news

News September 5, 2025

లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం

image

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ సీఎం జగన్ సోదరుడు వైఎస్ అనిల్ రెడ్డి పీఏ దేవరాజులును సిట్ విచారణకు పిలిచింది. కేసుకు సంబంధించి ఆయనను ప్రశ్నిస్తోంది. ఆయన చెప్పే సమాధానాలు కేసుకు కీలకంగా మారనున్నట్లు సిట్ భావిస్తోంది. కాగా ఇప్పటికే ఈ కేసులో వైసీసీ ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి అరెస్ట్ అయ్యారు.

News September 5, 2025

రబీ సీజన్‌కు 9.5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా: అచ్చెన్న

image

AP: రబీ సీజన్ కోసం 9.5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను రాష్ట్రానికి కేంద్రం కేటాయించిందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. రైతులెవరూ ఆందోళన చెందొద్దని సూచించారు. యూరియా స్టాక్, సప్లై, పంపిణీపై పలు జిల్లాల కలెక్టర్లతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ‘కృష్ణా, బాపట్ల, కడప జిల్లాల్లో యూరియా కొరత ఉంది. ఆ జిల్లాల్లో ఈ సమస్యను త్వరితగతిన పరిష్కరించాలి. యూరియా నిల్వల్లో తేడా లేకుండా చూసుకోవాలి’ అని ఆదేశించారు.

News September 5, 2025

నిమజ్జన వేడుకల్లో డీజేలకు అనుమతి లేదు: CP

image

TG: HYD వినాయక నిమజ్జన వేడుకల్లో డీజేలకు అనుమతి లేదని సీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. గతేడాది డీజే చప్పుళ్లతో చాలామంది ప్రాణాలు కోల్పోయారని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈ విషయంలో భాగ్యనగర్ ఉత్సవ సమితి కూడా సహకరిస్తోందన్నారు. ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనం ఉ.6 గంటలకు ప్రారంభమై మ.1.30 గంటలలోపు పూర్తవుతుందని తెలిపారు. మొత్తం 29వేల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

News September 5, 2025

చీర కట్టు.. ఆరోగ్యానికి మెట్టు

image

ఇంట్లో ఫంక్షన్లు, పండుగలకు తప్ప మహిళలు చీరలు కట్టుకోవడం బాగా తగ్గింది. అయితే రోజూ చీరను ధరించడం వల్ల పలు ప్రయోజనాలున్నాయి. చీర భారతీయ సంస్కృతి, సంప్రదాయ, గౌరవానికి చిహ్నం. చీర థర్మోస్‌లాగా పనిచేసి వేసవిలో శరీరాన్ని చల్లగా, శీతాకాలంలో వెచ్చగా ఉంచుతుంది. చీర వదులుగా ఉండటం వలన రక్తప్రసరణ బాగుంటుంది. అలాగే చీర మనలో పాజిటివ్ ఎనర్జీని, కాన్ఫిడెన్స్‌ను తీసుకొస్తుంది. రోజంతా యాక్టివ్‌గా ఉంచుతుంది.

News September 5, 2025

శానిటరీ ప్యాడ్స్​కూ ఎక్స్​పైరీ డేట్

image

మహిళలు పీరియడ్స్‌లో న్యాప్‌కిన్స్, మెన్‌స్ట్రువల్‌ కప్స్‌, ట్యాంపన్స్‌ వాడతారు. కానీ వీటి ఎక్స్‌పైరీడేట్ గురించి పట్టించుకోరు. ఎక్స్‌పైర్ అయిన ప్రొడక్ట్స్‌పై బ్యాక్టీరియా, వైరస్‌ పెరిగే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. వాటిని వాడితే జననేంద్రియాల్లో ఫంగల్‌ ఇన్ఫెక్షన్స్​ ముప్పు పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు. కాబట్టి వీటిని వినియోగించేముందు లేబుల్‌ని తప్పకుండా పరిశీలించాలని సూచిస్తున్నారు.

