news

News January 10, 2026

TGలో చిరంజీవి మూవీ టికెట్ల ధరల పెంపు

image

TG: చిరంజీవి-అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రానికి టికెట్ రేట్లను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈనెల 12న విడుదలవనుండగా.. 11న ప్రీమియర్స్‌కు అనుమతిస్తూ టికెట్ ధరను రూ.600గా నిర్ణయించింది. వారంపాటు టికెట్ రేట్లు పెంచుకునేందుకు అంగీకరించింది. సింగిల్ స్క్రీన్‌లో GSTతో కలిపి రూ.50, మల్టీప్లెక్సుల్లో రూ.100 పెంచుకునే వెసులుబాటు కల్పించింది.

News January 10, 2026

ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి కొత్త హీరో.. ఫస్ట్ లుక్ రిలీజ్

image

సూపర్ స్టార్ కృష్ణ మనుమడు, ఘట్టమనేని రమేశ్ బాబు తనయుడు జయకృష్ణ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ‘RX 100’ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో ఆయన హీరోగా నటిస్తున్న మూవీకి ‘శ్రీనివాస మంగాపురం’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను మహేశ్ బాబు తాజాగా రిలీజ్ చేశారు. ఇందులో రవీనా టాండన్ కూతురు రాషా తడాని హీరోయిన్‌గా నటిస్తుండగా, జీవీ ప్రకాశ్ సంగీతం అందిస్తున్నారు.

News January 10, 2026

కోటీశ్వరులు పెరిగారు!

image

దేశంలో కోటీశ్వరుల సంఖ్య 2025-26 ఆర్థిక సంవత్సరంలో స్వల్పంగా పెరిగింది. ఈ-ఫైలింగ్ పోర్టల్ సమాచారం మేరకు కోటికి పైగా ఆస్తులు ప్రకటించిన వారి సంఖ్య 3,17,098 నుంచి 3,85,752కి పెరిగింది. మరోవైపు 2025-26 ఆర్థిక సంవత్సరంలో 9 కోట్లకు పైగా ఐటీ రిటర్నులు దాఖలయ్యాయి. అంతకుముందు ఇది 8.92 కోట్లుగా ఉండేది. కోటీశ్వరుల సంఖ్యలో 21.65% వృద్ధి నమోదు కాగా, రిటర్నులు 1.22% మాత్రమే పెరగడం గమనార్హం.

News January 10, 2026

వంటింటి చిట్కాలు

image

* పిండి వంటలు చేసేటపుడు మూకుడులో నూనె పొంగకుండా ఉండాలంటే మరుగుతున్న నూనెలో తమలపాకు వేసి, అది రంగు మారాక తీస్తే సమస్య ఉండదు.
* గారెలు, వడలు చేసే పిండిలో కొద్దిగా సేమియాను పొడిగా చేసి కలిపితే నూనె లాగవు. కరకరలాడతాయి.
* అరిసెలు వండేటప్పుడు పాకంలో బియ్యం పిండి సరిపోకపోతే తగినంత గోధుమపిండి కలపండి.
* సమోసా కరకరలాడుతూ రావాలంటే మైదా పిండిలో కాస్త మొక్కజొన్న పిండిని కలిపితే సరిపోతుంది.

News January 10, 2026

రాహువు ప్రభావంతో లవ్ ప్రాబ్లమ్స్ వస్తాయా?

image

జ్యోతిష శాస్త్రం ప్రకారం.. జాతకచక్రంలో ఐదో స్థానంలో రాహువు ఉంటే ప్రేమ సమస్యలు వస్తాయి. దీనివల్ల భ్రమలకు లోనై తప్పుడు భాగస్వామిని ఎంచుకునే అవకాశం ఉంటుంది. ఎదుటివారి నిజస్వరూపాన్ని గ్రహించలేక మోసపోవచ్చు. ఐదో స్థానంపై శని, కుజ గ్రహాల దృష్టి పడినా ప్రేమ బంధాలలో నిరంతరం కలహాలు, ద్వేషం, సంఘర్షణలు ఎదురవుతాయి. గ్రహ శాంతి పూజలు చేయించడం ద్వారా ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.

