news

News November 4, 2025

ఏపీ రౌండప్

image

* విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ అధీనంలోనే ఉందన్న కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ
* ఎస్టీ కమిషన్ ఛైర్మన్‌గా బొజ్జిరెడ్డిని నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు
* ఇవాళ టీడీపీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరుకానున్న ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్, ఎంపీ కేశినేని చిన్ని.. కేంద్ర కార్యాలయానికి లోకేశ్
* రాష్ట్రంలో తుఫాను ప్రభావంతో 1,49,302 హెక్టార్లలో పంట నష్టం!

News November 4, 2025

సమానత్వం అప్పుడే ఎక్కువ

image

మహిళలు అనునిత్యం అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నా పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. కానీ ఇప్పటికీ కొన్నిచోట్ల సమానత్వం అన్నది పుస్తకాలకే పరిమితమైంది. అయితే పురాతన కాలంలోనే ఈజిప్టు మహిళల్ని పురుషులతో సమానంగా పరిగణించేవారట. వాళ్లకంటూ సొంత ఆస్తులు, విడాకులు తీసుకునే హక్కులతోపాటు మత, రాజకీయ పదవులూ కలిగి ఉండేవారని తొలి పురావస్తు రికార్డులు చెబుతున్నాయి.

News November 4, 2025

జబ్బార్ ట్రావెల్స్ బస్సు బోల్తా.. ఒకరి మృతి

image

AP: సత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి మండలం దామాజిపల్లి సమీపంలోని జాతీయ రహదారిపై ఈ ఉదయం జబ్బార్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో సురక్ష (30) అనే మహిళ మృతి చెందింది. బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సుకు ఐషర్ వాహనం అడ్డురావడంతో అదుపు తప్పినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో మరో 8 మంది గాయపడ్డారు. వారిని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది ఉన్నారు.

News November 4, 2025

చలికాలంలో చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే..

image

చలికాలంలో చర్మం నిస్తేజంగా, పొడిగా మారుతుంది. ఇలా కాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. రోజుకు రెండుసార్లు మాయిశ్చరైజర్ రాయడంతో పాటు స్నానానికి గోరువెచ్చని నీరే వాడాలని చెబుతున్నారు. నిద్రపోయే ముందు నూనె, లోతైన మాయిశ్చరైజర్​లతో స్కిన్ కేర్ చేసుకోవాలి. దీనివల్ల మృదువైన చర్మాన్ని పొందొచ్చు. తగినంత నీరు తాగాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే చలికాలంలో చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.

News November 4, 2025

DRDOలో 105 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

బెంగళూరులోని DRDO ఎలక్ట్రానిక్స్ అండ్ రాడార్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (LRDE)లో 105 అప్రెంటీస్‌ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి సంబంధిత విభాగాల్లో ITI, డిప్లొమా, ఇంజినీరింగ్ డిగ్రీ పాసైనవారు అప్లై చేసుకోవచ్చు. ముందుగా apprenticeshipindia.gov.in పోర్టల్‌లో ఎన్‌రోల్ చేసుకోవాలి. గేట్ స్కోరు, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: www.drdo.gov.in/

News November 4, 2025

చల్లని vs వేడి నీళ్లు.. పొద్దున్నే ఏవి తాగాలి?

image

ఉదయాన్నే ఓ గ్లాసు నీళ్లు తాగితే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. ‘గోరువెచ్చటి నీటికి జీర్ణ ప్రక్రియ మెరుగవుతుంది. డిటాక్సిఫికేషన్, రక్త ప్రసరణ మెరుగవుతుంది. ఓ గ్లాసు చల్లటి నీళ్లు తాగితే క్యాలరీలు బర్న్ అవుతాయి. రిఫ్రెషింగ్ ఫీలింగ్ కలుగుతుంది. చల్లటి నీటికి శరీరం వేగంగా హైడ్రేట్ అవుతుంది’ అని చెబుతున్నారు. మీ అవసరాలను బట్టి గోరువెచ్చటి లేదా చల్లటి నీరు తీసుకోవచ్చని సూచిస్తున్నారు.

News November 4, 2025

వయ్యారిభామను కట్టడి చేసే కలుపు మందులు

image

వయ్యారిభామ నిర్మూలనకు పంట మొలకెత్తక ముందు అట్రాజిన్ రసాయన మందును లీటర్ నీటికి నాలుగు గ్రాములు కలిపి పిచికారీ చేయాలి. పంట మొలకెత్తిన 15 నుంచి 20 రోజులకు.. లీటరు నీటికి 2 గ్రాముల 2,4-డి సోడియం సాల్ట్ కలిపి పిచికారీ చేయాలి. బంజరు భూముల్లో లీటరు నీటికి 5 గ్రాముల అట్రాజిన్ మందు కలిపి పిచికారీ చేసి వయ్యారిభామను నివారించవచ్చు. కలుపు నివారణ మందులను పిచికారీ చేసేటప్పుడు పక్క పంటలపై పడకుండా జాగ్రత్తపడాలి.

News November 4, 2025

ఇతిహాసాలు క్విజ్ – 56

image

1. కౌరవ, పాండవుల గురువైన ద్రోణాచార్యుడి గురువు ఎవరు?
2. మేఘనాదుడు ఎవరిని పూజించడం వల్ల ఇంద్రజిత్ అయ్యాడు?
3. నవ విధ భక్తి మార్గాలలో మొదటిది ఏమిటి?
4. ప్రతి మాసంలో వచ్చే పన్నెండో తిథి పేరు ఏమిటి?
5. సీత స్వయంవరం లో ఉన్న శివధనుస్సు అసలు పేరు ఏమిటి?
– సరైన సమాధానాలను సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం. <<-se>>#Ithihasaluquiz<<>>

News November 4, 2025

తెలంగాణ రౌండప్

image

✒ నెలఖారులోగా ఉచిత చేపపిల్లల పంపిణీ చేయాలని మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశాలు
✒ ఎకరాకు 7 క్వింటాళ్ల పత్తి కొనుగోలుకు పరిమితి విధించిన సీసీఐ. నిబంధనలు ఎత్తివేయాలని కేంద్రానికి మంత్రి తుమ్మల లేఖ.
✒ వచ్చే నెల 19-29 వరకు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో పుస్తక ప్రదర్శన
✒ ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టు నిర్మణానికి 700 ఎకరాల భూసేకరణకు ప్రభుత్వం అనుమతి

News November 4, 2025

మెడికల్ ఎగ్జామినేషన్‌లో ప్రైవసీ

image

BNS సెక్షన్ 53(2) ప్రకారం, క్రిమినల్ కేసుల వైద్యపరీక్షల సమయంలో ఒక మహిళను వైద్యురాలు లేదా ఆమె పర్యవేక్షణలో మాత్రమే పరీక్షించాలి. సెన్సిటివ్‌ మెడికల్‌ ప్రొసీజర్స్‌లో మహిళల కంఫర్ట్‌, కన్సెంట్‌, డిగ్నిటీ కాపాడేందుకు ఈ హక్కు కల్పించారు. అలాగే సెక్షన్ 179 ప్రకారం మహిళలను విచారణ కోసం పోలీస్‌స్టేషన్‌కు పిలవకూడదు. పోలీసులే ఆమె ఇంటికి వెళ్లాలి. ఆ సమయంలో ఒక మహిళా పోలీసు అధికారి తప్పనిసరిగా ఉండాలి.