news

News September 5, 2025

నేను నిత్య విద్యార్థిని: చంద్రబాబు

image

AP: తల్లిదండ్రుల తర్వాత మనం గుర్తు పెట్టుకునేది ఉపాధ్యాయులనే అని CM చంద్రబాబు అన్నారు. ‘నేను కూడా టీచర్ కావాల్సింది. SVUలో లెక్చరర్‌గా చేరాలని వర్సిటీ వీసీ కోరితే MLA అవుతానని చెప్పా. భక్తవత్సలం అనే ఉపాధ్యాయుడు నా జీవితంలో స్ఫూర్తి నింపారు. నేను నిత్య విద్యార్థిని. ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకుంటా. లోకేశ్ చదువు గురించి నా భార్యే చూసేది. ఆ క్రెడిట్ ఆవిడదే’ అని తెలిపారు.

News September 5, 2025

ప్రముఖ నటుడు ఆశిష్ వారంగ్ కన్నుమూత

image

ప్రముఖ బాలీవుడ్ నటుడు ఆశిష్ వారంగ్ (55) ఇవాళ ముంబైలో కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా ఆయన మరణించినట్లు తెలుస్తోంది. సూర్యవంశీ, దృశ్యం, మర్దానీ వంటి చిత్రాల్లో సహాయ పాత్రలతో ఆశిష్ గుర్తింపు పొందారు. హిందీతో పాటు మరాఠీ, దక్షిణాది చిత్రాల్లోనూ నటించారు. ఆశిష్ మృతి పట్ల పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

News September 5, 2025

ఆరోగ్యశ్రీని భ్రష్టు పట్టించారు: జగన్

image

AP: రాష్ట్ర ప్రజలకు సంజీవని లాంటి ఆరోగ్యశ్రీని CM చంద్రబాబు భ్రష్టు పట్టించారని YCP చీఫ్ జగన్ విమర్శించారు. ‘‘ఈ 15 నెలల్లో నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు ఇవ్వాల్సిన రూ.4,500 కోట్లకు గానూ కేవలం రూ.600 కోట్లే ఇచ్చారు. ఆపరేషన్‌ చేయించుకున్న వ్యక్తికి ఆ విశ్రాంతి సమయంలో నెలకు రూ.5 వేలు అందించే ‘ఆరోగ్య ఆసరా’ను సమాధి చేశారు. దీనికి ఇవ్వాల్సిన దాదాపు రూ.600 కోట్లు పూర్తిగా ఎగ్గొట్టేశారు’’ అని ఆరోపించారు.

News September 5, 2025

ఇలాంటి వారిని అభినందించాల్సిందే❤️

image

రాత్రి వేళల్లో ఎంతో మంది మహిళలను సురక్షితంగా ఇంటికి చేర్చుతున్న చెన్నైకి చెందిన లేడీ ఆటో డ్రైవర్ రాజీ గురించి నెట్టింట చర్చ జరుగుతోంది. ఆమె దాదాపు 20 ఏళ్లుగా నగరంలో ఆటో నడుపుతూ వేలాది మంది అభిమానాన్ని పొందారు. మహిళలకు అర్ధరాత్రి ఏ అవసరమొచ్చినా ఆమె ఆటో సిద్ధంగా ఉంటుంది. రాజీ మహిళలకు ఉచితంగా ఆటో నేర్పించడమే కాకుండా పిల్లలు, వృద్ధులు, పేదవారికి ఉచిత ప్రయాణం అందిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు.

News September 5, 2025

స్కాంల కోసం మెడికల్ కాలేజీలు ప్రైవేటుపరం: జగన్

image

AP: ప్రజల ఆస్తులను CM చంద్రబాబు తనవాళ్లకు పప్పుబెల్లాల్లా పంచుతున్నారని YCP చీఫ్ జగన్ ఆరోపించారు. ‘ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలను స్కాంల కోసం ప్రైవేటుపరం చేస్తున్నారు. మా 5ఏళ్లలో 17కాలేజీల్లో 5చోట్ల క్లాసులు ప్రారంభమయ్యాయి. మిగతా పనులు మీరు బాధ్యతగా చేసి ఉంటే మరో 12 కాలేజీల్లోనూ క్లాసులు స్టార్ట్‌ అయ్యేవి. మేం అధికారంలోకి రాగానే ఈ కాలేజీలను తిరిగి ప్రభుత్వ రంగంలోకి తెచ్చుకుంటాం’ అని ట్వీట్ చేశారు.

