India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చే ఫిర్యాదులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని కడప జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు పోలీస్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలోని పెన్నార్ పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో ఎస్పీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ప్రజల నుంచి జిల్లా ఎస్పీ నేరుగా ఫిర్యాదులను స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇసుక పంపిణీ విధానం జిల్లాలో సజావుగా, సులభతరంగా అమలు చేయాలని కడప జిల్లా కలెక్టర్ శివశంకర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం వీసీ ద్వారా జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌తోపాటు జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు హాజరయ్యారు. నూతన ఉచిత ఇసుక విధానంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పారదర్శకంగా పంపిణీ జరగాలన్నారు.
నందలూరు మండలం ఎర్రచెరువుపల్లిలో ఆదివారం రాత్రి దారుణ ఘటన చోటుచేసుకుంది. వెంకటరెడ్డి తన కోడి ఎవరో దొంగిలించారని రోడ్డుపై అరుస్తుండగా.. ఆ వీధిలోని ప్రతాప్ ఆగ్రహించాడు. నీ కోడి మా ఇంట్లో ఉంది రమ్మంటూ ఇంట్లోకి తీసుకెళ్లి అతని తలపై నరికి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న బంధువులు రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, మెరుగైన చికిత్స నిమిత్తం తిరుపతికి తీసుకువెళ్లగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు.
కొండాపురం మండలంలో ఓ వర్గానికి చెందిన నేతల మధ్య వర్గ విభేదాలు ఏర్పడ్డాయి. టీ కోడూరులో అక్రమ గ్రావెల్ తవ్వకాల విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగి ఒకరిపై ఒకరు రాళ్లతో దాడి చేసుకున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వారిని నిలువరించాలని ప్రయత్నించగా, పోలీసులపైనే దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 3 ప్రభుత్వ వాహనాలు ధ్వంసమయ్యాయి. పలువురు పోలీసులకు గాయాలయ్యాయి.
జిల్లా ప్రజలందరిలో దేశభక్తి భావాలు రేకెత్తించేలా పండుగ వాతావరణంలో 78వ పంద్రాగస్టు వేడుకలను పెద్దఎత్తున చేపట్టేందుకు, ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా అధికారులను జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి ఆదేశించారు. రాయచోటి కలెక్టరేట్లోని సమావేశ హాల్లో 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లా అభివృద్ధిపై బుక్‌లెట్‌ను సిద్ధం చేయాలన్నారు.
చింతకొమ్మదిన్నె మండలం బోడేద్దులపల్లికి చెందిన మహిళ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తల్లి వివరాల ప్రకారం.. 11 సంవత్సరాల క్రితం భానుకు వివాహం చేశామని, అప్పటినుంచి ఆమెను భర్త, బంధువులు అదనపు కట్నం కోసం వేధిస్తూన్నారని తెలిపారు. వారి వేధింపులు తట్టుకోలేక ఆదివారం ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. ఈ విషయంపై నేడు పోలీసులు కేసు నమోదు చేశారు.
అన్నమయ్య జిల్లా 30 మండలాల పరిధిలోని పంచాయితీలలో పారిశుద్ధ్యం, తాగునీటి సమస్యలు, వీధిలైట్ల నిర్వహణ, పంచాయతీల ఫిర్యాదులకు సంబంధించి జిల్లా స్థాయిలో కాల్ సెంటర్ ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక హాలులో పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి జిల్లాస్థాయి కాల్ సెంటర్ ఏర్పాటు ప్రచార పోస్టర్లను ఆవిష్కరించారు.
సమస్యల పరిష్కారం కోసం జిల్లా కేంద్రానికి వచ్చే అర్జీదారులకు నాణ్యమైన పరిష్కారాలను చూపాలని, జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి అన్ని ప్రభుత్వ శాఖల అధికారులను ఆదేశించారు. నేడు కలెక్టరేట్లోని గ్రీవెన్స్ సెల్ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటితో పాటు అదితి సింగ్, డిఆర్వో గంగాధర్ గౌడ్, ఐసీడీఎస్ పీడీ శ్రీలక్ష్మీలు హాజరయ్యారు.
కడప జిల్లాలోని తెలుగు గంగ ప్రాజెక్టు అంతర్భాగమైన సబ్ రిజర్వాయర్-1లో ముగ్గురు గల్లంతైన విషయం తెలిసిందే. సోమవారం ఉదయం నుంచి గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులకు ఆ యువకుల మృతదేహాలు లభించాయి. ముగ్గురు కూడా ప్రొద్దుటూరు పట్టణం పవర్ హౌస్ రోడ్డుకు చెందిన వారిగా గుర్తించాయి. దీంతో వారి తల్లిదండ్రులు శోక సంద్రంలో మునిగిపోయారు.
దువ్వూరు మండలం చల్లబాసాయ పల్లె వద్ద సబ్సిడరీ రిజర్వాయర్-1లో ఆదివారం గల్లంతైన యువకుల ఆచూకీ లభించింది. ఘటనా స్థలంలోని సెల్‌ఫోన్ల ఆధారంగా ప్రొద్దుటూరుకు చెందిన ఎస్.కె ముదాపీర్(22), పఠాన్ రహమతుల్లా(23), వేంపల్లి సాహిద్(23) మునిగిపోయినట్లు గుర్తించారు. నిన్న సాయంత్రం ఈతకొట్టడానికి దిగి గల్లంతయ్యారు. గాలింపు చర్యలు కొనసాగుతుండగా ఎలాంటి ఆచూకీ లభించలేదు.
Sorry, no posts matched your criteria.