news

News November 3, 2025

శివలింగానికి కుంకుమ పెడుతున్నారా..?

image

శివలింగానికి చాలామంది భక్తులు కుంకుమ పెడుతుంటారు. కానీ అలా పెట్టడం శాస్త్ర సమ్మతం కాదని పండితులు చెబుతున్నారు. శివలింగానికి విభూది, గంధం మాత్రమే ఉపయోగించాలని సూచిస్తున్నారు. ‘పరమశివుడు గాఢమైన ధ్యానంలో ఉంటారు. ఎరుపు రంగులో ఉండే కుంకుమ వేడిని పెంచుతుంది. అందుకే ఆయన శరీరానికి చల్లదనాన్ని, ప్రశాంతతను ఇచ్చే చందనాన్ని మాత్రమే సమర్పించాలి. శివారాధనలో కుంకుమకు బదులు గంధం వాడటం అత్యంత ముఖ్యం’ అంటున్నారు.

News November 3, 2025

మిడ్‌నైట్ క్రేవింగ్స్‌కి కారణం ఇదే..

image

కడుపునిండా తిన్నా కొందరికి అర్ధరాత్రిళ్లు ఆకలివేస్తూ ఉంటుంది. సరిగా నిద్రపట్టక దొరికిన స్నాక్స్ తినేస్తారు. దీంతో దీర్ఘకాలిక వ్యాధులొచ్చే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. గ్రెలిన్ హార్మోన్ పెరగడం, ఒత్తిడి, డైటింగ్, కొన్నిరకాల మందులు వాడటం వల్ల క్రేవింగ్స్ వస్తాయి. డిన్నర్‌లో ప్రొటీన్, ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే క్రేవింగ్స్ తగ్గుతాయి. లేదంటే డ్రైఫ్రూట్స్ తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.

News November 3, 2025

ఉపగ్రహాలతో గ్లోబల్ వార్మింగ్‌ను నియంత్రించొచ్చు: మస్క్

image

వాతావరణ మార్పులపై ఆందోళన పెరుగుతున్న వేళ టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ కీలక ప్రకటన చేశారు. ఏఐ‌తో నడిచే భారీ ఉపగ్రహాల సముదాయంతో గ్లోబల్ వార్మింగ్‌ను నివారించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. భూమిని చేరే సౌర శక్తి మొత్తంలో చిన్న సర్దుబాట్లు చేయడం ద్వారా వాతావరణాన్ని నియంత్రించవచ్చని మస్క్ ట్వీట్‌లో పేర్కొన్నారు. సహజ పరిణామాన్ని నిరోధిస్తే ముప్పు తప్పదని కొందరు ఆయనకు కౌంటర్ వేస్తున్నారు.

News November 3, 2025

కోయంబత్తూర్‌లో PG విద్యార్థినిపై గ్యాంగ్ రేప్

image

కోయంబత్తూర్(TN) ఎయిర్ పోర్టు సమీపంలో PG విద్యార్థిని గ్యాంగ్ రేప్‌కి గురైంది. నిన్న సాయంత్రం ఆమె ప్రియుడితో కలిసి బయటకు వెళ్లింది. రాత్రి 11గ.లకు ఎయిర్‌పోర్టు దగ్గర కారులో వారు ఉండగా ముగ్గురు వ్యక్తులు వచ్చి అద్దాలు పగులగొట్టారు. ప్రియుణ్ని తీవ్రంగా కొట్టారు. ఆమెను దూరంగా షెడ్లోకి లాక్కెళ్లి రేప్ చేశారు. పోలీసులు బాధితుల్ని గుర్తించి ఆసుపత్రికి తరలించారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.

News November 3, 2025

జూబ్లీహిల్స్‌కు పాక్‌కు లింక్ పెట్టడం సరికాదు: కిషన్ రెడ్డి

image

TG: రాజకీయ విమర్శలకు పరిమితులు ఉండాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్‌కు పాకిస్థాన్‌కు <<18176289>>లింక్<<>> పెట్టడం సరికాదన్నారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది ఫ్రీ బస్సు ఒక్కటే. జూబ్లీహిల్స్‌లో BJPకి మంచి స్పందన వస్తోంది. అజహరుద్దీన్‌కు మంత్రి పదవి ఇవ్వడం BJPకే ప్లస్. KCR రెండేళ్లుగా ఎక్కడా కనిపించలేదు. ప్రజల మధ్యకు రాని ఆయన మళ్లీ CM ఎలా అవుతారు?’ అని మీడియాతో చిట్‌చాట్‌లో వ్యాఖ్యానించారు.

