news

News September 6, 2025

BREAKING: ఇండియా-A కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్

image

ఇండియా-A జట్టు కెప్టెన్‌గా స్టార్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్‌ను బీసీసీఐ నియమించింది. ఈ నెల 19 నుంచి ఆస్ట్రేలియా Aతో జరగబోయే రెండు మల్టీ డే మ్యాచుల కోసం జట్టును ఎంపిక చేసింది. జట్టు: అయ్యర్ (C), ఈశ్వరన్, జగదీశ్వరన్(WK), సాయి సుదర్శన్, ధ్రువ్ జురేల్ (VC&WK), దేవదత్ పడిక్కల్, హర్ష్ దూబే, ఆయుష్ బదోనీ, నితీశ్ రెడ్డి, తనుష్ కోటియన్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, ఖలీల్ అహ్మద్, మానవ్ సుతార్, యశ్ ఠాకూర్

News September 6, 2025

గర్భిణులు రోజుకెంత ఉప్పు తీసుకోవాలంటే..

image

గర్భిణులు ఆహారం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ రోజుకి ఎంత ఉప్పు తినాలో కొందరికి తెలియదు. గర్భిణులు రోజుకి 3.8-5.8 గ్రాముల ఉప్పు తీసుకోవాలి. దీని కంటే ఎక్కువగా తీసుకుంటే కాళ్లు, చేతుల వాపులు, తరచుగా మూత్రవిసర్జన, అధిక రక్తపోటు సమస్యలు వస్తాయని గైనకాలజిస్ట్‌లు చెబుతున్నారు. మరీ తక్కువ ఉప్పు తీసుకున్నా బలహీనత, నీరసం వస్తాయి. కాబట్టి సరైన మోతాదులో ఉప్పు తీసుకోవాలని సూచిస్తున్నారు.

News September 6, 2025

నేను కాదు..మనం అనుకుంటేనే..

image

ఏ బంధంలోనైనా మొదట్లో ఉండే ప్రేమ తర్వాత కనిపించదు. చిన్నప్పటి నుంచి ప్రతి అంశంలో నేను అనే భావన ఉంటుంది. అయితే పెళ్లి తర్వాత ఆ భావనను క్రమంగా తగ్గించుకొని మనం అనుకోవాలి. సినిమా, షాపింగ్, స్నేహితులను కలవడానికి భాగస్వామితో కలిసి వెళ్లాలి. అప్పుడే దంపతుల మధ్య దూరం పెరగకుండా ఉంటుంది. పనులెన్నున్నా రోజూ కొంత సమయం జీవితభాగస్వామి కోసం వెచ్చించాలి. కష్ట సుఖాలే కాదు, అభిరుచులు, ఆసక్తి వంటివన్నీ పంచుకోవాలి.

News September 6, 2025

BREAKING: హైదరాబాద్‌లో డ్రగ్స్ తయారీ ఫ్యాక్టరీ గుట్టు రట్టు

image

హైదరాబాద్‌ శివారులో డ్రగ్స్ తయారీ ఫ్యాక్టరీ వెలుగుచూడటం సంచలనంగా మారింది. ముంబై క్రైమ్ బ్రాంచ్ ఆపరేషన్ చేపట్టి మేడ్చల్ జిల్లాలో దీన్ని గుర్తించింది. సుమారు రూ.12వేల కోట్ల డ్రగ్స్ , 32వేల లీటర్ల ముడి పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. 13 మందిని అరెస్ట్ చేశారు. ఇక్కడి నుంచే దేశవ్యాప్తంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు తేల్చారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News September 6, 2025

AI ఎఫెక్ట్: 2030 కల్లా 99% ఉద్యోగాలు మటాష్!

image

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఎఫెక్ట్‌తో 2030 కల్లా 99 శాతం ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని USలోని యూనివర్సిటీ ఆఫ్ లూయిస్‌విల్లే ప్రొఫెసర్ రోమన్ యంపోల్‌స్కీ అంచనా వేశారు. ఈ నష్టాన్ని పూడ్చేందుకు ప్లాన్ బీ కూడా లేదని చెప్పారు. ఏఐతో కంపెనీలకు మరింత ఆదాయం వస్తుందని, అందువల్లే దీని ప్రాధాన్యం పెరుగుతోందన్నారు. ఏఐ దెబ్బకు కోడర్స్, ప్రాంప్ట్ ఇంజినీర్లూ ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుందని పేర్కొన్నారు.

