news

News September 5, 2025

రేపు KCRతో హరీశ్ భేటీ!

image

TG: BRS ముఖ్య నేత హరీశ్ రావు రేపు లండన్ నుంచి హైదరాబాద్ రానున్నారు. అక్కడి నుంచి నేరుగా ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కు వెళ్లి అధినేత KCRతో భేటీ అయ్యే అవకాశం ఉంది. ఆయనతో చర్చించాక కవిత ఆరోపణలపై స్పందించే ఛాన్స్ ఉంది. మరోవైపు కవిత రేపు మేధావులతో మీటింగ్‌కు సిద్ధమయ్యారు. కాగా కాళేశ్వరంలో హరీశ్ రావు అవినీతికి పాల్పడ్డారని, పార్టీని హస్తగతం చేసుకునేందుకు కుట్రలు చేశారని కవిత ఆరోపించిన సంగతి తెలిసిందే.

News September 5, 2025

పాక్ మిలిటరీ స్టాఫ్‌తో ‘పహల్గామ్’ మాస్టర్‌మైండ్!

image

పహల్గామ్ టెర్రర్ అటాక్‌ మాస్టర్‌మైండ్, లష్కరే తోయిబా కమాండర్ సైఫుల్లా కసూరి తాజా ఫొటోలు SMలో హాట్ టాపిక్‌గా మారాయి. పలువురు పాక్ మిలిటరీ అధికారులతో అతడు కలిసి ఉన్న ఫొటోలు బయటికొచ్చాయి. US డిజిగ్నేటెడ్ టెర్రరిస్ట్ అయిన సైఫుల్లా కశ్మీర్, అఫ్గానిస్థాన్‌లో ఎన్నో ఉగ్రదాడులకు పాల్పడ్డాడు. అలాంటి వ్యక్తిని మిలిటరీ అధికారులు బహిరంగంగా కలవడంతో పాక్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నట్లు మరోసారి స్పష్టమైంది.

News September 5, 2025

నేడు ప్రధాని మోదీతో లోకేశ్ భేటీ

image

AP: మంత్రి నారా లోకేశ్ ఇవాళ ఢిల్లీలో PM మోదీతో భేటీ కానున్నారు. యోగాంధ్ర కార్యక్రమంపై రూపొందించిన పుస్తకాన్ని ఆయనకు అందజేస్తారు. రాష్ట్రంలో కేంద్ర పథకాల అమలు, పెండింగ్ ప్రాజెక్టులు, రాజకీయ పరిస్థితులపై చర్చించే అవకాశముంది. పలువురు కేంద్రమంత్రులతోనూ భేటీ కానున్నారు. సాయంత్రం విజయవాడ చేరుకుని గురుపూజోత్సవంలో పాల్గొంటారు. కాగా 4 నెలల వ్యవధిలో మోదీని లోకేశ్ రెండోసారి కలవనుండటం గమనార్హం.

News September 5, 2025

మిలాద్ ఉన్ నబీ: ఇవాళ పబ్లిక్ హాలిడే

image

మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాల్లో పబ్లిక్ హాలిడే ఉంది. స్కూళ్లు, కాలేజీలతో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులకు సెలవు ఉండనుంది. అటు గణేశ్ నిమజ్జనాల సందర్భంగా రేపు హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌లో విద్యాసంస్థలకు ప్రభుత్వం హాలిడే ప్రకటించింది. కాగా ముస్లిం మత స్థాపకుడైన మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా మిలాద్ ఉన్ నబీ జరుపుకుంటారు.

News September 5, 2025

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల రీసర్వే!

image

TG: రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల రీసర్వే చేపట్టింది. కేంద్ర ప్రభుత్వ వాటా కింద PM ఆవాస్ యోజన నిధులు విడుదల అయ్యేందుకు క్షేత్రస్థాయిలో ఈ ప్రక్రియ మొదలుపెట్టింది. గ్రామాల్లో ఇప్పటికే ఇళ్ల నిర్మాణం చేపట్టిన వారి వివరాలను పంచాయతీ కార్యదర్శులు మళ్లీ సేకరిస్తున్నారు. దాదాపు 60 ప్రశ్నలకు సమాధానాలను యాప్‌లో ఎంటర్ చేస్తున్నారు. ఇందుకు ఈనెల 9 వరకు డెడ్‌లైన్ విధించినట్లు తెలుస్తోంది.

