India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: హైదరాబాద్‌లోని కోఠి SBI కార్యాలయం వద్ద దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ATMలో నగదు డిపాజిట్ చేయడానికి వచ్చిన రిషద్ అనే వ్యక్తిపై కాల్పులు జరిపారు. అతని వద్దనున్న రూ.6 లక్షలు దోపిడీ చేశారు. కాల్పుల్లో రిషద్ కాలికి గాయం కాగా.. ఆస్పత్రికి తరలించారు. పోలీసులు CCTV దృశ్యాలను పరిశీలిస్తున్నారు.

కుటుంబంలో భార్యాభర్తలిద్దరూ మాట్లాడుకునే సమయం లేనప్పుడు బంధం దూరం అవుతుంటుంది. దీని వల్ల మనస్పర్థలు పెరిగి తరచూ గొడవలు వస్తుంటాయి. అందుకే ఇద్దరు కూడా అన్ని విషయాలలో ఒకరికొకరు షేర్ చేసుకోవడం ఎంతో మంచిదంటున్నారు రిలేషన్‌షిప్ నిపుణులు. ఇద్దరు కూడా కుటుంబం గురించి మాట్లాడుకోవడం, ఆర్థికపరమైన విషయాలు చర్చించుకోవాలంటున్నారు. కమ్యునికేషన్ బావుంటే ఇబ్బందులుండవని సూచిస్తున్నారు.

ఆదిత్యుడు – సప్త అశ్వాల రథం
చంద్రుడు – పది తెలుపు గుర్రాల రథం
అంగారకుడు – మేక
బుధుడు – సింహం
గురు – గజరాజు
శుక్రుడు – ఒంటె/గుర్రం/మొసలి
శని – కాకి
రాహువు – సింహం
కేతువు – గద్ద/రాబందు/డేగ

గోల్డ్, సిల్వర్ రేట్లు నిన్న భారీగా పతనమవడం ఇన్వెస్టర్లను షాక్‌కు గురి చేసింది. ఇవాళ కూడా రేట్లు తగ్గుతాయేమోనని భయపడుతున్నారు. అటు అవసరం కోసం కొనాలనుకునేవారు మరింత తగ్గాలని ఆశగా ఎదురుచూస్తున్నారు. అలాంటివారు మరికొద్దిరోజులు వేచి చూడటం/విడతల వారీగా కొనడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లు దీన్ని అవకాశంగా మలుచుకోవాలని, స్వల్పకాలిక ట్రేడర్లు జాగ్రత్త పడాలని చెబుతున్నారు.

U19 WCలో రేపు ZIM వేదికగా IND, PAK తలపడనున్నాయి. ఇప్పటికే మూడు జట్లు (AUS, AFG, ENG) సెమీస్ చేరాయి. మిగిలిన స్థానం కోసం IND, PAK మధ్య పోటీ ఉంది. ప్రస్తుతం పాయింట్స్ టేబుల్‌లో IND 6, PAK 4 పాయింట్లతో ఉన్నాయి. టీమిండియా రన్ రేట్ కూడా మెరుగ్గా ఉంది. దీంతో PAK సెమీస్ చేరాలంటే 105 లేదా అంతకంటే ఎక్కువ రన్స్ తేడాతో గెలవాలి. ఒకవేళ ఛేజింగ్ అయితే 251 పరుగులను 29.4 ఓవర్లలో ఛేదించాల్సి ఉంటుంది.

AP: తిరుమలలో శనివారం భక్తుల రద్దీ మోస్తరుగా ఉంది. టోకెన్లు లేనివారికి శ్రీవారి దర్శనానికి 10 గంటల వరకు సమయం పడుతోంది. అటు వేంకటేశ్వరుడి దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 12 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న 69,254 మంది భక్తులు స్వామిని దర్శించుకోగా 20,954 మంది తలనీలాలు సమర్పించారు. అదే రోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.35కోట్లుగా నమోదైనట్లు TTD తెలిపింది.

శరీరంలో కొన్నిభాగాల్లో వచ్చే నొప్పులు థైరాయిడ్ అసమతుల్యతకు సూచన అని నిపుణులు అంటున్నారు. సాధారణంగా థైరాయిడ్ హార్మోన్లలో అసమతుల్యత ఉంటే ఎముకలను బలహీనపరుస్తుంది. ఇది వివిధ ప్రదేశాలలో నొప్పికి దారితీస్తుంది. మెడ, దవడ, చెవి నొప్పులు తరచూ వస్తుంటే థైరాయిడ్ పరీక్ష చేయించుకోవడం మంచిది. వీటితో పాటు కండరాల నొప్పి, కీళ్లు, మోకాళ్ల నొప్పి ఎక్కువగా వస్తున్నా వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.

రేపు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చరిత్ర సృష్టించనున్నారు. ఇండియన్ హిస్టరీలో ఒకే ప్రధానమంత్రి (నరేంద్ర మోదీ) హయాంలో వరుసగా 9 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఏకైక ఆర్థిక మంత్రిగా అరుదైన రికార్డు నెలకొల్పనున్నారు. గతంలో మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ 10 సార్లు, చిదంబరం 9 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టినా.. అవి వేర్వేరు ప్రధానుల కాలంలో జరిగాయి.

శనైశ్చరుడు విష్ణు భక్తుడు కావడంతో మాఘమాసంలో వచ్చే శని త్రయోదశిని ఎంతో విశిష్టమైనదిగా భావిస్తారు. ఈరోజు చేసే పరిహారాలు, దానాలు రెట్టింపు ఫలితాన్ని అందిస్తాయని పండితుల మాట. ‘సా.5.15-5.45 గంటల మధ్య శివునికి అభిషేకం చేస్తే శని పీడల నుంచి త్వరగా విముక్తి లభిస్తుంది. గుడికి వెళ్లలేని వారు ఇంట్లోనే పడమర దిక్కున నువ్వుల నూనెతో 8 ఒత్తులను ఒకటిగా చేసి దీపం వెలిగించుకోండి’ అని చెబుతున్నారు.

కోళ్ల పెంపకంలో అతి ప్రధాన సమస్య వ్యాధులు రావడం. వీటిని సకాలంలో గుర్తించి, నివారించకుంటే తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. కోళ్లలో అతి ప్రమాదకరమైనది కొక్కెర వ్యాధి. దీంతోపాటు కొరైజా, అమ్మోరు/మశూచి, పుల్లొరం, తెల్లపారుడు వ్యాధులు పెంపకందారులకు, ఫౌల్ట్రీ పరిశ్రమకు తీవ్ర నష్టం కలిగిస్తాయి. వీటిని కోళ్లలో ఎలా గుర్తించాలి? నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట క్లిక్<<>> చేయండి.
Sorry, no posts matched your criteria.