India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: మంగళగిరి ప్రజల మూడు దశాబ్దాల కల సాకారం కానుందని మంత్రి లోకేశ్ ట్వీట్ చేశారు. చినకాకాని వద్ద వంద పడకల ఆస్పత్రి నిర్మాణానికి ఈ నెల 13న శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. అత్యాధునిక వసతులతో దేశానికే రోల్ మోడల్‌గా, కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా నిర్మించేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. ఏడాదిలోగా ఆస్పత్రి నిర్మాణాన్ని పూర్తిచేస్తామని పేర్కొన్నారు.
ముంబై ఉగ్రదాడి కేసు నిందితుడు తహవూర్ రాణాను ఇండియాకు తీసుకొచ్చిన అనంతరం ఫస్ట్ ఫొటో బయటకు వచ్చింది. అయితే అందులో రాణా ముఖం కనిపించట్లేదు. NIA అధికారులు అతడిని కస్టడీలోకి తీసుకున్నారు. కాసేపటి క్రితం అమెరికా నుంచి రాణాను తీసుకొచ్చిన ఎయిర్‌ఫోర్స్ విమానం ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది.
స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు నెలకొల్పారు. ఐపీఎల్లో 1,000 బౌండరీలు బాదిన తొలి ప్లేయర్‌గా నిలిచారు. ఇవాళ ఢిల్లీతో మ్యాచులో మూడు బౌండరీలు బాదడంతో ఈ ఘనత అందుకున్నారు. మొత్తంగా IPLలో 280 సిక్సర్లు, 721 ఫోర్లు బాదారు. తర్వాతి స్థానాల్లో ధవన్(920), వార్నర్(899), రోహిత్(885), గేల్(761) ఉన్నారు.
AP: నర్సింగ్కు 2025-26 విద్యాసంవత్సరం నుంచే కామన్ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. దేశంలోనే ఇది మొదటిసారని, నర్సింగ్ విద్యలో రాజీపడబోమని చెప్పారు. నర్సింగ్ కాలేజీల ప్రతినిధులతో సమావేశంలో ఆయన మాట్లాడారు. నవంబర్ నుంచి కాకుండా జులై నుంచే ప్రవేశాలు ఉంటాయని పేర్కొన్నారు. విద్య నాణ్యతపై అలసత్వాన్ని సహించబోమని పేర్కొన్నారు.
TG: ప్రజలకు సులువుగా, వేగవంతంగా సేవలు అందించేందుకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రారంభించిన స్లాట్ బుకింగ్ విధానానికి అనూహ్య స్పందన వచ్చిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇవాళ ప్రయోగాత్మకంగా చేపట్టిన 22 చోట్ల 626 రిజిస్ట్రేషన్లు జరిగినట్లు వెల్లడించారు. ఈ విధానంలో దళారుల ప్రమేయం ఉండబోదని చెప్పారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని వెల్లడించారు.
IPL: ఢిల్లీతో మ్యాచులో ఆర్సీబీ ఓపెనర్ ఫిల్ సాల్ట్ విధ్వంసం సృష్టించారు. మిచెల్ స్టార్క్ వేసిన మూడో ఓవర్లో ఏకంగా 24 రన్స్ చేశారు. ఆ ఓవర్లో వరుసగా 6,4,4,4NB,6,1,4(లెగ్ బై) రావడంతో 30 రన్స్ వచ్చాయి. సాల్ట్ 17 బంతుల్లో 37 రన్స్ చేసి రనౌటయ్యారు. విరాట్ (22), పడిక్కల్ (1) కూడా వెనుదిరిగారు. ప్రస్తుతం ఆర్సీబీ స్కోర్ 7 ఓవర్లలో 74/3గా ఉంది.
ఆహారాన్ని పలుమార్లు వేడి చేసి తినడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఆలుగడ్డను వేడి చేస్తే ఇందులో ఉండే నైట్రేట్లు వికారం, వాంతులు వంటి సమస్యలకు కారణమవుతాయి. పాలకూరలో ఉండే నైట్రేట్లు, అమినో యాసిడ్‌తో కలిసి క్యాన్సర్ కారకాలుగా మారొచ్చు. మష్రూమ్స్ మళ్లీ మళ్లీ వేడి చేసి తింటే గుండె జబ్బులొస్తాయి. కోడిగుడ్డు కూడా తాజాగానే తినాలి. టీని కూడా మళ్లీ వేడి చేసి తాగొద్దు. SHARE IT
TG: రైతుల కోసం ‘గ్రామ గ్రామానికి జయశంకర్ వ్యవసాయ వర్సిటీ నాణ్యమైన విత్తనం’ పథకాన్ని తీసుకొస్తున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. జూన్‌లో CM రేవంత్ ఈ స్కీమ్‌ను ప్రారంభిస్తారని తెలిపారు. ప్రతి గ్రామంలో ముగ్గురు నుంచి ఐదుగురు రైతులకు జూన్ మొదటి వారంలో ఈ పథకం కింద విత్తనాలు పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. సుమారు 40వేల మంది రైతులకు 2500-3500 క్వింటాళ్ల విత్తనాలను అందజేస్తామన్నారు.
పరీక్షల్లో ఎక్కువ మార్కులు వచ్చాయని అబద్ధం చెప్పిన కూతురిని చంపిన కేసులో తల్లికి బెంగళూరు సిటీ కోర్టు జీవితఖైదు విధించింది. తనకు సెకండ్ పీయూ ఫైనల్ పరీక్షల్లో 95% మార్కులు వచ్చాయని సాహితి తన తల్లి పద్మినితో చెప్పింది. ఆ తర్వాతి రోజే ఒక సబ్జెక్టులో ఫెయిల్ అయ్యానని చెప్పింది. తల్లి సపోర్ట్ లేకపోవడం వల్లే ఇలా జరిగిందని కోప్పడింది. దీంతో గతేడాది ఏప్రిల్ 29న పద్మిని కోపంతో సాహితిని చంపింది.
ముంబై ఉగ్రదాడి కేసు నిందితుడు తహవూర్ రాణాపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. పలు కేంద్ర సంస్థల సహకారంతో రాణాను విజయవంతంగా ఇండియాకు రప్పించామని పేర్కొంది. ‘భారత్-అమెరికా ఒప్పందంతో తహవూర్ రాణాను తీసుకువచ్చాం. పలు ఉగ్ర సంస్థలతో కలిసి ముంబై ఉగ్రదాడికి రాణా కుట్ర చేశాడు. పాక్ ప్రేరేపిత ఉగ్రసంస్థలతో అతడు చేతులు కలిపాడు. ముంబై మారణహోమంలో 166 మంది చనిపోయారు’ అని తెలిపింది.
Sorry, no posts matched your criteria.