news

News February 1, 2026

‘మహామాఘి’ అంటే తెలుసా?

image

ఏడాదిలో వచ్చే 12 పౌర్ణమిలలో మాఘ పౌర్ణమి అతి పవిత్రమైనది. అందుకే దీనిని ‘మహామాఘి’ అంటారు. ఈరోజున చంద్రుడు మఖ నక్షత్రంతో ఉండటం వల్ల ఈ పేరు వచ్చింది. ఇది హరిహరులకు ప్రీతికరమైన రోజు. ఈ మాసంలో దేవతలందరూ గంగానదిలో నివసిస్తారట. అందుకే నేడు చేసే నదీ స్నానం అనంతమైన పుణ్యఫలాన్ని, మోక్షాన్ని ప్రసాదిస్తుంది. ఈ పర్వదినం మానవాళికి ఆధ్యాత్మిక శక్తిని, ఆరోగ్యకరమైన జీవనానికి కావలసిన సంకల్పాన్ని అందిస్తుంది.

News February 1, 2026

NABARDలో 162 పోస్టులు.. దరఖాస్తుకు ఎల్లుండే లాస్ట్ డేట్

image

<>NABARD<<>>లో 162 డెవలప్‌మెంట్ అసిస్టెంట్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే(FEB 3) ఆఖరు తేదీ. ఏదైనా డిగ్రీలో కనీసం 50% మార్కులతో ఉత్తీర్ణులైన వారు అప్లై చేసుకోవచ్చు. మెత్తం పోస్టుల్లో APలో 8 పోస్టులు ఉన్నాయి. అభ్యర్థుల వయసు 21 -35ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. ప్రిలిమినరీ ఎగ్జామ్ ఫిబ్రవరి 21న, మెయిన్ ఎగ్జామ్ ఏప్రిల్ 12న నిర్వహిస్తారు. వెబ్‌సైట్: https://www.nabard.org

News February 1, 2026

మిల్లర్లు, వినియోగదారులు ఎక్కువగా ఇష్టపడే వరి రకాలు

image

అత్యధిక దిగుబడి, అధిక బియ్యం నాణ్యత, చీడపీడలను తట్టుకునే కొన్ని వరి రకాలకు మిల్లర్లు, వినియోగదారుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. సన్నగింజ రకాలైన BPT 5204(సాంబ మషూరి), WGL-44(సిద్ధి), KNM-1638(కూనారం వరి-2) వీటికి మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. అలాగే అతి సన్న రకాలైన RNR 15048(తెలంగాణ సోన), జై శ్రీరామ్, HMT సోన.. దొడ్డు పొడవు గింజ రకాలైన MTU-1010, KNM 118లకు కూడా మంచి ఆదరణ ఉంది.

News February 1, 2026

కేంద్రానికి ఆదాయం ఎలా వస్తుందంటే.. 1/2

image

కేంద్ర ప్రభుత్వానికి వివిధ మార్గాల ద్వారా ఆదాయం వస్తుంది. 2025 బడ్జెట్ అంచనాల ప్రకారం ప్రతి రూపాయిలో 39 పైసలు ప్రత్యక్ష పన్నుల(వ్యక్తులు-22 పైసలు, కార్పొరేట్ ట్యాక్స్-17 పైసలు) రూపంలో వస్తాయి. జీఎస్టీ-18 పైసలు, ఎక్సైజ్ డ్యూటీ-5 పైసలు, కస్టమ్స్ డ్యూటీ-4 పైసలు, రుణాలు, ఇతర అప్పుల ద్వారా-24 పైసలు, పన్నేతర ఆదాయం-9 పైసలు, నాన్ డెబిట్ క్యాపిటల్ రిసీప్ట్స్ ద్వారా-1 పైసా వస్తుంది.

