India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆసియా కప్ 2025 కోసం టీమ్ ఇండియా స్పాన్సర్ లేకుండానే బరిలోకి దిగుతోంది. తాజాగా శుభ్‌మన్ గిల్, శివమ్ దూబే ధరించిన జెర్సీలపై ఎలాంటి స్పాన్సర్ లోగో లేదు. దీంతో జట్టుకు ఎలాంటి స్పాన్సర్ లేరని అధికారికంగా తేలిపోయింది. మరోవైపు ఆసియాకప్‌లో పాకిస్థాన్‌తో భారత్ అన్ని మ్యాచులు ఆడుతుందని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పష్టం చేశారు. ద్వైపాక్షిక సిరీస్ మాత్రం ఎట్టిపరిస్థితుల్లో ఆడబోమని తెలిపారు.
రోజర్ బిన్నీ రాజీనామాతో బీసీసీఐ ప్రెసిడెంట్ పదవి ప్రస్తుతం ఖాళీగా ఉంది. దీంతో అధ్యక్ష ఎన్నికపై చర్చించేందుకు ఈనెల 28న బోర్డు సమావేశం కానుంది. అలాగే మిగతా పోస్టుల భర్తీపైనా చర్చించనుంది. అధ్యక్ష పదవికి ఎవరు పోటీ పడతారనేది ఇంకా తేలాల్సి ఉంది. కాగా అదేరోజు దుబాయ్‌లో ఆసియా కప్ ఫైనల్ జరగనుంది. దీంతో భారత్ ఫైనల్‌కు వెళ్తే BCCI నుంచి ఎవరూ హాజరుకాకపోవచ్చు.
దేశంలోని అర్హులైన నిరుద్యోగులందరికీ కేంద్రం నెలకు రూ.3,500 ఆర్థిక సాయం చేయనుందని, అప్లై చేసుకునే విధానం ఇదేనంటూ కొందరు యూట్యూబ్‌లో ప్రచారం చేస్తున్నారు. అయితే ఇలాంటి స్కీమ్‌లు కేంద్ర ప్రభుత్వం అమలు చేయట్లేదని PIB FactCheck వెల్లడించింది. ఇలాంటి తప్పుడు సమాచారాన్ని నమ్మొద్దని సూచించింది. ఇలాంటి పథకాలుంటే ప్రభుత్వమే ప్రకటిస్తుందని పేర్కొంది.
బీజేపీ ఎంపీలకు ఇవాళ రాత్రి ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ఇవ్వాల్సిన డిన్నర్ పార్టీ రద్దయింది. ఈనెల 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో తమ పార్టీ ఎంపీలకు విందు ఇవ్వాలని బీజేపీ ఇటీవల నిర్ణయించింది. అయితే పంజాబ్, J&K తదితర రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలతో 100 మందికి పైగా చనిపోవడంతో డిన్నర్ పార్టీని క్యాన్సిల్ చేశారు. ఈనెల 8న పీఎం నివాసంలో జరగాల్సిన NDA ఎంపీల విందు కూడా రద్దయింది.
AP: లిక్కర్ కేసు నిందితులైన ధనుంజయ్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డికి బెయిల్ వచ్చింది. విజయవాడ ఏసీబీ కోర్టు వీరికి బెయిల్ మంజూరు చేసింది. ఒక్కొక్కరూ రూ.లక్ష చొప్పున 2 ష్యూరిటీలు ఇవ్వాలని ఆదేశించింది. అలాగే, ముగ్గురూ పాస్‌పోర్టు వివరాలు అందించాలంది. ఇప్పటికే ఉప రాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా ఓటు వేసేందుకు ఎంపీ మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిల్ రాగా, ఆయన రాజమండ్రి జైలు నుంచి విడుదలయ్యారు.
హీరోయిన్ అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటించిన ‘ఘాటీ’ మూవీ తొలి రోజు రూ.5.33 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు తెలుస్తోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ రావడంతో తక్కువ కలెక్షన్లు వచ్చినట్లు సమాచారం. అనుష్క నటించిన రుద్రమదేవి మూవీ తొలి రోజు రూ.12 కోట్లు, భాగమతి సినిమా రూ.11 కోట్లు రాబట్టాయి. వాటితో పోల్చుకుంటే ఈ వసూళ్లు తక్కువేనని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
TG: హైదరాబాద్ శివారులో డ్రగ్స్ <<17630840>>ఫ్యాక్టరీ<<>> గుట్టు రట్టవడం సంచలనం రేపిన విషయం తెలిసిందే. మహారాష్ట్ర మీరా రోడ్లో గతనెల బంగ్లాదేశ్‌కు చెందిన ఫాతిమా రూ.24 లక్షల విలువైన డ్రగ్స్‌తో పోలీసులకు పట్టుబడింది. దీంతో తీగ లాగితే మేడ్చల్ జిల్లాలో కెమికల్ ఫ్యాక్టరీ పేరిట డ్రగ్స్ తయారుచేస్తున్నట్లు తేలింది. ఐటీ ప్రొఫెషనల్ అయిన వ్యక్తే తన తెలివితో కెమికల్స్ ద్వారా డ్రగ్స్ ఉత్పత్తి చేస్తున్నట్లు గుర్తించారు.
దుబాయ్‌లో జరిగిన SIIMA వేడుకలో అందుకున్న బెస్ట్ యాక్టర్(మేల్) అవార్డును తన అభిమానులకు అంకితం చేస్తున్నట్లు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. ‘ఎల్లప్పుడూ ప్రేమ, గుర్తింపు అందిస్తున్నందుకు SIIMAకి ధన్యవాదాలు. వరుసగా మూడు అవార్డులు గెలుచుకోవడం సంతోషంగా ఉంది. డైరెక్టర్ సుకుమార్, పుష్ప టెక్నీషియన్స్, నిర్మాతలు, చిత్ర బృందం వల్లే ఇది సాధ్యమైంది’ అని బన్ని రాసుకొచ్చారు.
మహారాష్ట్రకు చెందిన ఓ యువకుడు తనకు కాబోయే భార్యను రేప్ చేసి హతమార్చాడు. పాల్ఘర్కు చెందిన నీలేశ్ ధోంగ్డాకు, బిబల్దార్కు చెందిన ఓ మైనర్ బాలికకు పెళ్లి నిశ్చయమైంది. ఆ బాలిక ఒంటరిగా ఉన్న సమయంలో నీలేశ్ ఇంటికి వెళ్లాడు. శృంగారంలో పాల్గొనాలని బలవంతం చేయడంతో ఆమె అంగీకరించలేదు. దీంతో ఆమెపై అత్యాచారం చేసి, ఉరేసి చంపాడు. యువతి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు విచారించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
<
Sorry, no posts matched your criteria.