news

News November 4, 2025

దీపావళి, కార్తీక పౌర్ణమి రోజుల్లో బాణాసంచా ఎందుకు కాల్చుతారు?

image

భాద్రపద మాసంలో అంటువ్యాధులు వ్యాప్తి చెందుతాయి. వర్షాల కారణంగా భూమిపై విషపూరితమైన ఆవిరి పేరుకుపోతుంది. ఈ కలుషిత గాలిని పీల్చడం వలన రోగాలు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే.. ఆశ్వయుజ, కార్తీక మాసాల్లో వచ్చే పర్వదినాల్లో పసుపు, గంధకం, సురేకారం వంటి ద్రవ్యాలతో తయారుచేసే బాణాసంచాను కాల్చుతారు. వీటి నుంచి వచ్చే విపరీత కాంతి, పెద్ద ధ్వని, పొగ.. ఇవన్నీ క్రిమి సంహారిణిగా పనిచేసి, వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది.

News November 4, 2025

‘ప్రతి కదలికలో పరమేశ్వరుడిని చూడాలి’

image

జీవితంలో ప్రతి అంశాన్ని దైవారాధనగా భావించి, ప్రతి క్షణం పరమాత్మలో లీనమై జీవించడమే మానవ జీవిత లక్ష్యమని ‘భక్తి యోగం’ పేర్కొంది. ‘ఓ దేవా! నా ఆత్మ నీవే, నా బుద్ధియే పార్వతి. నా శరీరమే నీ గృహం. నా పంచప్రాణాలు నీ పరిచారకులు. నా ప్రతి అనుభవం నీకు చేసే పూజే. నా నిద్ర కూడా యోగ సమాధితో సమానం. నేను నడిచే ప్రతి అడుగు నీకు ప్రదక్షిణం. నేను పలికే ప్రతి మాట నీ స్తోత్రం’ అంటూ పరమాత్మను సేవించాలని సూచిస్తోంది.

News November 4, 2025

ఈ ఒక్క అలవాటు మిమ్మల్ని జీరోని చేస్తుంది!

image

స్మోకింగ్, డ్రింకింగ్ కంటే కూడా పనిని వాయిదా వేసే అలవాటు చాలా డేంజరని లైఫ్‌స్టైల్ కోచ్‌లు హెచ్చరిస్తున్నారు. ‘విద్య, ఉద్యోగం, వ్యాపారం ఇలా ఎందులోనైనా మీరు చేయాలి అనుకున్న/చేయాల్సిన పనిని సకాలంలో పూర్తి చేయాలి. టైముంది కదా తర్వాత చేద్దామన్న థాట్ మీ ప్రొడక్టవిటీని, వర్క్ క్వాలిటీని, అవకాశాలను కిల్ చేస్తుంది. లైఫ్‌లో మిమ్మల్ని జీరోగా నిలబెట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు’ అని హెచ్చరిస్తున్నారు.

News November 4, 2025

Amazon layoffs: ఉదయాన్నే 2 మెసేజ్‌లు పంపి..

image

ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇటీవల ఏకంగా 14 వేల మంది ఉద్యోగులను తొలగించింది. ఉదయాన్నే 2 మెసేజ్‌లు పంపి ఈ విషయం చెప్పినట్లు తెలుస్తోంది. ‘ఆఫీసుకు వెళ్లే ముందు మీ వ్యక్తిగత లేదా ఆఫీసు మెయిల్‌ను చెక్ చేసుకోండి’ అని ఫస్ట్ మెసేజ్‌లో కోరింది. ‘మీ జాబ్ గురించి మెయిల్ రాకపోతే హెల్ప్ డెస్క్ నంబర్‌ను సంప్రదించండి’ అని రెండో దాంట్లో పేర్కొంది. లేఆఫ్ మెయిల్స్ పంపాక ఈ మెసేజ్‌లు ఫార్వర్డ్ చేసినట్లు సమాచారం.