News February 1, 2026

ప్రతి రూపాయి ఖర్చు ఇలా.. 2/2

image

కేంద్రానికి వచ్చే ఆదాయంలో ఎక్కువ షేర్ రాష్ట్రాలకు అందుతుంది. ట్యాక్స్, డ్యూటీస్ వాటా కింద ప్రతి రూపాయిలో 22 పైసలు వెళ్తుంది. వడ్డీ చెల్లింపులకు 20 పైసలు, కేంద్ర రంగ పథకాలకు 16 పైసలు, కేంద్ర ప్రాయోజిత పథకాలకు 8 పైసలు వెళ్తాయి. డిఫెన్స్ సెక్టార్‌కు 8 పైసలు, ఫైనాన్స్ కమిషన్‌కు 8 పైసలు, సబ్సిడీలకు 6 పైసలు, పెన్షన్లకు 4 పైసలు ఖర్చు చేస్తారు. 8 పైసలను పాలన, ప్రభుత్వ వ్యయాల వంటి వాటికి ఉపయోగిస్తారు.

News February 1, 2026

బడ్జెట్‌కు కేంద్ర క్యాబినెట్ ఆమోదం.. కాసేపట్లో ప్రసంగం

image

కాసేపట్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో కేంద్ర క్యాబినెట్ భేటీ అయింది. 2026-27 వార్షిక పద్దుకు ఆమోదం తెలిపింది. ముందుగా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్రపతిని కలిసి బడ్జెట్‌కు అనుమతి తీసుకున్నారు. అక్కడి నుంచి ఆమె పార్లమెంటుకు చేరుకొని ప్రధాని మోదీ అధ్యక్షతన జరుగుతున్న క్యాబినెట్ భేటీలో పాల్గొన్నారు. 11 గంటలకు బడ్జెట్ ప్రసంగం ప్రారంభం కానుంది.

News February 1, 2026

రాత్రి నుంచి పోలీస్ స్టేషన్‌లోనే అంబటి రాంబాబు

image

AP: సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్టైన వైసీపీ నేత అంబటి రాంబాబు నిన్న రాత్రి 11 గంటల నుంచి గుంటూరులోని నల్లపాడు పోలీస్ స్టేషన్‌లో ఉన్నారు. ఈ మధ్యాహ్నం తర్వాత ఆయన్ను జడ్జి ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. రాత్రి ఆయనకు ఇంటి నుంచి తీసుకొచ్చిన బీపీ, షుగర్ టాబ్లెట్లను అందించారు. మరోవైపు PS వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

News February 1, 2026

కిచెన్ గార్డెన్‌కి ఈ మొక్కలు సెట్

image

ఇంటి తోటలోనే కాకుండా వంటింట్లో ఖాళీ స్థలం ఉంటే అక్కడా మనకు కావాల్సిన పచ్చదనాన్ని పెంచేయొచ్చు. ఆ మొక్కలేవో చూసేద్దాం రండి. వామాకు, కొత్తిమీర, పుదీనా, తులసి వంటి మొక్కలు సులువుగా, తక్కువ ఎండలో కూడా పెరుగుతాయి. వీటిని కిచెన్ గార్డెన్‌లో పెంచడం వల్ల ఆరోగ్యంతో పాటు గాలి కూడా శుద్ధి అవుతుందని నిపుణులు చెబుతున్నారు.

News February 1, 2026

డ్యూటీలో ప్రాణాలు కోల్పోవడంపై సీఎం ఆవేదన

image

TG: నిజామాబాద్‌కు చెందిన ఎక్సైజ్ కానిస్టేబుల్ <<19017490>>సౌమ్య<<>> మృతి ప‌ట్ల ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. విధి నిర్వహ‌ణ‌లో ప్రాణాలు కోల్పోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. సౌమ్య మృతికి కార‌ణ‌మైన వారిపై క‌ఠిన‌చ‌ర్య‌లు తీసుకోవాల‌ని పోలీసు అధికారుల‌ను ఆదేశించారు. ఆమె కుటుంబానికి ప్ర‌భుత్వం అన్ని విధాలుగా అండ‌గా ఉంటుంద‌ని సీఎం హామీ ఇచ్చారు.

News February 1, 2026

కాటన్ యూనివర్సిటీలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు

image

గువాహటిలోని కాటన్ యూనివర్సిటీలో 9 జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు హార్డ్ కాపీ, డాక్యుమెంట్స్‌ను ఫిబ్రవరి 9 వరకు పోస్ట్ చేయాలి. దరఖాస్తు ఫీజు రూ.1000, SC,STలకు రూ.500. వెబ్‌సైట్: https://cottonuniversity.ac.in/