news

News January 9, 2026

‘జన నాయకుడు’ విడుదలకు లైన్ క్లియర్

image

విజయ్ దళపతి ‘జన నాయకుడు’ సినిమాకు మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది. సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వాలని CBFCని న్యాయస్థానం ఆదేశించింది. సినిమాకు U/A సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత మళ్లీ రివ్యూ కమిటీకి పంపాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించింది. ముందుగా ఇస్తామన్న U/A సర్టిఫికెట్ తక్షణమే ఇవ్వాలని ఆదేశించింది. షెడ్యూల్ ప్రకారం మూవీ ఈరోజు విడుదల కావాల్సి ఉండగా ఈ వివాదం కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే.

News January 9, 2026

నిజమైన ప్రేమకు ఎక్స్‌పైరీ డేట్ ఉండదు!

image

తొలిప్రేమ జ్ఞాపకం ఎప్పటికీ చెరిగిపోదు అంటారు. అది ఈ జంట విషయంలో అక్షర సత్యమైంది. కేరళకు చెందిన జయప్రకాష్, రష్మీలు టీనేజ్‌లో విడిపోయి దశాబ్దాల కాలం వేర్వేరు జీవితాలను గడిపారు. జీవిత భాగస్వాములను కోల్పోయిన తర్వాత విధి వీరిని మళ్లీ కలిపింది. పాత జ్ఞాపకాల సాక్షిగా పిల్లల అంగీకారంతో 60 ఏళ్ల వయసులో వీరిద్దరూ ఒక్కటయ్యారు. నిజమైన ప్రేమ ఎప్పటికైనా గెలుస్తుందంటూ ఈ జంటను నెటిజన్లు కొనియాడుతున్నారు.

News January 9, 2026

‘రాజాసాబ్’ పార్ట్-2.. టైటిల్ ఇదే

image

‘రాజాసాబ్’ సినిమాకు పార్ట్-2 ఉంటుందని మేకర్స్ ప్రకటించారు. పార్ట్-2 టైటిల్‌ను ‘రాజాసాబ్ సర్కస్: 1935’గా ఖరారు చేసినట్లు మూవీ ఎండింగ్‌లో వెల్లడించారు. ఇందులో ప్రభాస్ జోకర్ లుక్‌లో కనిపించనున్నారు. అయితే ఇది ప్రీక్వెలా లేదా సీక్వెల్‌గా తెరకెక్కుతుందా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. కాగా ట్రైలర్‌లో చూపించిన కొన్ని సీన్లతో పాటు ప్రభాస్ ఓల్డేజ్ లుక్ సీన్లు పార్ట్-1లో లేవు. అవి పార్ట్‌-2లో ఉంటాయేమో.

News January 9, 2026

పంట నిల్వకు సరికొత్త ‘సైలో’ వ్యవస్థ: మంత్రి ఉత్తమ్

image

TG: పంటలను నిల్వచేసేందుకు ఆధునిక పరిజ్ఞానంతో కూడిన ‘సైలో’ వ్యవస్థను అమలులోకి తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి తెలిపారు. ఈ విధానంలో బియ్యం, మొక్కజొన్న, సోయాబీన్ పంటలను ఇంటిగ్రేటెడ్ క్లిసర్లు, డ్రైయర్లతో రెండేళ్ల వరకు నిల్వ చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. మిల్లింగ్‌లో జాప్యం వల్ల ధాన్యం చెడిపోకుండా, శాస్త్రీయ పద్ధతిలో నిల్వకు ఈ పద్ధతి ఉపయోగపడుతుందని చెప్పారు.

News January 9, 2026

SLBC: ఇకపై డ్రిల్లింగ్, బ్లాస్టింగ్ పద్ధతిలో తవ్వకం

image

TG: SLBCలో టన్నెల్ బోరింగ్ మెషీన్‌ను ఎట్టకేలకు తొలగించారు. బేరింగ్ రిపేర్ కారణంగా 2023 నుంచి ఔట్‌లెట్ వైపు టన్నెల్ తవ్వకం నిలిచిపోయింది. సుమారు నెలపాటు గ్యాస్ కట్టర్లతో కట్ చేసి మెషీన్‌ను బయటికి తీశారు. ఇక ఇన్‌లెట్ వైపు గతంలో ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఇందులో 8 మంది మరణించగా అందులో ఆరుగురి మృతదేహాలు లభించలేదు. దీంతో ఇకపై డ్రిల్లింగ్, బ్లాస్టింగ్ పద్ధతిలోనే తవ్వకం చేపట్టనున్నారు.

News January 9, 2026

WFH చేస్తే అప్రైజల్స్ కట్.. TCS సీరియస్ వార్నింగ్!

image

ఆఫీస్ నుంచి పని చేయాలనే రూల్ పాటించని వారి పట్ల TCS కఠినంగా వ్యవహరిస్తోంది. వారానికి 5 రోజులు ఆఫీస్‌కు రాని ఉద్యోగుల యాన్యువల్ అప్రైజల్స్‌ను హోల్డ్‌లో పెట్టింది. ముఖ్యంగా ఫ్రెషర్స్ ఈ నిర్ణయంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రూల్స్ బ్రేక్ చేస్తే పర్ఫార్మెన్స్ బాండింగ్ ఇవ్వమని కంపెనీ స్పష్టం చేసింది. అటెండెన్స్ తక్కువున్నవారికి ఇప్పటికే మెయిల్స్ పంపింది. ఇకపై ఇంటి నుంచి పని కుదరదని తేల్చి చెప్పింది.

News January 9, 2026

వంటింటి చిట్కాలు

image

* అల్లం, వెల్లుల్లి పేస్ట్ చేసే ముందు వాటిని వేయిస్తే పేస్ట్ ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది.
* తేనెలో నాలుగైదు మిరియాలు వేస్తే చీమలు పట్టకుండా ఉంటాయి.
* చికెన్ ఉడికించేటప్పుడు ఒక కోడి గుడ్డు చేర్చడం వల్ల రుచి పెరుగుతుంది.
* కూరలు, గ్రేవీ మాడినట్లు గుర్తిస్తే వాటిలో వెన్న, పెరుగు కలిపితే వాసన రాకుండా ఉంటుంది.

News January 9, 2026

సాదాబైనామాకు ‘అఫిడవిట్’ నిబంధన తొలగింపు?

image

TG: సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారానికి విక్రయదారుడి అఫిడవిట్ తప్పనిసరి అనే నిబంధనను తొలగించాలని CCLA నిర్ణయించినట్లు సమాచారం. 2 రోజుల్లో దీనిపై ఉత్తర్వులు వచ్చే ఛాన్సుంది. ఎప్పుడో కొన్న భూమికి ఇప్పుడు అఫిడవిట్ అడిగితే విక్రయదారులు అంగీకరించకపోవచ్చని, దీని వల్ల సమస్యలొస్తాయనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీంతో రెవెన్యూశాఖ న్యాయ సలహా కోరగా అఫిడవిట్ నిబంధనను మినహాయించుకోవచ్చని AG స్పష్టం చేశారు.

News January 9, 2026

నెహ్రూ అంటే గౌరవమే.. కానీ: థరూర్

image

నెహ్రూ అంటే తనకు ఎంతో గౌరవమని.. కానీ ఆయన చేసిన ప్రతి పనిని తాను గుడ్డిగా సమర్థించనని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ అన్నారు. నెహ్రూ మన దేశంలో ప్రజాస్వామ్యాన్ని బలంగా నాటారని ప్రశంసించారు. అయితే 1962 చైనా యుద్ధం లాంటి విషయాల్లో ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాల్లో తప్పులు ఉన్నాయన్నారు. BJP ప్రతి చిన్న విషయానికి నెహ్రూను నిందించడం సరికాదని.. ఆయనను ఒక బూచిగా వాడుకుంటున్నారని విమర్శించారు.

News January 9, 2026

FY26లో జీడీపీ వృద్ధి 7.5 శాతం: SBI

image

దేశ GDP వృద్ధి రేటు 2025-26లో 7.5% ఉండొచ్చని SBI రిపోర్టు వెల్లడించింది. ‘NOV చివరికి ₹9.8L Cr ద్రవ్యలోటు ఉంది. ఇది బడ్జెట్ అంచనాల్లో 62.3%. FY26 బడ్జెట్ అంచనాల కంటే పన్నుల ఆదాయం తక్కువగా ఉన్నప్పటికీ పన్నేతర ఆదాయం ఎక్కువగా ఉంది. అందువల్ల మొత్తం ఆదాయంపై ప్రభావం పడకపోవచ్చు. ద్రవ్యలోటు ₹15.85L Crగా(బడ్జెట్ అంచనా ₹15.69L Cr) ఉండొచ్చు. దీన్నిబట్టి ఫిస్కల్ డెఫిసిట్ 4.4%గా ఉండొచ్చు’ అని పేర్కొంది.