News November 4, 2025

అవసరానికి మించే యూరియా ఇచ్చాం: కేంద్రం

image

ఖరీఫ్‌లో రైతులకు కావాల్సినంత యూరియా, ఫెర్టిలైజర్స్ సరఫరా చేసినట్లు కేంద్ర ఎరువుల శాఖ(DOF) నిర్ధారించింది. 185.39 లక్షల మెట్రిక్ టన్నులు అవసరమని అంచనా వేయగా.. DOF 230.53లక్షల మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉంచిందని, 193.20LMT అమ్ముడైనట్లు తెలిపింది. గతేడాది ఖరీఫ్‌తో పోలిస్తే 4.08LMT అధికంగా అమ్ముడైనట్లు పేర్కొంది. పోర్టులు, రైల్వే, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఇది సాధ్యమైందని స్పష్టం చేసింది.

News November 4, 2025

చిన్నారి వైష్ణవి హత్యకేసులో హైకోర్టు కీలక తీర్పు

image

AP: 2010 జనవరి 30న VJAలో అపహరణ, హత్యకు గురైన చిన్నారి వైష్ణవి కేసులో శిక్ష రద్దు చేయాలన్న నిందితుల పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. మోర్ల శ్రీనివాసరావు, యంపరాల జగదీశ్‌కు ట్రైల్ కోర్టు విధించిన జీవిత ఖైదును హైకోర్టు సమర్థించింది. మరో నిందితుడు వెంకట్రావును నిర్దోషిగా ప్రకటించి, శిక్ష రద్దు చేసింది. వైష్ణవిని కిడ్నాప్ చేసి హత్య చేశారు. తర్వాత GNT శారదా ఇండస్ట్రీస్‌లోని బాయిలర్‌లో వేసి బూడిద చేశారు.

News November 4, 2025

BCలకు వెన్నుదన్నుగా ఆదరణ 3.0: సవిత

image

AP: BCల సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని మంత్రి సవిత పేర్కొన్నారు. ఆదరణ 3.0 పథకం అమలుపై వర్క్ షాప్‌ను ప్రారంభించారు. ‘BCలు సమిష్టిగా కూటమిని గెలిపించారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో వారెంతో నష్టపోయారు. మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే BCలకు బడ్జెట్లో అత్యధికంగా నిధులు కేటాయించాం. వారి కాళ్లపై వారు నిలబడాలని ఆదరణ 3.0 పథకం అమలు చేస్తున్నాం. దానికి బడ్జెట్లో రూ.1000 కోట్లు కేటాయించాం’ అని తెలిపారు.

News November 4, 2025

షెఫాలీ బౌలింగ్ మాకు బిగ్ సర్‌ప్రైజ్: లారా

image

తాము వరల్డ్ కప్ ఫైనల్లో ఓడిపోవడానికి షెఫాలీ వర్మ బౌలింగ్ కూడా కారణమని SA కెప్టెన్ లారా ఒప్పుకున్నారు. ‘షెఫాలీ బౌలింగ్ మాకు బిగ్ సర్‌ప్రైజ్. WC పైనల్‌లాంటి మ్యాచుల్లో పార్ట్‌టైమ్ బౌలర్లకు వికెట్లు కోల్పోవడం కరెక్ట్ కాదు. ఆమె బంతిని నెమ్మదిగా సంధిస్తూనే రెండు వికెట్లు తీసుకుంది. ఇంక ఆమెకు వికెట్స్ ఇవ్వకూడదు అనుకుంటూ మిస్టేక్స్ చేశాం. భారత్ నిర్ణయం మమ్మల్ని ఆశ్చర్య పరిచింది’ అని లారా తెలిపారు.

News November 4, 2025

నవంబర్ 4: చరిత్రలో ఈరోజు

image

✦ 1889: పారిశ్రామికవేత్త, స్వాతంత్ర్య సమరయోధుడు జమ్నాలాల్ బజాజ్ జననం (ఫొటోలో)
✦ 1929: గణిత, ఖగోళ, జ్యోతిష శాస్త్రవేత్త శకుంతలా దేవి జననం (ఫొటోలో)
✦ 1932: సినీ దర్శకుడు, నిర్మాత వి.బి.రాజేంద్రప్రసాద్ జననం
✦ 1944: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో తొలి మహిళా ఎయిర్ మార్షల్ పద్మావతి బందోపాధ్యాయ జననం
✦ 1964: దర్శకుడు జొన్నలగడ్డ శ్రీనివాసరావు జననం
✦ 1971: నటి టబు జననం

News November 4, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.