News September 6, 2025

రానున్న 2-3గంటల్లో వర్షం

image

TG: రాష్ట్రంలో రానున్న 2-3గంటల్లో వర్షం పడుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. భద్రాద్రి, జనగాం, కామారెడ్డి, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మెదక్, మేడ్చల్, ములుగు, నిర్మల్, నిజామాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో వర్షాలకు ఛాన్స్ ఉందని పేర్కొంది. ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మరోవైపు HYDలో రాబోయే గంట సేపట్లో తేలిక నుంచి మోస్తరు వర్షం కురుస్తుందని అంచనా వేసింది.

News September 6, 2025

స్పాన్సర్ లేకుండానే భారత జెర్సీలు.. పిక్స్ వైరల్

image

ఆసియా కప్ కోసం టీమ్ ఇండియా కసరత్తులు మొదలుపెట్టింది. ఈ క్రమంలో స్పాన్సర్ లోగో లేని జెర్సీలు ధరించి టీమ్ ఇండియా క్రికెటర్లు ప్రాక్టీస్ చేశారు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, గిల్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య తదితరులు నెట్స్‌లో తీవ్రంగా చెమటోడ్చారు. కాగా టీమ్ ఇండియా స్పాన్సర్‌గా ఉన్న డ్రీమ్ 11ను బీసీసీఐ తప్పించిన విషయం తెలిసిందే. ఈ నెల 9 నుంచి దుబాయ్‌లో ఆసియా కప్ ప్రారంభం కానుంది.

News September 6, 2025

మైండ్ మ్యాపింగ్.. ప్రిపరేషన్‌లో గొప్ప సాధనం

image

పుస్తకంలోని కాన్సెప్టులు, మీ ఆలోచనలను అనుసంధానం చేసేలా విజువల్ రేఖాచిత్రాలను రూపొందించుకోవడాన్నే మైండ్ మ్యాపింగ్ అంటారు. ప్రిపరేషన్‌లో స్టడీ స్కిల్స్‌ను పెంపొందించడంలో ఇదొక గొప్ప సాధనం. పెద్ద సబ్జెక్టును చిన్న విభాగాలుగా విభజించుకుని గ్రాఫిక్ రూపంలో చదివితే అయోమయం తగ్గుతుంది. ఫోకస్, మెమరీ, సృజనాత్మకత పెరుగుతుంది. రివిజన్‌కు అనుకూలంగా ఉంటుంది. సమయం ఆదా అవుతుంది.

News September 6, 2025

కార్లు కొనే వారికి ‘మహీంద్రా’ బంపరాఫర్

image

GST సవరణలో భాగంగా పలు కార్ల ధరలు భారీగా తగ్గనున్న విషయం తెలిసిందే. ఈ నెల 22 నుంచి తగ్గిన ధరలు అమలులోకి రానున్నాయి. కానీ మహీంద్రా కంపెనీ ముందే శుభవార్త చెప్పింది. ఇవాళ్టి నుంచే వారి SUV వాహనాలపై జీఎస్టీ బెనిఫిట్స్ అందుబాటులో ఉంటాయని పేర్కొంది. రూ.1.56 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చని తెలిపింది. ‘ప్రామిస్ చేయడమే కాదు.. చేసి చూపిస్తాం. థాంక్యూ మహీంద్రా ఆటో’ అని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.

News September 6, 2025

ఆయిల్ ఇండియా లిమిటెడ్‌లో 102 పోస్టులు

image

ఆయిల్ ఇండియా లిమిటెడ్‌లో 102 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు ఈనెల 26వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రేడ్-Cలో 3 పోస్టులు, గ్రేడ్-Bలో 97పోస్టులు, గ్రేడ్-Aలో 2పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి బీఈ, బీటెక్, PG, MBA, PGBM, CA, ICWA, CS ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. CBT, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయనున్నారు.
వెబ్‌సైట్: <>https://www.oil-india.com/<<>>