news

News September 5, 2025

పాండ్య బ్రదర్స్ మంచి మనసు

image

టీమ్ ఇండియా క్రికెటర్లు హార్దిక్ పాండ్య, కృనాల్ పాండ్య మంచి మనసు చాటుకున్నారు. తమ చిన్ననాటి కోచ్ జితేంద్ర సింగ్‌కు రూ.80 లక్షల ఆర్థిక సాయం చేశారు. ఈ విషయాన్ని స్వయంగా జితేంద్రనే ఓ మీడియాకు తెలిపారు. తన చిన్న చెల్లెలు పెళ్లి కోసం రూ.20 లక్షలు, కారు కోసం రూ.20 లక్షలు, తల్లి చికిత్స కోసం కొంత నగదు, ఇతర అవసరాల కోసం రూ.18 లక్షలు ఇలా ఇప్పటివరకు రూ.70-రూ.80 లక్షల వరకు ఇచ్చారని వెల్లడించారు.

News September 5, 2025

డేంజర్.. మీ పిల్లలు ఇలా నడుస్తున్నారా?

image

ఏడాది దాటాక పిల్లలు బుడిబుడి అడుగులు వేయడం మొదలు పెడతారు. ఈ క్రమంలో కాలివేళ్లపై నడుస్తారు. కానీ మూడేళ్లు దాటిన తర్వాత కూడా పిల్లలు అలాగే నడుస్తుంటే అది ఆటిజం వ్యాధికి సంకేతం కావొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఆటిజం ఒక న్యూరో డెవలప్‌మెంటల్ కండిషన్. దీనివల్ల ఇంద్రియాల మధ్య సమన్వయం ఉండదు, భావ వ్యక్తీకరణలోపం ఉంటుంది. కాబట్టి చిన్నారుల్లో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది.

News September 5, 2025

థైరాయిడ్ వల్ల జుట్టు ఊడుతోందా?

image

కొంతమందిలో థైరాయిడ్ కంట్రోల్​లో ఉన్నప్పటికీ హెయిర్‌ఫాల్ అవుతుంటుంది. దీనికి విటమిన్ డి, కాల్షియం లోపం కారణం కావొచ్చంటున్నారు నిపుణులు. కాబట్టి చేపలు, గుడ్లు, పాల సంబంధిత ఉత్పత్తులు, నువ్వులు, డేట్స్, నట్స్ వంటి కాల్షియం రిచ్ ఫుడ్స్ డైలీ డైట్​లో చేర్చుకోవాలి. విటమిన్ డి లోపం కారణంగా జుట్టు రాలుతుంటే డి విటమిన్ ఎక్కువగా ఉండే ఆహారాలు, సప్లిమెంట్లు తీసుకోవాలని ఎండోక్రినాలజిస్టులు సూచిస్తున్నారు.

News September 5, 2025

సెకండ్ ఇన్నింగ్స్ ఇలా హిట్

image

చాలామంది మహిళలు వివిధ కారణాలతో ఉద్యోగంలో విరామం తీసుకుంటారు. తిరిగి ఉద్యోగంలో చేరదామంటే ఎన్నో సవాళ్లు. వీటిని ఎదుర్కొని కెరీర్‌లో రాణించాలంటే కొన్ని టిప్స్ పాటించాలి. విరామానికి గల కారణాలు, కొత్త నైపుణ్యాలు నేర్చుకుంటే అవీ రెజ్యూమేలో చేర్చాలి. ఆత్మవిశ్వాసంతో ఇంటర్వ్యూకు హాజరవ్వాలి. అలాగే కొన్ని సంస్థలు విరామం తీసుకున్న మహిళల కోసం ప్రత్యేకంగా రిక్రూట్‌మెంట్స్ జరుపుతున్నాయి. వాటికి హాజరవ్వాలి.

News September 5, 2025

తురకపాలెం మరణాలకు వైరస్ కారణం కావొచ్చు: సత్యకుమార్

image

AP: తురకపాలెం <<17599008>>మరణాలపై<<>> కారణాలు ఇప్పటికీ తెలియలేదని మంత్రి సత్యకుమార్ అన్నారు. వైద్యపరీక్షల్లో మెలియాయిడోసిస్ ఆనవాళ్లు లేవని తేలిందని, రక్తనమూనాలను చెన్నై ల్యాబ్‌కు పంపించినట్లు చెప్పారు. ఫలితాలు ఇంకా రాలేదని, వైరస్ కారణమని భావిస్తున్నట్లు తెలిపారు. మరణాల విషయంలో అలసత్వం వహించిన DMHOపై విచారణ చేస్తున్నట్లు పేర్కొన్నారు. త్వరలోనే గ్రామంలో సాధారణ పరిస్థితి తీసుకొస్తామన్నారు.

