొరకు, DCC మీటింగ్‌లో తీసుకున్న నిర్ణయం మేరకు కెనరా బ్యాంక్ రీజినల్ హెడ్ కె మురళీ మోహన్‌తో కలసి 7 రోడ్ల కూడలి వద్ద ఈనెల 16వ తేదీన పెద్ద ఎత్తున పది రూపాయల నాణేలను చలామణి జరుపుతామని కలెక్టర్ తెలిపారు. రూ.10 నాణెం చెల్లుబాటుపై క్లారిటీ ఇచ్చారు.

News August 14, 2024

కడపకు చేరుకున్న మంత్రి ఫరూక్

image

రాష్ట్ర మైనారిటీ న్యాయశాఖ మంత్రి పర్యటనలో భాగంగా కడపకు చేరుకున్నారు. కడప ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్‌లో జిల్లా కలెక్టర్ శివశంకర్, ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఇతర అధికారులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. రేపు కడప పోలీస్ మైదానంలో జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని జండా వందనం చేస్తారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలపై ప్రజలకు తన సందేశంలో వినిపిస్తారు.

News August 14, 2024

బాగా చదివి అత్యున్నత స్థానాలకు ఎదగాలి: ఎస్పీ

image

పోలీస్ కుటుంబాల పిల్లలు బాగా చదివి అత్యున్నత స్థాయికి ఎదగాలని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆకాంక్షించారు. బుధవారం స్థానిక పెన్నార్ పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో జిల్లాలోని పోలీసుల, హోమ్ గార్డ్స్ కుటుంబాలకు చెందిన 59 మంది పిల్లలకు విద్యలో ప్రతిభ కనబరచి టెన్త్, ఇంటర్‌లో 90 శాతం పైబడి మార్కులు సాధించిన వారికి మెరిట్ స్కాలర్ షిప్‌లను, ప్రశంసా పత్రాలను అందచేసి అందరినీ ప్రత్యేకంగా అభినందించారు.

News August 14, 2024

రైల్వే కోడూరు: బైకు, లారీ ఢీ.. ఇద్దరు స్పాట్ డెడ్

image

రైల్వే కోడూరు మండలం అనంతరాజు పేట క్రాస్ రోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌‌పై కోడూరు నుంచి మంగంపేటకు వెళ్తున్న ఇద్దరిని వెనుకవైపు నుంచి లారీ ఢీకొట్టింది. దీంతో సిద్దేశ్వర (35), పుల్లగుంట సుబ్బయ్య (42) ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

News August 14, 2024

రైల్వే కోడూరు: బైకు, లారీ ఢీ.. ఇద్దరు స్పాట్ డెడ్

image

రైల్వే కోడూరు మండలం అనంతరాజు పేట క్రాస్ రోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌‌పై కోడూరు నుంచి మంగంపేటకు వెళ్తున్న ఇద్దరిని వెనుకవైపు నుంచి లారీ ఢీకొట్టింది. దీంతో సిద్దేశ్వర (35), పుల్లగుంట సుబ్బయ్య (42) ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

News August 14, 2024

జనంపై జగన్ కక్ష కట్టాడు: బీటెక్ రవి

image

కర్నూల్ జిల్లాలో జరిగిన TDP మాజీ సర్పంచ్ శ్రీనివాసులు హత్యపై పులివెందుల TDP ఇన్‌ఛార్జ్ బీటెక్ రవి X (ట్విటర్) వేదికగా స్పందించారు. ‘ఐదేళ్ల నరకాసుర పాలనకు చరమగీతం పాడారని జనంపై కక్ష కట్టాడు జగన్. ప్రజా తీర్పును భరించలేక హోసూరు మాజీ సర్పంచ్ శ్రీనివాసులును YCP కిరాయి మూకలు మట్టుపెట్టాయి.’ అని పేర్కొన్నారు. ‘వైకాపోన్మాదం ప్రజాతీర్పును భరించలేకపోతోంది’ అంటూ ఓ పోస్టర్‌ను తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

News August 14, 2024

కడప: ఆగస్టు 15న ఖైదీల విడుదల ప్రశ్నార్థకం

image

ఈ ఏడాది ఆగస్టు 15న ఖైదీల విడుదల ప్రశ్నార్థకంగా మారింది. కడప కేంద్రకారాగారం నుంచి ఖైదీల విడుదలకు గానూ 3 విడతలుగా వివిధ కేటగిరీలకు చెందిన 20 మంది జాబితాను హోంశాఖ వారికి జైళ్ల శాఖ ప్రతిపాదనలు పంపింది. అయితే స్వాతంత్ర్య దినోత్సవం రోజు ఖైదీల విడుదల ఉండదని, గాంధీ జయంతి రోజున విడుదల చేస్తామని ఇటీవల ఓ సమావేశంలో హోం మంత్రి అనిత పేర్కొన్న నేపథ్యంలో ఆగస్టు 15న ఖైదీల విడుదల లేనట్లేనని తెలుస్తోంది.