India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధులను కేంద్రం విడుదల చేసింది. మొత్తం రూ.3,000 కోట్ల వరకు రావాల్సి ఉండగా తొలి విడతగా రూ.259 కోట్లను రిలీజ్ చేస్తూ ఉత్తర్వులిచ్చింది. మిగతా నిధులనూ వెంటనే జమ చేయాలని కేంద్రానికి మంత్రి సీతక్క విజ్ఞప్తి చేశారు. కాగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం ఆలస్యం కావడంతో ఈ నిధులు ఆగిపోయిన సంగతి తెలిసిందే.

2025 DECలో ఇండిగో విమాన సర్వీసుల రద్దుపై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(CCI) DG విచారణకు ఆదేశించారు. DGCA డేటా ఇన్‌పుట్‌లను పరిశీలించి కృత్రిమ కొరత సృష్టించడానికి ఇండిగో ఇలా చేసినట్లు ప్రాథమికంగా గుర్తించారు. తన ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేసినట్లు తేల్చారు. ఆ సమయంలో లక్షలాది మంది తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 2 నెలల తరువాత ఇప్పుడు దర్యాప్తునకు ఆదేశించారు. ఇండిగో విధానాలపై లోతుగా దర్యాప్తు చేయనున్నారు.

AP: సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరుసగా రెండో రోజు సమావేశమయ్యారు. ఇవాళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, పలువురు మంత్రులు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. కల్తీ నెయ్యి అంశంపై ఎలా ముందుకెళ్లాలనే దానిపైనే ప్రధానంగా చర్చ సాగుతున్నట్లు సమాచారం. అలాగే కూటమి సమన్వయం, వైసీపీ ఆరోపణలను తిప్పికొట్టడంపైనా సమాలోచనలు చేస్తున్నారు. అగ్రనేతల సమావేశాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

<

ఘజియాబాద్ సిస్టర్స్ <<19046962>>సూసైడ్<<>> కేసులో మరిన్ని విషయాలు వెలుగు చూశాయి. వాళ్లు కొన్నేళ్ల క్రితం మరియ, అలీజా, సిండీ అనే కొరియన్ పేర్లతో SM అకౌంట్స్ క్రియేట్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. తండ్రికి విషయం తెలిసి వాటిని 10రోజుల క్రితం డిలీట్ చేశారు. వారి ఫోన్లు లాక్కున్నారు. రూ.2 కోట్ల అప్పుల్లో ఉన్న చేతన్ కుమార్ కరెంట్ బిల్లు కట్టేందుకు వారి ఫోన్లు అమ్మేశారు. వారికి పెళ్లి చేస్తానని కూడా బెదిరించారు.

డబ్బుకు సంతోషానికి సంబంధం లేదనే విషయంపై ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ చేసిన ట్వీట్ వైరలవుతోంది. ‘డబ్బుతో సంతోషాన్ని కొనలేమని ఎవరైతే అన్నారో.. వారికి అసలు విషయం బాగా తెలుసు’ అంటూ ఆయన తన మనసులోని మాటను బయటపెట్టారు. ₹లక్షల కోట్ల సామ్రాజ్యానికి అధిపతి అయి ఉండి కూడా బాధపడుతున్న ఎమోజీని జత చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సంపద పెరిగే కొద్దీ ప్రశాంతత కరవవుతుందా అనే చర్చకు ఈ ట్వీట్ తెరలేపింది.

పాపులర్ వెబ్ సిరీస్ ‘మీర్జాపూర్’ సినిమాగా SEP 4న థియేటర్లలోకి రానుంది. ‘మీర్జాపూర్ ది ఫిల్మ్’ పేరుతో రానున్న ఈ మూవీ సిరీస్‌లోని కొన్ని ముఖ్యమైన పాత్రలతో ఉంటుందని పేర్కొన్నారు. ఖాలీన్ భయ్యా, గుడ్డు పండిట్, మున్నా త్రిపాఠి వంటి పాత్రలు ఉంటాయని తెలిపారు. ఈ కథను పునీత్ కృష్ణ రాయగా గుర్మీత్ సింగ్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని రితేశ్ సిధ్వానీ, ఫర్హాన్ అక్తర్ తెరకెక్కిస్తున్నారు.

మహీంద్రా & మహీంద్రా లిమిటెడ్ సంస్థ మహీంద్రా సారథి అభియాన్ స్కాలర్‌షిప్ అందిస్తోంది. కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న ట్రక్ డ్రైవర్ కుమార్తె అయి, 11వ తరగతి నుంచి డిగ్రీ చదువుతున్న విద్యార్థినులు అర్హులు. ఆదాయం 4 లక్షల్లోపు, 50% మార్కులు సాధించి ఉండాలి. ఈ పథకం ద్వారా పదివేలు అందిస్తారు. దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి 10, 2026. వెబ్‌సైట్: <

YS వివేకానందరెడ్డి హత్య కేసులో ట్రయల్ కోర్టు ఉత్తర్వుల మేరకు CBI దర్యాప్తు కొనసాగించవచ్చని SC పేర్కొంది. మినీ ట్రయల్‌కు ఆదేశించలేమని సునీత వ్యాజ్యంపై స్పష్టం చేసింది. దర్యాప్తు మరో 3, 4 ఏళ్లు పట్టి విచారణ అంతులేకుండా పోతుందని జస్టిస్ సుందరేశ్ వ్యాఖ్యానించారు. ఎవరిని విచారించాలన్న దానిపైనా ఆదేశాలు ఇవ్వలేమని పేర్కొన్నారు. ఈ కేసులో ట్రయల్ కోర్టు సూచనలతో తదుపరి విచారణ చేస్తున్నట్లు CBI తెలిపింది.

వేసవి దుక్కులను నిర్లక్ష్యం చేయకూడదు. పంట మార్పిడి పద్ధతిని ఆచరించాలి. భూమి నుంచి మురుగు నీరు బయటకుపోయేట్లు చూడాలి. వ్యాధి నిరోధక శక్తినిచ్చే పోషకాలను మొక్కలకు అందించాలి. సమగ్ర నీటి పారుదల సౌకర్యాన్ని కల్పించాలి. కలుపు మొక్కల నిర్మూలన చేపట్టాలి. విత్తన శుద్ధి తప్పక చేయాలి. జీవ నియంత్రణ పద్ధతులను పాటించాలి. తెగుళ్ల లక్షణాలను గుర్తించిన వెంటనే నిపుణుల సూచనలతో నివారణ మందులను తప్పక పిచికారీ చేయాలి.
Sorry, no posts matched your criteria.