India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: జన్వాడ ఫామ్‌హౌస్ పార్టీ కేసులో KTR బంధువు రాజ్ పాకాలకు మోకిల పోలీసులు నోటీసులు జారీ చేశారు. రాయదుర్గం ఓరియన్ విల్లాలోని ఆయనకు చెందిన భవనానికి నోటీసులు అంటించారు. ఇవాళ విచారణకు రావాలని పోలీసులు పేర్కొన్నారు. అటు నిన్న రాత్రి ఆయన నివాసంలో పలు విదేశీ మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఇరాన్ సుప్రీమ్ లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ హీబ్రూ అకౌంట్‌ను X సస్పెండ్ చేసినట్టు జెరూసలేం పోస్ట్ తెలిపింది. ‘జియోనిస్టు ప్రభుత్వం తప్పు చేసింది. తమ సమీకరణాల్లో ఇరాన్‌ను తక్కువగా లెక్కగట్టింది. మాకెలాంటి శక్తి, సామర్థ్యం, ఆకాంక్షలు ఉన్నాయో అర్థమయ్యేలా చేస్తాం’ అని ఆదివారం ఖమేనీ పోస్ట్ చేశారు. ‘దయామయుడైన అల్లా పేరుతో…’ అని శనివారం పెట్టారు. ఇవి ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడి తర్వాత చేసినవే కావడం గమనార్హం.
ఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్‌ని సందర్శించిన ఫొటోలను హీరోయిన్ సాయిపల్లవి పంచుకున్నారు. ‘అమరన్ సినిమా ప్రమోషన్లను ప్రారంభించే ముందు అక్కడికి వెళ్లాలనుకున్నా. మనకోసం ప్రాణాలు అర్పించిన సైనికుల జ్ఞాపకార్థం ఇక్కడ వేలాది ఇటుకలను ఉంచారు. మేజర్ ముకుంద్ వరదరాజన్ AC(P)& సిపాయి విక్రమ్ సింగ్‌లకు నివాళి అర్పిస్తూ నేను భావోద్వేగానికి లోనయ్యా’ అని ఆమె ట్వీట్ చేశారు. కాగా ‘అమరన్’ ఈనెల 31న రిలీజ్ కానుంది.
TG: రైతుల నుంచి ప్రభుత్వం ధాన్యం కొనడం లేదన్న మీడియా కథనాలపై మాజీ మంత్రి KTR స్పందించారు. ‘దసరాకే కాదు. దీపావళికి కూడా రైతులను దివాలా తీయిస్తారా? కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి ధాన్యం మూలుగుతున్నా కొనాలని అధికారులకు ఆదేశాలు అందవాయే. రాజకీయాలపై పెట్టిన దృష్టి ధాన్యం కొనుగోలుపై ఎందుకు పెట్టరు? రాజకీయాల్లో రాక్షసక్రీడలను మాని రైతులను ఆదుకోవడంపై దృష్టి కేంద్రీకరించండి’ అని కోరారు.
పాకిస్థాన్ క్రికెట్ టీమ్ కోచ్ పదవి నుంచి గ్యారీ కిర్‌స్టెన్ తప్పుకున్నారు. ప్లేయర్లతో అభిప్రాయ భేదాలు రావడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆయన స్థానంలో జాసన్ గిలెస్పీ/ఆకిబ్ జావేద్‌ను కోచ్‌గా నియమించే అవకాశం ఉందని క్రీడా వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది మేలో కిర్‌స్టెన్ PAK వైట్ బాల్ కోచ్‌గా బాధ్యతలు తీసుకున్నారు. కాంట్రాక్టు ప్రకారం ఆయన రెండేళ్లపాటు కొనసాగాల్సి ఉంది. కానీ 6 నెలలకే రిజైన్ చేశారు.
ప్రతిష్ఠాత్మక మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2024 కిరీటాన్ని భారత్ గెలుచుకుంది. పంజాబ్‌కు చెందిన 20 ఏళ్ల రాచెల్ గుప్తా పోటీలో విజయం సాధించి మన దేశానికి తొలి కిరీటాన్ని తెచ్చిపెట్టారు. దీంతోపాటు గ్రాండ్ పేజెంట్స్ ఛాయిస్ అవార్డునూ ఆమె గెలుచుకున్నారు. ఇందులో 70 దేశాలకు చెందిన పోటీదారులు పాల్గొన్నారు. ‘మనం సాధించాం. భారత చరిత్రలో మొదటి గోల్డెన్ క్రౌన్‌ను గెలిచాం’ అని రాచెల్ ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు.
ప్రపంచంలోనే అత్యంత ఎక్కువగా ఆయుధాలు దిగుమతి చేసుకొనే స్థితి నుంచి ఎగుమతి చేసే స్థాయికి భారత్ ఎదిగింది. 2023-24లో మన డిఫెన్స్ ఎక్స్‌పోర్ట్స్ విలువ ఏకంగా రూ.21,083 కోట్లకు చేరింది. 100 దేశాలకు ఎగుమతి చేస్తుండగా అమెరికా, ఫ్రాన్స్, ఆర్మేనియా టాప్-3 కస్టమర్లుగా ఉన్నాయి. బ్రహ్మోస్, ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్స్, పినాక మల్టీ లాంచ్ రాకెట్ సిస్టమ్, 155mm ఆర్టిలరీ గన్స్‌ను భారత్ ఎగుమతి చేస్తోంది.
కటాఫ్ డేట్ నిబంధన కారణంగా పీఎం కిసాన్ పథకానికి లక్షలాది మంది రైతులు దూరమవుతున్నారు. 2018 డిసెంబర్ నుంచి 2019 ఫిబ్రవరి 1 మధ్య భూమి ఎవరి పేరుతో ఉంటే వారికే ఏటా రూ.6వేలను కేంద్రం అందిస్తోంది. ఆ తేదీ తర్వాత భూమి కొనుగోలు చేసినవారు, వారసత్వంగా పొలం సంక్రమించినవారికి పీఎం కిసాన్ లబ్ధి చేకూరడం లేదు. అందరికీ డబ్బులు అందేలా కేంద్రం నిబంధనలు మార్చాలని రైతులు కోరుతున్నారు.
TG: జనాభా ప్రాతిపదికన స్థానిక సంస్థల్లో బీసీలకు కల్పించాల్సిన రిజర్వేషన్లపై పార్టీలు, సంఘాలు, ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు నేటి నుంచి బీసీ కమిషన్ జిల్లాల్లో పర్యటించనుంది. ఈరోజు ఆదిలాబాద్ జిల్లాతో ఈ పర్యటన ప్రారంభం కానుంది. రేపు నిజామాబాద్, ఆ తర్వాత వరుసగా సంగారెడ్డి, కరీంనగర్, వరంగల్, నల్గొండ, ఖమ్మం, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, హైదరాబాద్ జిల్లాల్లోని కలెక్టర్ కార్యాలయాల్లో విచారణ ఉంటుంది.
AP: అన్నమయ్య(D) రాజంపేట(మ) మన్నూరులో విషాదం చోటుచేసుకుంది. చికెన్ ముక్క రెండేళ్ల చిన్నారి ప్రాణం తీసింది. నిన్న ఆదివారం కావడంతో కృష్ణయ్య, మణి దంపతులు చికెన్ వండారు. పొరపాటున కింద పడ్డ చికెన్ ముక్కను సుశాంక్ తినేందుకు యత్నించాడు. గొంతులో ఇరుక్కుపోయి ఊపిరాడక అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయాడు. చికెన్ ముక్క గొంతులో ఇరుక్కోవడంతోనే అతడు చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
Sorry, no posts matched your criteria.