News January 10, 2026

సౌత్ ఇండియన్ బ్యాంక్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

సౌత్ ఇండియన్ బ్యాంక్ క్రెడిట్, టెక్నికల్ & రిస్క్ కంటైన్‌మెంట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. CA/CMA, MBA, డిగ్రీ , B.Arch/BTech/BE, PG ఫోరెన్సిక్ సైన్స్ అర్హతతో పాటు పని అనుభవం గలవారు JAN 17వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. షార్ట్ లిస్టింగ్, ప్రిలిమినరీ/ పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. recruit.southindianbank.bank.in

News January 10, 2026

ఎట్టకేలకు పూర్తిగా తగ్గిన బ్లోఅవుట్ మంటలు

image

AP: కోనసీమ జిల్లా ఇరుసుమండ బ్లోఅవుట్ వద్ద ఎట్టకేలకు మంటలు తగ్గిపోయాయి. ఈ నెల 5న గ్యాస్ లీకై భారీగా మంటలు చెలరేగిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి వాటర్ అంబ్రెల్లా ద్వారా మంటలను ఆర్పేందుకు ONGC సిబ్బంది తీవ్రంగా కృషి చేశారు. 5 రోజుల తర్వాత పూర్తిగా తగ్గాయి. దీంతో వెల్ క్యాపింగ్ పనులు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు.

News January 10, 2026

SHOCKING: ఆన్‌లైన్‌లో ‘రాజాసాబ్’ HD ప్రింట్

image

డార్లింగ్ ప్రభాస్ నటించిన ‘రాజాసాబ్’ సినిమాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే టికెట్ హైక్స్ విషయంలో ప్రభుత్వ మెమోను TG హైకోర్టు కొట్టివేయగా తాజాగా ఈ చిత్ర HD ప్రింట్ ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమైంది. కేటుగాళ్లు ఈ చిత్రాన్ని పైరసీ చేసి ఆన్‌లైన్ సైట్‌లో అప్లోడ్ చేశారు. ఇది చూసిన ఫ్యాన్స్ ఆందోళన చెందుతూ X వేదికగా పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఇలా పైరసీ చేయడం నేరమంటూ మండిపడుతున్నారు.

News January 10, 2026

పత్తి కట్టెతో సేంద్రియ ఎరువు తయారీ ఎలా?

image

పత్తి ఏరిన తర్వాత కట్టెలను ట్రాక్టర్‌తో నడిచే ష్రెడ్డర్ యంత్రంతో ముక్కలుగా చేయవచ్చు. తర్వాత రెక్క నాగలితో లోతు దుక్కి చేయాలి. ఈ వ్యర్థాలను తొందరగా కుళ్లించే సూక్ష్మజీవుల కల్చర్‌ను, ట్రైకోడెర్మ జీవ శిలీంధ్రనాశినిని పశువుల ఎరువుతో కలిపి నేలపై చల్లి రోటవేటర్‌తో దున్ని చదును చేయాలి. పత్తి కట్టె వ్యర్థాలను ముడి పదార్థాలుగా వాడుకొని కంపోస్ట్ లేదా వర్మికంపోస్టు విధానంలో సేంద్రియ ఎరువు తయారు చేయవచ్చు.

News January 10, 2026

సంక్రాంతికి మరిన్ని స్పెషల్ రైళ్లు

image

సంక్రాంతి రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే నేటి నుంచి ఈ నెల 19 వరకు మరిన్ని స్పెషల్ ట్రైన్‌లను నడపనుంది. ఈ నెల 11, 12 తేదీల్లో HYD-సిర్పూర్ కాగజ్ నగర్(07473), ఈ నెల 10, 11 తేదీల్లో సిర్పూర్-HYD (07474), 11, 12, 12, 18, 19 తేదీల్లో HYD-విజయవాడ(07475), 10, 11, 12, 17, 19 తేదీల్లో విజయవాడ-HYD(07476) మధ్య ఈ రైళ్లు నడవనున్నాయి.