India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బద్వేలు సమీపంలోని గోపవరం అటవీ ప్రాంతంలో ఇంటర్ విద్యార్థినిపై యువకుడు నిప్పు పెట్టి కాల్చిన ఘటనపై ఎస్పీ హర్షవర్ధన్ రాజు సీరియస్ అయ్యారు. ఈ ఘటనలో నిందితుడు విగ్నేష్‌ను పట్టుకునేందుకు నాలుగు బృందాలుగా ఏర్పాటు చేసినట్లు సమాచారం. విషయం తెలిసిన వెంటనే ఎస్పీ ఘటనా స్థలానికి బయలుదేరి వెళ్లినట్టు తెలుస్తోంది. నిందితుని వెంటనే పట్టుకునేలా కఠిన ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం.
గోపవరం మండలంలో ఇంటర్ విద్యార్థినిపై విగ్నేశ్ అనే యువకుడు హత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. అధికారులతో మాట్లాడి విద్యార్థినికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని సూచించారు. ప్రత్యేక బృందాలతో నిందుతుడిని అరెస్ట్ చేయాలని ఎస్పీని ఆదేశినట్లు టీడీపీ తన Xలో పోస్ట్ చేసింది.
వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఉమ్మడి కడప, కర్నూల్ జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్‌గా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి తమవంతు కృషి చేస్తామని అన్నారు. 2029లో మళ్లీ జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయాలన్నారు.
విధినిర్వహణలో వివిధ కారణాలతో మృతి చెందడం బాధాకరమని, వారి కుటుంబ సంక్షేమానికి జిల్లా పోలీసు శాఖ ఎల్లప్పుడు కృషి చేస్తోందని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు పేర్కొన్నారు. కడప పోలీస్ పెన్నార్ కాన్ఫరెన్స్ హాలులో విధి నిర్వహణలో మరణించిన పోలీసు కుటుంబ సభ్యులతో జిల్లా ఎస్పీ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వపరంగా అందాల్సిన సౌకర్యాలు, కారుణ్య నియామకాల గురించి, కుటుంబ స్థితిగతులు, బాగోగులను అడిగి తెలుసుకున్నారు.
కడప జిల్లాలోని పోలీస్ సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, సిబ్బంది అంకిత భావంతో విధులు నిర్వర్తించి మంచి పేరు తీసుకుని రావాలని ఎస్పీ హర్షవర్ధన్ రాజు సూచించారు. గార్డు విధుల్లోని ఏఆర్ సిబ్బంది సంక్షేమంలో భాగంగా.. జిల్లా ఎస్పీ నేడు వారికి సీలింగ్ ఫ్యాన్లు, బెడ్స్, వాటర్ డిస్పెన్సర్లు వంటి పరికరాలను అందించారు.
☛ శ్రీనివాస ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్సెస్ కడప
☛ అన్నమాచార్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్సెస్ కడప
☛ KSRM కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ కడప
☛ శ్రీవేంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ టెక్నాలజీ & సైన్సెస్ కడప
☛ KLM ఇంజినీరింగ్ ఫర్ ఉమెన్ కడప
☛ SRIT ప్రొద్దుటూరు
☛ CBIT చాపాడు
కడప జిల్లా బద్వేలు పరిధిలోని అట్లూరు మండలానికి చెందిన మోకల కాపరి గంగిరెడ్డి గత 4 రోజులుగా కనిపించడంలేదు. దీంతో చివరికి డ్రోన్‌లను రంగంలోకి దించి అతని జాడకోసం వెతుకుతున్నారు. మరో వైపు గ్రామస్థులు పరిసర ప్రాంతాల్లో వెతికినా ప్రయోజనం లేదు. కాగా గొర్రెల కాపరి గంగిరెడ్డి 4 రోజుల క్రితం అడవికి మేకలను తోలుకుని వెళ్లాడు. అప్పటినుంచి ఇంటికి రాకపోవడంతో గ్రామస్థుల్లో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
జాతీయ విద్యా విధానం 2020కి అనుగుణంగా ఉల్లాస్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని జిల్లా కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. రాయచోటి కలెక్టరేట్‌లో ఉల్లాస్ కార్యక్రమంపై జిల్లాస్థాయి కమిటీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. జిల్లాను 100% అక్షరాస్యత కలిగిన జిల్లాగా మార్చడమే ధ్యేయమని ఆర్థిక అక్షరాస్యత, డిజిటల్ అక్షరాస్యులపై దృష్టి సారించాలని అధికారులకు సూచించారు.
జిల్లా వ్యాప్తంగా కురిసిన వర్షాలకు 635 ఎకరాల్లో ఉల్లి పంటకు నష్టం వాటిల్లిందని ఉద్యానశాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ముద్దనూరు, తొండూరు, దువ్వూరు, యర్రగుంట్ల, వీయన్ పల్లి, వేంపల్లి మండలాల్లోని 828 మంది రైతులకు చెందిన 635.20 ఎకరాల్లోని ఉల్లి పంట వర్షాలకు దెబ్బతింది. సుమారు రూ. కోటి 59 లక్షలు ఇన్ ఫుట్ సబ్సిడీ అవసరమని ఉద్యానశాఖ అధికారులు చెబుతున్నారు.
కడప నగర ప్రజలకు 2001 అక్టోబర్‌లో వచ్చిన వరదలు ఓ పీడకలను మిగిలిచ్చింది. కడప బుగ్గ వంకకు భారీగా వరద రావడంతో కడప నగరాన్ని చుట్టుముట్టింది. తెల్లవారు జామున నిద్రలేచి తేరుకునేలోపు పలువురు శవాలుగా మారారు. భారీగా ఆస్తినష్టం వాటిల్లింది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పిల్లల్ని భుజాన వేసుకొని రోడ్ల మీద పరుగులు తీశారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలను చూస్తుంటే అక్కడి ప్రజలు ఆ ఘటనను గుర్తుచేసుకుంటున్నారు.
Sorry, no posts matched your criteria.