News September 5, 2025

నేడు విశాఖ, విజయవాడలో పర్యటించనున్న CM

image

AP: సీఎం చంద్రబాబు ఇవాళ విశాఖలో పర్యటించనున్నారు. ఉదయం విశాఖ నగరానికి చేరుకుని అక్కడ ఇంటర్నేషనల్ మీడియేషన్ కాన్ఫరెన్స్‌కు హాజరుకానున్నారు. పర్యటన అనంతరం మధ్యాహ్నం విశాఖ నుంచి బయలుదేరి ఉండవల్లిలోని నివాసానికి సీఎం చేరుకుంటారు. ఆ తర్వాత సాయంత్రం విజయవాడలో జరిగే ఉపాధ్యాయ దినోత్సవంలో పాల్గొంటారు.

News September 5, 2025

వినాయక నిమజ్జనానికి సర్వం సిద్ధం

image

TG: HYDలో రేపు జరిగే వినాయక నిమజ్జనానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 50 వేల విగ్రహాలతో 303KM మేర శోభాయాత్రలు కొనసాగుతాయని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో 30 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. 20 చెరువులు, 72 కృత్రిమ కొలనుల వద్ద 134 క్రేన్లు, 259 మొబైల్‌ క్రేన్లు సిద్ధం చేశారు. హుస్సేన్‌సాగర్‌లో 9 బోట్లు, 200 మంది గజ ఈతగాళ్లు, 14,486 మంది శానిటేషన్ సిబ్బందిని నియమించారు.

News September 5, 2025

టారిఫ్స్‌తో USకు రూ.లక్షల కోట్ల ఆదాయం!

image

వివిధ దేశాలపై ట్రంప్ విధించిన టారిఫ్స్‌తో భారీగా ఆదాయం వస్తున్నట్లు వైట్‌హౌస్ వెల్లడించింది. ఆగస్టులో రికార్డు స్థాయిలో $31 బిలియన్లు(₹2.73 లక్షల కోట్లు) వచ్చినట్లు తెలిపింది. టారిఫ్స్ అమల్లోకి వచ్చాక APRలో $17.4b, మేలో $23.9b, JUNలో $28b, JULలో $29b వచ్చాయంది. ఈ ఏడాది ఇప్పటివరకు $158b ఆదాయం వచ్చిందని, గతేడాదితో పోలిస్తే 2.5 రెట్లు అధికమని పేర్కొంది. INDపై 50% టారిఫ్స్ అమల్లో ఉన్న విషయం తెలిసిందే.

News September 5, 2025

యూనివర్సల్ హెల్త్ పాలసీ పూర్తి వివరాలు!

image

AP: రాష్ట్ర ప్రజలకు ఆయుష్మాన్ భారత్- NTR వైద్య సేవ కింద <<17610266>>హెల్త్ పాలసీ<<>> ఇవ్వాలని క్యాబినెట్ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ పాలసీ కింద..
* EHS వర్తించేవారికి కాకుండా మిగతావారికి వైద్యసేవలు
* జర్నలిస్టుల కుటుంబాలకూ వర్తింపు
* తొలుత ఆస్పత్రి ఖర్చులు బీమా కంపెనీలు చెల్లించనుండగా, ఆపై ప్రభుత్వం వాటికి అందిస్తుంది.
* ఖర్చులను 15రోజుల్లోగా చెల్లించాలని నిర్ణయం
* RFP విధానంలో రోగి చేరిన 6గంటల్లో అప్రూవల్.

News September 5, 2025

ఒక్క ఇంటి కరెంట్ బిల్లు రూ.1.61కోట్లు.. చివరికి

image

తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లా మారుతకుళంలో మరియప్పన్ అనే వ్యక్తికి ఏకంగా రూ.1,61,31,281 కరెంట్ బిల్ వచ్చింది. ఇది చూసిన మరియప్పన్ కుటుంబం షాక్‌కి గురైంది. వెంటనే TNPDCL అధికారులకు ఫిర్యాదు చేసింది. ఇది సాంకేతిక లోపంతో పాటు మానవ తప్పిదం వల్ల జరిగిందని అధికారులు వెల్లడించారు. తప్పిదాన్ని సవరించగా వారి బిల్లు రూ.1.61కోట్ల నుంచి రూ.494కు చేరింది.