News September 5, 2025

IBలో 455 ఉద్యోగాలు

image

ఇంటెలిజెన్స్ బ్యూరో(IB)లో 455 సెక్యూరిటీ అసిస్టెంట్(మోటార్ ట్రాన్స్‌పోర్ట్) ఉద్యోగాలకు ఈ నెల 28 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. టెన్త్ ఉత్తీర్ణతతోపాటు డ్రైవింగ్ లైసెన్స్, ఒక ఏడాది అనుభవం, మోటార్ మెకానిజం పరిజ్ఞానం ఉన్నవారు అర్హులు. 18-27ఏళ్ల వయసుండాలి. ఆన్‌లైన్ ఎగ్జామ్, డ్రైవింగ్ టెస్టు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. జీతం నెలకు రూ.21,700 నుంచి రూ.69,100 ఉంటుంది.
వెబ్‌సైట్: https://www.ncs.gov.in/

News September 5, 2025

అవి ప్రజాపోరాటంలో ప్రత్యర్థులు పెట్టిన కేసులు: TDP

image

AP: మంత్రులందరిపై క్రిమినల్ కేసులున్నాయని YCP చేసిన <<17621813>>ట్వీట్‌పై<<>> TDP స్పందించింది. ప్రజాపోరాటాలు చేసే సమయంలో అధికారంలో ఉన్న ప్రత్యర్థులు ఈ కేసులు పెట్టారని పేర్కొంది. తన మీడియాలో జగన్ అసంబద్ధమైన వార్తలు ప్రచారం చేయిస్తున్నారని మండిపడింది. వీటి విషయం పక్కన పెడితే అసలు నేరాలు ఏంటో చూద్దామని.. సొంత బాబాయిని గొడ్డలితో నరికారని, దళితుడిని చంపి డోర్ డెలివరీ చేయడం వంటివి ప్రస్తావించింది.

News September 5, 2025

బయట టీ తాగుతున్నారా?

image

TG: హైదరాబాద్‌లోని 42 టీ పౌడర్ యూనిట్లు & టీ షాపుల్లో GHMC ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీ చేశారు. 19 చోట్ల నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపారు. రిపోర్ట్స్ వచ్చాక వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. అయితే శుభ్రత పాటించే దుకాణాల్లోనే టీ తాగాలని సూచించారు. ‘స్వచ్ఛమైన టీ ఆకులు తడి క్లాత్‌పై రుద్దితే అవి రంగుని వదలవు. కల్తీ టీ పొడిని నీటిలో కలపగానే ముదురు ఎరుపు రంగులోకి మారుతుంది’ అని అవగాహన కల్పించారు.

News September 5, 2025

సారా టెండూల్కర్ ఎంగేజ్‌మెంట్ అయ్యిందా?

image

సచిన్ కూతురు సారా ఎంగేజ్మెంట్ వార్తలు బీటౌన్‌లో వైరల్ అవుతున్నాయి. గోవా రెస్టారెంట్ ఓనర్ సిద్ధార్థ్ కేర్కర్‌తో సారా చనువుగా ఉన్న ఫొటోలు బయటికి వచ్చాయి. దీంతో వీరిద్దరి నిశ్చితార్థం అయ్యిందా? అని సందేహిస్తూ పలు న్యూస్ సైట్లు వార్తలు ప్రచురించాయి. గతంలో వీరు గోవాలో దిగిన ఫొటోలనూ షేర్ చేశాయి. దీనిపై సచిన్ ఫ్యామిలీ స్పందించాల్సి ఉంది. సచిన్ కొడుకు అర్జున్‌కు ఇటీవల ఎంగేజ్మెంట్ అయిన విషయం తెలిసిందే.

News September 5, 2025

హవాయి చెప్పులకు, బెంజ్ కారుకు ఒకే పన్ను వేయలేం: నిర్మలా సీతారామన్

image

మన దేశంలో ఒకే పన్ను విధానాన్ని తీసుకురావడం అసాధ్యమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. హవాయి చెప్పులకు, మెర్సిడెస్ బెంజ్ కారుకు ఒకే పన్ను వేయగలమా అని ఆమె ప్రశ్నించారు. ‘ప్రస్తుతం మన ఆర్థిక వ్యవస్థ వైవిధ్యభరితంగా ఉంది. అలాంటప్పుడు ఒకే పన్ను వేయడం కుదరదు. భారత్ అన్ని రంగాల్లో అభివృద్ధి అయినప్పుడే ‘వన్ నేషన్-వన్ ట్యాక్స్’ విధానం సాధ్యమయ్యే అవకాశం ఉంది’ అంటూ ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు.