India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

డిసెంబర్ రెండో శనివారం అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు అన్నమయ్య జిల్లా విద్యాశాఖ అధికారి బుధవారం ప్రకటించారు. నీటి సంఘం ఎన్నికల దృష్ట్యా జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలో సెలవు దినంగా ప్రకటించామని ఆయన తెలిపారు. గతంలో వర్షాల కారణంగా సెలవులు ఇచ్చినందుకు శనివారం వర్కింగ్‌డేగా ఉంటుందని ముందుగా ప్రకటించామని గుర్తుచేశారు. ఆదివారం పొట్టి శ్రీరాములు వర్ధంతి జరపాలని ఆదేశించారు.

రైతులు ఈనెల 15వ తేదీ లోపు పంటల బీమా ప్రీమియం చెల్లించాలని జిల్లా వ్యవసాయ శాఖాధికారి ఐతా నాగేశ్వరరావు అన్నారు. చింతకొమ్మదిన్నె మండలం బుగ్గలపల్లె, బోడెద్దులపల్లెలో బుధవారం నిర్వహించిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వరికి ఈ నెల 31వ తేదీ వరకు ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించుటకు అవకాశం ఉందని, మిగిలిన పంటలకు 15వ తేదీ లోపు చెల్లించాలని తెలిపారు. కార్యక్రమంలో ఏవో ఈశ్వర రెడ్డి పాల్గొన్నారు.

ప్రొద్దుటూరులో భూమికి సంబంధించిన వ్యాఖ్యలతో పొలిటికల్ హీట్ పెరిగింది. తాను ఒక్క ఎకరా భూమిని ఆక్రమించినట్లు నిరూపిస్తే ఎన్నికల్లో పోటీ చేయనని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి సవాల్ విసిరారు. రాచమల్లు భూ బాధితులు ఎవరైనా ఉంటే తమకు ఫిర్యాదు చేయొచ్చు. అలా చేస్తే రాచమల్లుపై చర్యలు తీసుకుంటామని టీడీపీ నాయకులు ఈవీ సుధాకర్, నల్లబోతుల నాగరాజు ప్రజలకు పిలుపునిచ్చారు.

లింగాల మండలం వెలిగండ్ల గ్రామ సమీపంలో ఉన్న దేవరకోన వరదరాజుల స్వామి ఆలయంలో మంగళవారం రాత్రి దుండగులు ఆలయ హుండీ అపహరణకు విఫలయత్నం చేశారు. ఆలయంలో హుండీని కాంక్రీటుతో పూడ్చి ఉండగా, కాంక్రీటును తొలగించి ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. అయితే హుండీని బలమైన ఇనుపతో తయారు చేయడంతో అది పగలకపోవడంతో పారిపోయారు. గతంలో కూడా హుండీని ఎత్తుకెళ్లి పగలగొట్టే ప్రయత్నం చేశారని ఆలయ అర్చకులు తెలిపారు.

‘నువ్వు మనిషివేనా.. మోహన్ బాబు’ అని టీజేఎఫ్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సుండుపల్లి ఎంపీడీవో కార్యాలయం ఎదుట తెలుగు జర్నలిస్ట్ ఫోరమ్ ఆధ్వర్యంలో బుధవారం నిరసన వ్యక్తం చేశారు. టీవీ9, టీవీ5 జర్నలిస్టులపై నటుడు మంచు మోహన్ బాబు దాడిని టీజేఎఫ్ నేతలు ఖండించారు. మోహన్ బాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మోహన్ బాబుపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చెయ్యాలన్నారు.

తిరుపతి జిల్లాలో MROగా విధులు నిర్వర్తిస్తున్న దస్తగిరయ్యను కడప జిల్లా జమ్మలమడుగు RDO కార్యాలయంలోని KRC తహశీల్దారుగా బదిలీ చేశారు. అధికారులు నిర్దేశించిన గడువులోగా ఆయన విధుల్లో చేరలేదు. ఉన్నతాధికారులు కాల్ చేసినా స్పందన లేదు. కలెక్టర్ రంగంలోకి దిగి నోటీసులు ఇచ్చినా డ్యూటీలో చేరలేదు. ఈక్రమంలో దస్తగిరయ్యను సస్పెండ్ చేస్తూ కడప కలెక్టర్ చెరుకూరి శ్రీదర్ ఉత్తర్వులు జారీ చేశారు.

కడప, అన్నమయ్య జిల్లాల కలెక్టర్లు శ్రీధర్ చెరుకూరి, శ్రీధర్ చామకూరి విజయవాడకు వెళ్లారు. నేడు, రేపు అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న కలెక్టర్ల సదస్సులో పాల్గొంటారు. కూటమి ప్రభుత్వ ఆరు నెలల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ఈ సదస్సులో చర్చించనున్నారు. అలాగే స్వర్ణాంధ్ర విజన్-2047 డాక్యుమెంట్, నూతనంగా తీసుకొచ్చిన పాలసీలపై సీఎం కలెక్టర్లకు దిశానిర్దేశం చేస్తారు.

ఇడుపులపాయ IIIT ఓల్డ్ క్యాంపస్‌లో మంగళవారం మధ్యాహ్నం ఫుడ్ పాయిజన్‌తో 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ క్యాంపస్‌లో ఇడుపులపాయ, ఒంగోలు IIITలకు చెందిన విద్యార్థులు ఉంటున్నారు. ఘటన జరిగిన వెంటనే స్పందించిన సిబ్బంది వారికి IIIT ఆసుపత్రిలో చికిత్స అందించారు. కొందరికి 4 రోజులుగా ఆరోగ్యం బాలేదని, ప్రస్తుతం విద్యార్థులకు ప్రమాదం లేదని డైరెక్టర్ కుమారస్వామి గుప్తా అన్నారు.

కడప జిల్లాలో రానున్న వేసవిలో నీటి ఎద్దడి సమస్య రాకుండా అన్ని ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో తాగునీటి సమస్యలపై ఇరిగేషన్, మున్సిపల్ అధికారులతో సమీక్షను కలెక్టర్ నిర్వహించారు. తాగునీటి సమస్య రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, శాశ్వత నీటి వనరులను గుర్తించాలని అన్నారు.

కడపలో రాజకీయం మరోసారి ఘాటెక్కింది. తాగునీటి సమస్య లేకున్నా ఉన్నట్లు MLA మాధవి చెప్పడం విడ్డూరంగా ఉందని మాజీ MLA అంజాద్ బాషా వ్యాఖ్యానించారు. దీనికి జిల్లా TDP అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి ‘రా వీధుల్లోకి వెళ్లి ప్రజలను అడుగుదాం. ఇలా చెప్తే ప్రజలు గాడిద మీద ఊరేగిస్తారు’ అని ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ఇటీవల పవన్ కళ్యాణ్ కడపకు వచ్చిన సందర్భంగా MLA నీటి సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లడంతో ఈ వివాదం మొదలైంది.
Sorry, no posts matched your criteria.