Y.S.R. Cuddapah

News October 9, 2024

కాక పుట్టిస్తున్న జమ్మలమడుగు రాజకీయం

image

రెండు రోజుల నుంచి జమ్మలమడుగు రాజకీయం వేడి వాడిగా సాగుతోంది. సుధీర్ రెడ్డి వైడ్ బాల్, MLC రామసుబ్బారెడ్డి నో బాల్ అని MLA ఆదినారాయణ రెడ్డి కామెంట్ చేశారు. దీనికి ఎమ్మెల్యే ఆది అధికారం ఉంటేనే పులి, అధికారం లేకపోతే పిల్లిలా ఉంటాడంటూ రామసుబ్బారెడ్డి కౌంటర్ ఎటాక్ చేశారు. వీళ్ల వ్యాఖ్యలు చూస్తుంటే 2009 ఎన్నికలు గుర్తుకువస్తున్నాయని నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు. వీళ్ల వ్యాఖ్యలపై మీ కామెంట్..

News October 8, 2024

సంక్రాంతిలోగా పనులు పూర్తి చేయాలి: కడప కలెక్టర్

image

కడప జిల్లాల్లో గ్రామ సభల్లో ఆమోదిందించిన పల్లె ప్రగతికి ఉపాధి హామీ మెటీరియల్ కాంపోనెంట్ పనులను వచ్చే సంక్రాంతి లోపు పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ శివ శంకర్ ఆదేశించారు. ఉపాధి హామీ పనులు, గ్రామ సభలు, పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాలు తదితర అంశాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలెక్టర్లతో వీసీ ద్వారా సమీక్షించారు. ఈ నెల 14వ తేది నుంచి 20వ తేది వరకు పల్లె పండుగ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు.

News October 8, 2024

కడప: 10న ప్రత్యేక ఆధార్ నమోదు కేంద్రాల్లో సేవలు

image

కడప డివిజన్ పరిధిలో జాతీయ తపాలా వారోత్సవాలలో భాగంగా గురువారం అక్టోబర్ అంత్యోదయ దివాస్ సందర్భంగా ప్రత్యేక ఆధార్ నమోదు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కడప డివిజన్ పోస్టల్ ఇన్‌ఛార్జ్ రాజేశ్ తెలిపారు. గురువారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 7:00 వరకు అందుబాటులో ఉంటారన్నారు. కడపతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈ సేవలు ఉంటాయన్నారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News October 8, 2024

మైదుకూరు: కాలువలో పడి బాలుడి మృతి

image

మైదుకూరు మండలం విశ్వనాథపురంలో కొట్టం సుజిత్ (14) అనే బాలుడు కాలవలో పడి మృతి చెందిన ఘటన మంగళవారం జరిగింది. ఎస్సీ కాలనీకి చెందిన సుజిత్ గ్రామ సమీపంలోని తెలుగుగంగ కాలువలో ప్రమాదవశాత్తూ పడి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మైదుకూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలుడి మృతితో కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News October 8, 2024

కడప: ఆన్ లైన్ గేమ్.. యువకుడి ఆత్మహత్య

image

కడప జిల్లాలో ఆన్‌‌లైన్ గేమ్‌లో నగదు పోగొట్టుకున్న యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. బంధువుల వివరాల ప్రకారం.. చక్రాయపేట మండలం బీ‌ఎన్ తాండాకు చెందిన కార్తీక్ నాయక్ గత కొంత కాలంగా అన్ లైన్ గేమ్ ద్వారా రూ.3 లక్షలు పొగుట్టుకున్నాడు. 2 రోజుల క్రితం కాలేటి వాగులో ఒక చెట్టుకు ఉరి వేసుకున్నాడు. ఇవాళ స్థానికులు గమనించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

News October 8, 2024

‘వైఎస్సార్ జిల్లా పేరును మార్చడం తగదు’

image

వైఎస్సార్ జిల్లా పేరును కడప జిల్లాగా మార్చాలని ప్రభుత్వం ప్రయత్నించడం తగదని వైసీపీ జిల్లా వైసీపీ అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన కడపలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన సేవలు వెలకట్టలేనివని, ఆ సేవలకు గుర్తింపుగానే ఆయన పేరు పెట్టారన్నారు. కడప జిల్లాగా పేరు మార్చాలని పక్క జిల్లాకు చెందిన మంత్రి సీఎంకు లేఖ రాయడం హేయమైన చర్య అన్నారు.

News October 8, 2024

రాజంపేటలో భగ్గుమంటున్న కూరగాయల ధరలు

image

రాజంపేట పట్టణంలో కూరగాయల ధరలు ఆకాశన్నంటుతుండడంతో కొనుగోలుదారులు లబోదిబోమంటున్నారు. మంగళవారం టమాటా, ఎర్రగడ్డలు రూ.100 కి దగ్గరగా ఉన్నాయి. మిగిలిన కూరగాయల పరిస్థితి అదే లాగా ఉందని చెబుతున్నారు. రోజురోజుకీ కూరగాయల ధరలు ఇలా పెరుగుతుండడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

News October 8, 2024

కడప – హైదరాబాదుకు రోజువారీ సర్వీసులు

image

కడప- హైదరాబాదుకు విమానయాన ఇండిగో సంస్థ రెగ్యులర్ సర్వీసులు నడపనుంది. ఈనెల 27న హైదరాబాదులో ఉదయం11.30 గంటలకు బయలుదేరి, మ.12.40కి కడపకు చేరుతుంది. మళ్లీ కడపలో సా. 3.55 కి తిరుగుపయనమై సా.5.10కి హైదరాబాదు చేరుతుంది. www.goindigo.in వెబ్ సైట్‌లో టికెట్లు బుక్ చేసుకోవాలి సంస్థ తెలిపింది.

News October 8, 2024

అన్నమయ్య: ‘అర్జీదారుల సమస్యలకు పరిష్కారం చూపాలి’

image

ప్రజల నుంచి అర్జీలు స్వీకరించాక బాధ్యతగా పనిచేయవలసిన అవసరం అధికారులపై ఉందని జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ పేర్కొన్నారు. సోమవారం అన్నమయ్య జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అర్జీలు స్వీకరించారు. జిల్లాలోని నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు వారి సమస్యలను అర్జీల రూపంలో జిల్లా అధికారులకు అందించారు.

News October 7, 2024

టీడీపీలో చేరిన కమలాపురం పంచాయతీ ఛైర్మన్

image

కమలాపురం నగర పంచాయతీ ఛైర్మన్ సోమవారం సాయంత్రం టీడీపీ కండువా కప్పుకున్నారు. ఛైర్మన్ మార్పూరు మేరీతోపాటు మరికొందరు కౌన్సిలర్లు వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. వీరికి కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్యారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డిలు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కమలాపురం నగర పంచాయతీ అభివృద్ధి కోసమే తను టీడీపీలో చేరుతున్నట్లు ఛైర్మన్ పేర్కొన్నారు.