News September 5, 2025

గణేశ్ నిమజ్జనానికి బాంబు బెదిరింపులు

image

ముంబై పోలీసులు హై అలర్ట్‌లో ఉన్నారు. రేపు గణేశ్ నిమజ్జనంలో విధ్వంసం సృష్టిస్తామని వారికి బాంబు బెదిరింపులు అందాయి. లష్కర్ ఏ జిహాదీ పేరిట.. ’14మంది పాక్ టెర్రరిస్టులు భారత్‌లోకి చొరబడ్డారు. 34 వాహనాల్లో మానవ బాంబులను సిద్ధం చేశాం. 400 కిలోల ఆర్డీఎక్స్‌తో పేలుళ్లు ప్లాన్ చేశాం. కోటిమంది చనిపోగలరు’ అని వాట్సాప్ మెసేజ్ పంపారు. ఈ నేపథ్యంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేసి తనిఖీలు చేపట్టారు.

News September 5, 2025

అందుకే విద్యాశాఖ నా దగ్గరే పెట్టుకున్నా: రేవంత్

image

TG: తెలంగాణ ఉద్యమంలో టీచర్లదే కీలక పాత్ర అని సీఎం రేవంత్ అన్నారు. ప్రతి గ్రామానికి జై తెలంగాణ నినాదాన్ని చేరవేశారని గుర్తు చేశారు. శిల్పకళావేదికలో గురుపూజోత్సవంలో ఆయన పాల్గొన్నారు. విద్యాశాఖలో ఎన్నో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. చాలా చోట్ల కేజీ టూ పీజీ వరకు ఉచిత విద్య అందడం లేదని తెలిపారు. పదేళ్లుగా ఉన్న సమస్యలను పరిష్కరించేందుకే విద్యాశాఖను తన వద్ద పెట్టుకున్నానని పేర్కొన్నారు.

News September 5, 2025

మండుతున్న ఎండలు.. SEP 10 వరకు ఇంతే!

image

ఇన్ని రోజులు అల్పపీడనాలతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. వాగులు, వంకలు పొంగి పొర్లాయి. చాలాచోట్ల రహదారులు కూడా కొట్టుకుపోయాయి. ఊళ్లకి ఊళ్లు మునిగిపోయాయి. నిన్నటి నుంచి పరిస్థితులు అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. ఎండలు మండిపోతున్నాయి. ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఏపీ, తెలంగాణలో సెప్టెంబర్ 10 వరకు ఈ తరహా వాతావరణమే ఉంటుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

News September 5, 2025

పశువుల్లో గొంతువాపు వ్యాధి – లక్షణాలు

image

వర్షాకాలంలో ఇది ఎక్కువగా వస్తుంది. దీనినే గురకవ్యాధి అని కూడా అంటారు. కలుషితమైన నీరు, మేత వల్ల రోగనిరోధక శక్తి తగ్గితే ఈ వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి బారిన పడ్డ పశువు కంటి నుంచి నీరు, నోటి నుంచి చొంగకారుస్తుంటుంది. శ్వాస తీసుకునేటప్పుడు గురక శబ్దం వస్తుంది. తీవ్రమైన జ్వరం ఉంటుంది. గొంతు కిందకు నీరు చేరి గొంతువాపు వస్తుంది. ఈ లక్షణాలు పశువులో కనిపించిన వెంటనే వెటర్నరీ వైద్యుడిని సంప్రదించాలి.

News September 5, 2025

సంస్కరణలకు సహకరించండి: లోకేశ్

image

APలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల స్థాపనకు చేయూత అందించాలని మంత్రి లోకేశ్ PM మోదీని కోరారు. APకి సెమీ కండక్టర్ యూనిట్ మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. విద్యాప్రమాణాల మెరుగుదలకు సంస్కరణలు అమలు చేస్తున్నామని, మెరుగైన ఫలితాలు సాధించేందుకు సహకరించాలని కోరారు. రాష్ట్రంలో కొంతకాలంగా నెలకొన్న వివిధ పరిణామాలను మోదీకి వివరించారు. రాష్ట్రాభివృద్ధికి అన్నివిధాలా సహకారం అందిస్తామని మోదీ బదులిచ్చారు.