India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: హైదరాబాద్‌లో నవంబర్ 28 వరకు నెల రోజులపాటు ఆంక్షలు విధిస్తున్నట్లు సీపీ సీవీ ఆనంద్ ప్రకటించారు. పలు సంస్థలు, పార్టీలు శాంతి భద్రతలకు భంగం కలిగించే అవకాశం ఉందని సమాచారం రావడంతో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామన్నారు. సభలు, సమావేశాలు, ధర్నాలు, రాస్తారోకోలు, ర్యాలీలపై నిషేధం ఉంటుందని, ఒకే చోట ఐదుగురు కంటే ఎక్కువ మంది గుమిగూడకూడదని తెలిపారు.
ఏపీలో సీప్లేన్ సర్వీసులను డిసెంబర్ 9న ప్రారంభిస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. తొలుత ప్రకాశం బ్యారేజీ నుంచి శ్రీశైలం వరకు ట్రయల్ రన్ నిర్వహిస్తామన్నారు. ఈ సర్వీసులు అందుబాటులోకి వస్తే బెజవాడ కనకదుర్గమ్మ, శ్రీశైలం భ్రమరాంబికా మల్లికార్జునస్వామి ఆలయాలను ఒకే రోజు అతి తక్కువ ఖర్చుతో దర్శించుకోవచ్చని అధికారులు చెబుతున్నారు.
TG: HYDలో హైడ్రా అధికారులు ఏ భవనాన్ని ఎప్పుడు కూలుస్తారోననే భయంతో కొత్త ఇళ్లు కొనేందుకు జనం జంకుతున్నారు. దీంతో ‘మా వద్ద హైడ్రా అప్రూవ్డ్ ఇళ్లు ఉన్నాయి. మా ప్రాజెక్టులో ఇళ్లు కొనండి’ అని బిల్డర్లు ప్రకటనలు చేస్తున్నారు. అటు FTL, బఫర్ జోన్ల పరిధిలో ఉన్న భవనాలను కూల్చివేస్తుండటం రియల్ ఎస్టేట్ రంగంపై ప్రతికూల ప్రభావం పడుతోంది. డౌన్‌పేమెంట్ కట్టిన వారూ డెవలపర్లతో ఒప్పందాలు రద్దు చేసుకుంటున్నారు.
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(UBI)లో 1,500 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. APలో 200, TGలో 200 ఖాళీలున్నాయి. ఏదైనా డిగ్రీ, పది/ఇంటర్‌లో స్థానిక భాషను చదివి ఉన్నవారు అర్హులు. వయసు OCT 1, 2024 నాటికి 30 ఏళ్లకు మించొద్దు. NOV 13 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైతే అలవెన్సులతో కలిపి జీతం ₹77K పొందొచ్చు.
వెబ్‌సైట్: <
స్పెయిన్ ప్రెసిడెంట్ పెడ్రో సాంచెజ్ ఎర్లీమార్నింగ్ వడోదరాకు చేరుకున్నారు. 3 రోజుల పర్యటనకు వచ్చిన ఆయనకు ఫారిన్ సెక్రటరీ విక్రమ్ మిస్రీ స్వాగతం పలికారు. మేకిన్ ఇండియాలో భాగంగా C295 ఎయిర్‌క్రాఫ్ట్ ఫైనల్ అసెంబ్లీ లైన్ ప్లాంట్‌ను PM మోదీతో కలిసి ప్రారంభిస్తారు. అలాగే కొన్ని MOUలు, అగ్రిమెంట్లపై సంతకం చేస్తారు. ట్రేడ్ వర్గాలను కలుస్తారు. స్పెయిన్ ప్రెసిడెంట్ భారత్‌కు రావడం 18 ఏళ్లలో ఇదే తొలిసారి.
TG:రామగుండం కార్పొరేషన్ కేంద్రంగా అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటుకు ప్రభుత్వం అడుగులేస్తోంది. పెద్దపల్లి జిల్లా మొత్తాన్ని రుడా పరిధిలోకి తీసుకొచ్చే ఆలోచనలో ఉంది. రామగుండం, మంథని, పెద్దపల్లి, సుల్తానాబాద్ మున్సిపాలిటీలతో పాటు 191 గ్రామాలను దీని పరిధిలోకి తీసుకొచ్చేలా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఇందులో చేరడంపై గ్రామాలు, మున్సిపాలిటీల నుంచి అభ్యంతరాలు స్వీకరించాక ప్రభుత్వం GO జారీ చేసే ఛాన్సుంది.
సినీ నిర్మాత, నటుడు జాగర్లమూడి రాధాకృష్ణమూర్తి(85) బాపట్ల జిల్లా కారంచేడులోని స్వగృహంలో కన్నుమూశారు. తొలుత సినిమాల్లో చిన్నచిన్న పాత్రలు పోషించిన ఆయన ఆ తర్వాత నిర్మాతగా మారారు. వియ్యాలవారి కయ్యాలు, ప్రతిబింబాలు, ఒక దీపం వెలిగింది, శ్రీవినాయక విజయం, కోడళ్ళొస్తున్నారు జాగ్రత్త వంటి సినిమాలు నిర్మించారు. అక్కినేని నాగేశ్వర్‌రావుతో 1982లో ఆయన తీసిన ‘ప్రతిబింబాలు’ 2022లో విడుదలైంది.
ఏపీలో పెట్టుబడులపై టెస్లా CFO వైభవ్ తనేజాతో మంత్రి లోకేశ్ భేటీ అయ్యారు. USలోని ఆస్టిన్‌లో ఉన్న టెస్లా కేంద్ర కార్యాలయాన్ని లోకేశ్ సందర్శించారు. టెస్లా EV తయారీ, బ్యాటరీ ఉత్పత్తుల యూనిట్ల ఏర్పాటుకు అనంతపురం జిల్లా వ్యూహాత్మక ప్రదేశంగా ఉంటుందని చెప్పారు. 2029 నాటికి రాష్ట్రంలో 72GW రెన్యువబుల్ ఎనర్జీ ఉత్పత్తే తమ లక్ష్యమని, దీనికి టెస్లా వంటి గ్లోబల్ కంపెనీ సహాయ, సహకారాలు అవసరమని పేర్కొన్నారు.
భవ్యమందిరంలో అయోధ్య రామయ్య తొలి దీపావళి వేడుకలు జరుపుకొనేందుకు సిద్ధమవుతున్నారు. పండగరోజున సాకేతపురి, సరయూ తీరం 28 లక్షల దీపాలతో శోభాయమానంగా వెలిగిపోనుంది. UP Govt ఈ దీపోత్సవాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. దీపాలు ఎక్కువసేపు వెలిగేలా, కాలుష్యం వెలువడకుండా ప్రత్యేకమైన కుందులను తయారు చేయిస్తోంది. 2వేల సూపర్ వైజర్లు, 30వేల మంది వాలంటీర్లు 55 ఘాట్లలో దీపాలు అలంకరిస్తారు. ఇప్పటికే పనులు మొదలయ్యాయి.
TG: దివ్యాంగుల పెన్షన్‌ను రూ.6వేలకు పెంచాలని దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక రాష్ట్ర కమిటీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకోవాలని కోరింది. పెంచిన పెన్షన్‌ను 2024 జనవరి నుంచి అమలు చేయాలని విజ్ఞప్తి చేసింది. ఈ హామీ అమలు కోసం త్వరలోనే ఉద్యమ కార్యాచరణ రూపొందించనున్నట్లు ప్రకటించింది.
Sorry, no posts matched your criteria.