India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

తెగులు ఆశించిన కొమ్మలను, కాయలను కత్తిరించి నాశనం చేయాలి లేదా కాల్చివేయాలి. తోటలో చెట్ల పాదుల్లో ఎకరాకు 8-10KGల బ్లీచింగ్ పౌడరును చల్లాలి. మొక్కలలో తెగులు లక్షణాలు కనిపిస్తే లీటరు నీటికి బ్లైటాక్స్ 3గ్రా.+ స్ట్రెప్టోసైక్లిన్ 0.2గ్రా కలిపి మొక్క బాగాలు తడిచేటట్లు స్ప్రే చేయాలి. ఈ మందులు పిచికారీ చేసిన వారం, 10 రోజుల తర్వాత కాసుగామైసిన్ (లీటరు నీటికి 3ml)ను స్ప్రే చేస్తే మంచి ఫలితాలు వస్తాయి.

AP: రాష్ట్రంలో పవర్ గ్రిడ్‌ను బలోపేతం చేసేందుకు రూ.9,319.30 కోట్లతో 55 ట్రాన్స్‌మిషన్ ప్రాజెక్టులు చేపడుతున్నట్లు ట్రాన్స్‌కో జేఎండీ ప్రవీణ్ చంద్ తెలిపారు. వీటితో గ్రిడ్‌కు అదనంగా 8,853 MVA సామర్థ్యం చేరనుందని అన్నారు. ఇప్పటికే 3,240 MVA విస్తరణతో పాటు 950 సర్క్యూట్ కిలోమీటర్ల లైన్లు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. కొత్త ప్రాజెక్టులతో మరో 1,558 సర్క్యూట్ కి.మీ. అందుబాటులోకి వస్తాయన్నారు.

దానిమ్మలో బ్యాక్టీరియా మచ్చ తెగులు పంట దిగుబడిని, కాపుకొచ్చిన కాయల నాణ్యతనూ తగ్గిస్తోంది. తెగులుకు కారణమయ్యే బ్యాక్టీరియా.. మొక్క ఆకులు, రెమ్మలు, కాయలపైన మచ్చలను కలగజేస్తుంది. ఈ తెగులుకు గురైన మొక్క ఆకులు రాలిపోవడం, కొమ్మలు విరిగిపోవడం జరుగుతుంది. కాయలపై ముదురు గోధుమ రంగు నుంచి నలుపు రంగు గరుకు మచ్చలు ఏర్పడతాయి. ఈ మచ్చల మధ్యభాగంలో కాయలపై పగుళ్లు ఏర్పడి మార్కెట్‌కు పనికిరాకుండాపోతాయి.

TG: ఆసియాలోనే అతిపెద్దదైన మేడారం గిరిజన మహాజాతరకు సర్వం సిద్ధమైంది. రేపటి నుంచి సమ్మక్క-సారలమ్మ వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఈసారి జాతరను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం రూ.251Crతో ఆలయ పునరుద్ధరణ చేపట్టింది. సుమారు 3Cr మంది భక్తులు వస్తారని అధికారుల అంచనా. రాష్ట్రం నలుమూలల నుంచి TGSRTC 4వేల ప్రత్యేక బస్సులు నడుపుతోంది. 15 వేల మంది సిబ్బందితో పోలీసు శాఖ భారీ బందోబస్తు నిర్వహిస్తోంది.

సాధారణంగా వర్షాలు సరిగా కురవక, ఎండలు ఎక్కువగా ఉండి కరవు పరిస్థితులు ఉన్నప్పుడు మామిడి చెట్లు విపరీతంగా కాస్తాయి. వాతావరణంలో వేడి పెరిగే కొద్దీ మామిడి పండ్ల దిగుబడి, తీపి పెరుగుతాయి. అలాగే వర్షాలు సమృద్ధిగా కురిసి, వాతావరణం చల్లబడినప్పుడు నేరేడు పండ్లు పుష్కలం వస్తాయి. కరవు సమయంలో ఆహారం కోసం మామిడి పండ్లను, వానాకాలంలో ఆరోగ్యానికి మేలు చేసే నేరేడు పండ్లను ప్రకృతి మనకు ప్రసాదిస్తుందని ఈ సామెత అర్థం.