News September 5, 2025

హైదరాబాద్ వల్లే తెలంగాణ నంబర్‌వన్: చంద్రబాబు

image

AP: ఎంతో ఇష్టంతో తాను HYDను అభివృద్ధి చేశానని, దాని వల్లే TG నంబర్‌వన్‌గా నిలిచిందని CM చంద్రబాబు అన్నారు. అలాగే దేశంలో ఏపీని నంబర్‌వన్‌గా నిలిపేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. విజయవాడలో జరుగుతున్న టీచర్స్ డే కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. ‘ప్రపంచంలోనే తెలుగుజాతి నంబర్‌వన్‌గా నిలవాలి. రాబోయే 22 ఏళ్లపాటు మనమంతా దీనిపై దృష్టి సారిస్తే సాధ్యమే. విజన్ 2047 కోసం శ్రమిద్దాం’ అని ఆయన పిలుపునిచ్చారు.

News September 5, 2025

అందుకే VRO, VRAలను BRS తొలగించింది: CM రేవంత్

image

TG: ధరణి పేరిట ధన, భూదాహంతో BRS ప్రభుత్వం భూములన్నీ చెరబట్టిందని CM రేవంత్ విమర్శించారు. తమ దుర్మార్గాలు ప్రజలకు తెలియకూడదనే VRO, VRAలను తొలగించారన్నారు. ఎన్నికల ముందు ఎవరిని కదిలించినా ధరణి గురించే చెప్పేవారని, అందుకే దాన్ని బంగాళాఖాతంలో పడేస్తామన్న హామీని నెరవేర్చినట్లు చెప్పారు. ధరణితో పట్టుకున్న దరిద్రాన్ని భూభారతితో తొలగిస్తున్నామని GPO నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో అన్నారు.

News September 5, 2025

70 కేసులు వేసినా డీఎస్సీ ఆగలేదు: లోకేశ్

image

AP: ఇప్పుడున్న ఉపాధ్యాయుల్లో దాదాపు 80% మందిని CM చంద్రబాబే నియమించి ఉంటారని మంత్రి లోకేశ్ అన్నారు. ‘DSC అంటే చంద్రబాబు.. చంద్రబాబు అంటే DSC. 13 DSCల ద్వారా 1.80లక్షల మంది టీచర్లను చంద్రబాబే నియమించారు. 70 కేసులు వేసినా డీఎస్సీ మాత్రం ఆగలేదు. గత ప్రభుత్వంలో విచిత్రమైన పాలన చూశాం. ఉపాధ్యాయులను వైన్ షాపుల ముందు కాపలా పెట్టారు. జీతాలు కూడా సరిగ్గా ఇవ్వని పరిస్థితి’ అని లోకేశ్ ధ్వజమెత్తారు.

News September 5, 2025

శివకార్తికేయన్ ‘మదరాసి’ రివ్యూ&రేటింగ్

image

తమిళనాడులోకి గన్ కల్చర్‌ రాకుండా అడ్డుకునేందుకు హీరో చేసే పోరాటమే ‘మదరాసి’. యాక్షన్ సీన్లు, హీరోయిన్‌తో శివకార్తికేయన్ కెమిస్ట్రీ బాగుంటుంది. విజువల్ ఎఫెక్ట్స్ ఉన్నతంగా ఉన్నాయి. ఫస్టాఫ్ పర్వాలేదనిపించినా సెకండాఫ్‌లో డైరెక్టర్ మురగదాస్ దారి తప్పారు. కథను కొత్తగా చెప్పడంలో సక్సెస్ కాలేకపోయారు. ఊహించే సీన్లు, సాగదీత విసుగు తెప్పిస్తాయి. అనిరుధ్ మ్యూజిక్ కూడా పెద్దగా ఆకట్టుకోలేదు.
రేటింగ్: 2.25/5

News September 5, 2025

హెల్త్ ఎమర్జెన్సీగా తురకపాలెం మరణాలు: సీఎం చంద్రబాబు

image

AP: గుంటూరు తురకపాలెంలో వరుస మరణాలపై మరింత లోతుగా పరిశోధన చేయాలని CM చంద్రబాబు ఉన్నతాధికారులను ఆదేశించారు. శని, ఆదివారాల్లో అన్ని రకాల వైద్య పరీక్షలు జరిపి సోమవారం కల్లా ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ సిద్ధం చేయాలన్నారు. కొత్త కేసులు నమోదు కాకుండా స్థానిక ప్రజల్లో నమ్మకాన్ని పెంచాల్సిన బాధ్యత వైద్యాధికారులదేనని స్పష్టం చేశారు. హెల్త్ ఎమర్జెన్సీగా పరిగణించి చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు.