India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: కవిత <<17599702>>ఆరోపణలపై<<>> మాజీ మంత్రి హరీశ్ రావు పరోక్షంగా స్పందించారు. BRSకు సుప్రీం కేసీఆరే అని, ఎవరి విషయంలోనైనా నిర్ణయం పార్టీదేనని స్పష్టం చేశారు. కలిసికట్టుగా పనిచేయడం, ప్రజలకు సేవ చేయడమే KCR తమకు నేర్పించారని తెలిపారు. ‘కాళేశ్వరం’ అవినీతికి హరీశ్ రావు కారణమంటూ ఆరోపణలు చేయడంతో కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. దీంతో ఆమె పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
US రక్షణశాఖ (పెంటగాన్)ను ఇక నుంచి యుద్ధశాఖ (డిపార్ట్‌మెంట్ ఆఫ్ వార్)గా పిలవాలని ట్రంప్ ఆదేశించారు. ‘డిఫెన్స్ సెక్రటరీ’ని ‘వార్ సెక్రటరీ’గా పేర్కొంటూ ఉత్తర్వులు ఇవ్వనున్నారు. నిజానికి ఆ దేశ రక్షణశాఖ 1789-1947 మధ్య డిపార్ట్‌మెంట్ ఆఫ్ వార్‌గా ఉండేది. ఆ తర్వాత రక్షణ శాఖగా మార్చారు. ఇప్పుడు ట్రంప్ మళ్లీ పాత పేరు పెట్టారు. ప్రత్యర్థులకు తమ యుద్ధ సన్నద్ధతను తెలిపేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఇవాళ కూడా స్టాక్ మార్కెట్లు లాభాలతోనే మొదలయ్యాయి. 10 గంటల సమయంలో సెన్సెక్స్ 145 పాయింట్లు లాభపడి 80,863 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 54 పాయింట్లు లాభం పొంది 24,788 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. M&M, రిలయన్స్, టాటా మోటర్స్, మారుతీ సుజుకీ, బజాజ్ ఫిన్‌సర్వ్ లాభాల్లో, ITC, HDFC, ICICI, టాటా స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్ నష్టాల్లో కొనసాగుతున్నాయి.
తాను చేయబోయే తర్వాతి సినిమా కూతురు రాహా చూసేలా ఉండాలనుకుంటున్నట్లు హీరోయిన్ అలియా భట్ చెప్పారు. కూతురు చూసే సినిమాలను తాను ఇప్పటివరకూ చేయలేదని అన్నారు. చిన్నారి కోసమే జానర్ మార్చి కామెడీ కథలను ఎంచుకోనున్నట్లు ఆమె తెలిపారు. త్వరలోనే కొత్త ప్రాజెక్టుల వివరాలను వెల్లడిస్తానని చెప్పారు. భర్త రణ్‌బీర్ కపూర్‌తో కలిసి ఆమె నటిస్తోన్న ‘లవ్ అండ్ వార్’ 2026 మార్చి 20న రిలీజ్ కానుంది.
బంగారం ధరలు ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయికి చేరాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.760 పెరిగి రూ.1,07,620కు చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ.700 ఎగబాకి రూ.98,650 పలుకుతోంది. అటు KG వెండిపై రూ.100 తగ్గి రూ.1,36,900గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
AP: విద్య నేర్పే గురువుల పట్ల కూడా YCP నీచంగా వ్యవహరిస్తోందని మంత్రి లోకేశ్ ఆరోపించారు. <<17608204>>పక్క రాష్ట్రం<<>>లో జరిగిన ఘటనను AP టీచర్లకు అంటగడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రాష్ట్రంలో పని చేస్తున్న టీచర్లు తాగి బెంచీల కింద పడుకుంటున్న రీతిలో జుగుప్సాకరంగా వైసీపీ ఫేక్ హ్యాండిల్స్‌లో ఫేక్ ప్రచారం చేస్తోంది. దీంతో YCP నీతిబాహ్యమైన చర్యల్లో మరో మెట్టు దిగజారింది. ఇది క్షమించరాని నేరం’ అని ట్వీట్ చేశారు.
మధ్యప్రదేశ్ జబల్‌పూర్‌లో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వ ఆస్పత్రిలో 34 ఏళ్ల మహిళ 5.2 కేజీల మగపిల్లాడికి జన్మనిచ్చింది. నార్మల్ డెలివరీ సాధ్యపడకపోవడంతో సిజేరియన్ చేశామని వైద్యులు తెలిపారు. ఇంత బరువున్న శిశువును చూడటం ఇదే తొలిసారి అని సంబరపడుతూ అతడితో ఫొటోలు తీసుకున్నారు. ఆ ఫొటోల్లో ఆ పిల్లాడు ఏడాది వయసు ఉన్నవాడిగా కనిపించాడు. సాధారణంగా పిల్లలు 2.5 కేజీల నుంచి 3.2 కేజీల బరువుతో జన్మిస్తారు.
మహిళల వన్డే WC టికెట్ల ధరను ICC రూ.100గా నిర్ణయించింది. ప్రేక్షకులను స్టేడియాలకు రప్పించేందుకు లీగ్ మ్యాచులకు ఈ ధరలు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. సెప్టెంబర్ 30న మొదలయ్యే ఈ టోర్నీని ఘనంగా ప్రారంభించేందుకు గువహటిలో సింగర్ శ్రేయా ఘోషల్‌తో గ్రాండ్‌గా ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహిస్తోంది. శ్రీలంకతో పాటు భారత్ ఈ మెగా టోర్నీకి ఆతిథ్యం ఇస్తోంది. విశాఖలో OCT 9, 12, 13, 16, 26 తేదీల్లో మ్యాచులున్నాయి.
గాజాలో మరణాల సంఖ్య 64వేలు దాటినట్లు అధికారులు తెలిపారు. నిన్న ఇజ్రాయెల్ దాడుల్లో 28 మంది మరణించగా వారిలో చిన్నారులు, మహిళలే అధికంగా ఉన్నట్లు పేర్కొన్నారు. మరోవైపు శాశ్వత కాల్పుల విరమణకు అంగీకరిస్తే 48 మంది బందీలను విడుదల చేస్తామన్న హమాస్ ప్రతిపాదనను ఇజ్రాయెల్ తిరస్కరించింది. యుద్ధంలో ఓడించడమే లక్ష్యమని స్పష్టం చేసింది. 2023 నుంచి ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
సౌతాఫ్రికా క్రికెట్ జట్టు ఎదురన్నదే లేకుండా దూసుకెళుతోంది. టెంబా బవుమా సారథ్యంలో అసాధ్యాలను సుసాధ్యం చేస్తోంది. హేమాహేమీలుగా పేరున్న టీమ్స్‌కు ముచ్చెమటలు పట్టిస్తోంది. ఆస్ట్రేలియాపై WTC ఫైనల్స్‌లో విజయం, ఆస్ట్రేలియా గడ్డపై ఆసీస్‌తో ODI సిరీస్ నెగ్గడం, 27ఏళ్ల తర్వాత తాజాగా ఇంగ్లండ్‌లో వన్డే సిరీస్ కైవసం చేసుకోవడం.. ఇవన్నీ బవుమా కెప్టెన్సీలో SA ఎదురులేని జట్టుగా ఎదుగుతోందని చెప్పేందుకు ఉదాహరణలు.
Sorry, no posts matched your criteria.