India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: అసెంబ్లీలో పీఏసీ సమావేశం జరిగింది. ఈ భేటీకి హాజరైన ప్రతిపక్ష BRS పీఏసీ ఛైర్మన్ నియామకంపై అభ్యంతరం తెలిపింది. ఈ నియామకాన్ని నిరసిస్తూ సమావేశాన్ని బహిష్కరించింది. BRS నేతలు వేముల ప్రశాంత్, సత్యవతి రాథోడ్, ఎల్.రమణ తమ నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పీఏసీ ఛైర్మన్‌గా అరెకపూడి గాంధీని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆయన BRS నుంచి కాంగ్రెస్‌లో చేరడంతో కారు పార్టీ దీన్ని వ్యతిరేకిస్తోంది.
TG: ఈసారి పత్తి పంట సాగు చేసిన రైతులకు కన్నీళ్లే మిగిలేలా ఉన్నాయి. పంటలు సరిగా పండక, పండిన పంటకు ఆశించిన ధర దక్కకపోవడంతో రైతన్నలు ఆవేదనకు గురవుతున్నారు. క్వింటాకు రూ.6,200 కూడా దాటడం లేదని వాపోతున్నారు. పెట్టుబడి ఖర్చులైనా రావడం లేదని, ఇక చేసిన అప్పులు ఎలా తీర్చాలని విలపిస్తున్నారు. అటు వాతావరణం అనుకూలించకపోవడంతో చాలా చోట్ల పంటను ధ్వంసం చేసి వేరే పంట వేయాల్సిన దుస్థితి నెలకొంది.
AP: రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టులను ప్రైవేటు పరం చేసేందుకు సీఎం చంద్రబాబు వేగంగా అడుగులు వేస్తున్నారని YCP ట్వీట్ చేసింది. ‘మూడు పోర్టులను జగన్ సీఎంగా ఉన్నప్పుడు ప్రభుత్వ రంగంలోనే చేపట్టారు. ఇప్పుడు పోర్టులు పూర్తవుతున్న దశలో వాటిని ఆపాలని కమీషన్ల కోసం కూటమి ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేయాలని కంకణం కట్టుకున్నావా చంద్రబాబు’ అని పేర్కొంది.
పసిడి కొనుగోలుదారులకు శుభవార్త. బంగారం ధరలు తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రా. బంగారం రూ.490, 22 క్యారెట్ల 10 గ్రా. పసిడి రూ.450 తగ్గింది. దీంతో 24 క్యారెట్ల గోల్డ్ రూ.79,800కు చేరింది. 22 క్యారెట్ల బంగారం రూ.73,150గా నమోదైంది. వెండి ధరల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. కేజీ ధర రూ.1,07,000గా ఉంది.
2025 నుంచి జనాభా లెక్కలు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. కరోనా కారణంగా గతంలోనే జరగాల్సిన జనగణన వాయిదా పడుతూ వస్తోంది. దీంతో వచ్చే ఏడాది నుంచి ఈ ప్రక్రియ ప్రారంభించి, 2026 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అనంతరం లోక్‌సభ నియోజకవర్గాల విభజనను ప్రారంభించి, 2028 నాటికి ముగించాలని కేంద్రం టార్గెట్ పెట్టుకున్నట్లు సమాచారం.
TG: విద్యుత్ ఛార్జీల పెంపునకు రాష్ట్ర విద్యుత్ సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లపై రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఈరోజు తన నిర్ణయాన్ని వెల్లడించనుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1,200 కోట్ల మేర కరెంట్ ఛార్జీల పెంపునకు అనుమతి కోరుతూ డిస్కంలు పిటిషన్లు దాఖలు చేశాయి. ఒకవేళ దీనికి ఈఆర్సీ అనుమతిస్తే నవంబర్ 1 నుంచి ప్రజలపై(300యూనిట్లకు పైగా వాడేవారు) ప్రత్యక్షంగా విద్యుత్ ఛార్జీల భారం పడే అవకాశం ఉంది.
డిఫెన్స్ రంగంలో ‘మేకిన్ ఇండియా’ సత్ఫలితాలను ఇస్తోంది. 2023-24లో భారత్ రూ.21,083 కోట్ల విలువైన ఆయుధాలను <<14471733>>ఎగుమతి<<>> చేసింది. ప్రస్తుతం రూ.1.2 లక్షల కోట్లుగా ఉన్న డిఫెన్స్ ప్రొడక్షన్ 2028-29 నాటికి రూ.3 లక్షల కోట్లకు, ఎగుమతులు రూ.50వేల కోట్లకు పెంచాలని టార్గెట్‌గా పెట్టుకుంది. 16 PSUలు, 430 కంపెనీలు, 16000 SMEలతో ఇండస్ట్రీని విస్తరించింది. ప్రైవేటు కంట్రిబ్యూషన్‌ను 21%కు పెంచింది. దీనిపై మీ కామెంట్!
దేశీయ బెంచ్‌మార్క్ సూచీలు లాభాల్లో ట్రేడవుతున్నాయి. 5 సెషన్ల వరుస నష్టాల తర్వాత కాస్త పుంజుకున్నాయి. ఆసియా మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలే అందినప్పటికీ ఇన్వెస్టర్లు పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్నారు. సెన్సెక్స్ 79,869 (+466), నిఫ్టీ 24,271 (+90) వద్ద చలిస్తున్నాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, మెటల్ షేర్లు కళకళలాడుతున్నాయి. కోల్ ఇండియా, ONGC, BEL, LT, SBI లైఫ్ టాప్ లూజర్స్. ICICI, SBI టాప్ గెయినర్స్.
నవంబర్ 8 నుంచి సౌతాఫ్రికాతో జరగనున్న T20 సిరీస్ కోసం VVS.లక్ష్మణ్‌ను హెడ్ కోచ్‌గా BCCI నియమించింది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఆస్ట్రేలియాతో జరిగే బోర్డర్-గవాస్కర్ సిరీస్ కోసం ఆస్ట్రేలియాకు వెళ్లనున్నారు. సౌతాఫ్రికాతో 4 టీ20ల సిరీస్ నవంబర్ 15 వరకు కొనసాగనుంది. కాగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం భారత జట్టు నవంబర్ 10 లేదా 11వ తేదీల్లో ఇక్కడి నుంచి బయలుదేరనుంది.
TG: జన్వాడ ఫామ్‌హౌస్ పార్టీ కేసులో KTR బంధువు రాజ్ పాకాలకు మోకిల పోలీసులు నోటీసులు జారీ చేశారు. రాయదుర్గం ఓరియన్ విల్లాలోని ఆయనకు చెందిన భవనానికి నోటీసులు అంటించారు. ఇవాళ విచారణకు రావాలని పోలీసులు పేర్కొన్నారు. అటు నిన్న రాత్రి ఆయన నివాసంలో పలు విదేశీ మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Sorry, no posts matched your criteria.