స్కంద పురాణం ప్రకారం.. పూర్వం రామకృష్ణుడు అనే మహర్షి వేంకటాద్రి పర్వతాలపై కఠోర తపస్సు చేశారు. నిత్య స్నానాదుల కోసం ఈ తీర్థాన్ని నిర్మించుకున్నారు. అక్కడే నివసిస్తూ మహావిష్ణువును ధ్యానించారు. మహర్షి భక్తికి మెచ్చిన స్వామివారు ప్రత్యక్షమై ఆయనకు ముక్తిని ప్రసాదించారు. అందుకే ఈ తీర్థానికి ఆయన పేరొచ్చింది. ఈ ప్రదేశంలో రాముడు, కృష్ణుడి విగ్రహాలుంటాయి. అందుకే దీన్ని ‘రామకృష్ణ తీర్థం’ అంటారని మరో గాథ.

రామకృష్ణ తీర్థం తిరుమల శ్రీవారి ఆలయానికి సుమారు 10km దూరంలో ఉంటుంది. దట్టమైన శేషాచల అడవుల మధ్య ఉండే ఈ తీర్థాన్ని పవిత్రంగా కొలుస్తారు. యాత్రికులు ముందుగా తిరుమల నుంచి బస్సు/సొంత వాహనాల్లో పాపవినాశనం చేరుకుంటారు. అక్కడి నుంచి సుమారు 6KM దూరంలో ఈ తీర్థం ఉంటుంది. రాళ్లు, రప్పలు, నీటి వాగుల గుండా ట్రెక్కింగ్ చేస్తూ వెళ్తే ఈ పవిత్ర తీర్థం వస్తుంది. ఇది ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా, అతి రమణీయంగా ఉంటుంది.

వారానికి 5 రోజుల పని అమలుకు డిమాండ్ చేస్తూ బ్యాంకు ఉద్యోగులు నేడు సమ్మెకు దిగనున్నారు. ఇటీవల చీఫ్ లేబర్ కమిషనర్‌తో జరిగిన చర్చలు విఫలమవడంతో యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ సమ్మెకు పిలుపునిచ్చింది. దీంతో SBI, PNB, BOB, యూనియన్ తదితర బ్యాంకుల సేవల్లో ఈరోజు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. ఈ యూనియన్లలో లేని HDFC, ICICI, యాక్సిస్ వంటి బ్యాంకుల సేవలు యథాతథంగా కొనసాగనున్నాయి.

తమిళ హీరో, TVK అధినేత విజయ్ నటించిన చివరి సినిమా ‘జననాయగన్’ (తెలుగులో జన నాయకుడు) సెన్సార్ కేసులో నేడు తీర్పు వెలువడనుంది. సెన్సార్ <<18907956>>వివాదంపై<<>> మద్రాస్ హైకోర్టు ఇటీవల తీర్పును రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే. అనుకూలంగా తీర్పు వస్తే ఫిబ్రవరి 6న మూవీని రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. హెచ్.వినోద్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజు నటించారు.

మాఘ పౌర్ణమి నాడు ఈ తీర్థంలో ముక్కోటి వేడుక వైభవంగా సాగుతుంది. ఆరోజు ఉదయం శ్రీవారి ఆలయ అర్చకులు మంగళవాయిద్యాల నడుమ పూలు, పండ్లు, ప్రసాదాలు, పూజా సామగ్రిని ఊరేగింపుగా తీర్థానికి తీసుకెళ్తారు. అక్కడ వెలసిన రాముడు, కృష్ణుడి విగ్రహాలకు అభిషేకాలు, పూజలు నిర్వహించి నైవేద్యం సమర్పిస్తారు. అనంతరం భక్తులకు స్వామివారి ప్రసాదాలను పంపిణీ చేస్తారు. ఈ పవిత్ర దినాన తీర్థ స్నానం చేస్తే విశేష ఫలితాలుంటాయని నమ్మకం.
Sorry, no posts matched your criteria.