News November 3, 2025

మల్లె తోటల్లో ఆకులు రాల్చడం.. దేని కోసం?

image

మల్లె తోటల్లో మంచి దిగుబడి కోసం.. నవంబర్ నుంచి చెట్లకు నీరు పెట్టకుండా ఆకులు రాలేటట్లు చేయాలి. అలాగే కొందరు రైతులు మల్లె తోటల్లో గొర్రెలను మంద కడతారు. దీని వల్ల గొర్రెలు ఆకులను తింటాయి. ఫలితంగా మొక్కలకు కొత్త చిగుర్లు వస్తాయి. అలాగే గొర్రెల ఎరువు వల్ల కూడా భూసారం పెరుగుతుంది. తర్వాత కొమ్మ కత్తిరింపులు చేపట్టాలి. కొమ్మలను కత్తిరించడానికి 10 నుంచి 15 రోజుల ముందు నుంచి నీరు కట్టడం ఆపేయాలి.

News November 3, 2025

రాబోయే 2 గంటల్లో వర్షం: APSDMA

image

AP: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రానున్న 2 గంటల్లో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని APSDMA తెలిపింది. విజయనగరం, అల్లూరి, అనకాపల్లి, ఏలూరు జిల్లాల్లో కొన్నిచోట్ల వర్షాలకు ఛాన్స్ ఉందని వెల్లడించింది. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లోనూ అక్కడక్కడ పిడుగులతో కూడిన వానలు పడతాయని అంచనా వేసింది. ఈ సమయంలో 40-50kmph వేగంతో గాలులు వీస్తాయని, చెట్ల కింద నిల్చోవద్దని సూచించింది.

News November 3, 2025

శీతాకాలం అతిథుల రాక మొదలైంది: పవన్

image

AP: పులికాట్ సరస్సుకు శీతాకాలం అతిథులైన ఫ్లెమింగ్ పక్షుల రాక మొదలైందని Dy.CM పవన్ అన్నారు. ‘ఎకో టూరిజం గమ్యస్థానంగా పులికాట్‌ను మారుస్తాం. ఫ్లెమింగోలు ఆహారం, విశ్రాంతి కోసం అక్టోబరులో వచ్చి మార్చిలో తిరిగి వెళ్లిపోతాయి. వాటికి ఇబ్బందులు కలగకుండా కొంత కాలంగా తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఈసారి 3 రోజుల పండుగతో సరిపెట్టకుండా ఎకో టూరిజాన్ని విస్తరిస్తాం’ అని పవన్ చెప్పారు.

News November 3, 2025

ముంబైలో 70KMల అండర్ గ్రౌండ్ టన్నెల్: MMRDA

image

నిత్యం వాహనాలతో రద్దీగా ఉండే ముంబై రోడ్లపై ప్రయాణమంటే అక్కడి వారికి రోజూ నరకమే. దాన్నుంచి తప్పించేందుకు MMRDA ఏకంగా 70KM మేర అండర్ గ్రౌండ్ టన్నెల్ మార్గాన్ని నిర్మించనుంది. దీనికి సంబంధించి ఫీజిబిలిటీ రిపోర్టును రూపొందిస్తోంది. మూడు ఫేజ్‌లుగా నిర్మాణం జరగనుంది. అక్కడ నిర్మిస్తున్న అంతర్గత టన్నెల్ మార్గాలకు వేరుగా దీన్ని నిర్మించనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. దీంతో ప్రయాణం సాఫీ అవుతుంది.

News November 3, 2025

ఎన్ని అవాంతరాలు ఎదురైనా SLBC పూర్తి చేస్తాం: CM

image

TG: SLBC టన్నెల్ పనులపై BRS నేతలు రాజకీయాలు చేయడం తగదని CM రేవంత్ అన్నారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా టన్నెల్ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. నాగర్ కర్నూల్ మన్నేవారిపల్లిలో పర్యటన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘SLBC పనులను గత ప్రభుత్వం గాలికొదిలేసింది. పదేళ్లలో 10kms కూడా పూర్తి చేయలేదు. కమీషన్లు రావని ఈ ప్రాజెక్టును పక్కనపెట్టారు’ అని విమర్శించారు.