India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
✒ తిథి: శుక్ల చతుర్దశి రా.12.57 వరకు
✒ నక్షత్రం: ధనిష్ట రా.11.20 వరకు
✒ శుభ సమయములు: ఏమీ లేవు
✒ రాహుకాలం: ఉ.9.00-10.30 వరకు
✒ యమగండం: మ.1.30-3.00 వరకు
✒ దుర్ముహూర్తం: ఉ.6.00-7.36 వరకు
✒ వర్జ్యం: లేదు
✒ అమృత ఘడియలు: మ.12.54-2.30 వరకు
* హైదరాబాద్ వల్లే తెలంగాణ నంబర్‌వన్: చంద్రబాబు
* నాకూ రెండోసారి, మూడోసారి సీఎం అవ్వాలని ఉంది: CM రేవంత్
* కాళేశ్వరంపై ప్రధానిని కలుస్తాం: మంత్రి కోమటిరెడ్డి
* 6 నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం: KTR
* స్కాంల కోసం మెడికల్ కాలేజీలు ప్రైవేటుపరం: జగన్
* ఈ నెలలోనే టీచర్ నియామకాలు: లోకేశ్
* నిమజ్జన వేడుకల్లో డీజేలకు అనుమతి లేదు: CP
* అమెరికాకు భారత్ దూరం కావడం బాధాకరం: ట్రంప్
* భారీగా పెరిగిన బంగారం ధరలు
AP: విలేజ్ హెల్త్ క్లినిక్‌ల నిర్మాణం, పెండింగ్ పనుల పూర్తికి కేంద్రం మంజూరు చేసిన ₹217కోట్ల నిధులకు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన అనుమతులిచ్చింది. ఈ మేరకు నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా వచ్చిన నిధులను విడుదల చేసింది. ఉపాధిహామీ కింద నిర్మిస్తున్న 2,309 భవనాల పూర్తికి, PM-ABHIM కింద 696 విలేజ్ హెల్త్ క్లినిక్ భవనాల నిర్మాణానికి నిధులు కేటాయించింది. ఒక్కో భవనానికి ₹55లక్షలు మంజూరు చేస్తూ ఉత్తర్వులిచ్చింది.
ఇటీవల భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రధాని మోదీ పర్యటించనున్నట్లు సమాచారం. దీనిపై త్వరలో షెడ్యూల్ ఖరారు కానున్నట్లు తెలుస్తోంది. ఈ వర్షాకాలంలో హిమాచల్‌ప్రదేశ్, J&K, పంజాబ్, హరియాణా, ఉత్తరాఖండ్, ఢిల్లీలో వరదలు బీభత్సం సృష్టించాయి. సుమారు 500మంది ప్రాణాలు కోల్పోయారు. రూ.వేల కోట్ల ఆస్తి నష్టం సంభవించింది. ఆయా ప్రాంతాలను ప్రధాని పరిశీలించి, నష్టంపై సమీక్షిస్తారని సమాచారం.
AP: రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖను ప్రతిష్ఠాత్మక స్కోచ్ అవార్డు వరించింది. పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే BC నిరుద్యోగులకు ఉచిత శిక్షణ అందించినందుకుగానూ ఈ పురస్కారం దక్కింది. ఈ నెల 20న ఢిల్లీలో ఈ అవార్డును మంత్రి సవిత అందుకోనున్నారు. కాగా రాష్ట్రంలో BC స్టడీ సర్కిళ్ల ద్వారా సివిల్స్, టీచర్స్, రైల్వే వంటి వివిధ ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిరుద్యోగులకు శిక్షణ అందించారు.
ట్రంప్ సలహాదారు హోవర్డ్ లుత్నిక్ భారత్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. టారిఫ్ వ్యవహారంలో అగ్రరాజ్యం ముందు ఇండియా తలవంచుతుందన్నారు. అమెరికాకు ‘సారీ’ చెప్పి అధ్యక్షుడు ట్రంప్‌తో డీల్ కుదుర్చుకుంటుందని అహంకారపూరిత కామెంట్స్ చేశారు. US మార్కెట్ లేకుండా IND ఆర్థికంగా వృద్ధి చెందలేదన్నారు. ‘ఒకటి, రెండు నెలల్లో USతో చర్చలకు భారత్ దిగొస్తుంది. మోదీతో ఎలా డీల్ చేసుకోవాలో ట్రంప్‌కు తెలుసు’ అని హోవర్డ్ అన్నారు.
TG: కాళేశ్వరం అవినీతిపై సీబీఐ విచారణ వేగవంతం చేసేందుకు సీఎంతో కలిసి ప్రధానిని కలుస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. త్వరలో ప్రధాని అపాయింట్‌మెంట్ ఖరారవుతుందని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ బీఆర్ఎస్ పార్టీకి ఏటీఎంగా మారిందని బీజేపీ అగ్రనేతలు కూడా విమర్శించారని గుర్తుచేశారు. సీబీఐ విచారణకు కేంద్రం సహకరించాలని ఆయన కోరారు.
సినిమా టికెట్లకు విధించే GSTపై ప్రధాని మోదీకి డైరెక్టర్ నాగ్ అశ్విన్ రిక్వెస్ట్ చేశారు. ‘జీఎస్టీ సంస్కరణలను స్వాగతిస్తున్నా. 5 శాతం జీఎస్టీని రూ.100 టికెట్లలోపు కాకుండా రూ.250 టికెట్లకు పెడితే మరింత మేలు జరుగుతుంది. ఇది మధ్య తరగతి ప్రజలు థియేటర్లకు వచ్చేందుకు ఎంతో సహకరిస్తుంది’ అని ఆయన విజ్ఞప్తి చేశారు. కాగా రూ.100 టికెట్లపై 12 శాతం GSTని తొలగించి 5 శాతం జీఎస్టీని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.
దేశ అవసరాలకు తగ్గట్టు రష్యా నుంచి భారత్ ఆయిల్ కొనుగోలు చేస్తూనే ఉంటుందని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. భారత్ తన సొంత ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరిస్తుందని ఆమె స్పష్టం చేశారు. చమురును ఎక్కడి నుంచి కొనుగోలు చేయాలనే నిర్ణయం మనదే అని వివరించారు. అమెరికా అధిక టారిఫ్‌లు విధించిన నేపథ్యంలో ఎగుమతిదారులకు ఉపశమనం కలిగేలా త్వరలో ప్యాకేజీ ప్రకటిస్తామని చెప్పారు.
GST తగ్గించిన నేపథ్యంలో SEP 22 నుంచి కార్ల ధరలను సవరిస్తున్నట్లు టాటా ప్రకటించింది. చిన్నకార్లపై రూ.75వేల వరకు, పెద్ద కార్లపై రూ.1.45లక్షల వరకు తగ్గింపు ఉండనుంది.
☛ చిన్నకార్లు: * టియాగో-రూ.75వేలు, * టిగోర్-రూ.80వేలు, * అల్ట్రోజ్-రూ.1.10లక్షలు
☛ కాంపాక్ట్ SUVలు: * పంచ్-రూ.85వేలు, * నెక్సాన్-రూ.1.55లక్షలు
☛ మిడ్ సైజ్ మోడల్: * కర్వ్-రూ.65వేలు
☛ SUVలు: * హారియర్-రూ.1.40లక్షలు, * సఫారీ-రూ.1.45లక్షలు
Sorry, no posts matched your criteria.