news

News November 3, 2025

సీఏ ఫలితాలు విడుదల

image

సీఏ(ఛార్టర్డ్ అకౌంటెన్సీ)-2025 ఫలితాలు విడుదలయ్యాయి. సీఏ ఫౌండేషన్, ఇంటర్మీడియెట్, ఫైనల్ రిజల్ట్స్ ICAI వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. అభ్యర్థులు తమ రోల్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్ ఎంటర్ చేసి రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. సెప్టెంబర్ నెలలో ఈ పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే.
వెబ్‌సైట్: <>https://icai.nic.in/caresult/<<>>

News November 3, 2025

కార్తీక పౌర్ణమి: తిరుపతి కపిలేశ్వరస్వామి ఆలయంలో ఏం చేస్తారంటే..?

image

కార్తీక పౌర్ణమి సందర్భంగా తిరుపతిలోని కపిలేశ్వరస్వామివారి ఆలయంలో అన్నాభిషేకం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా భక్తులకు అభిషేకించిన అన్నాన్ని ప్రసాదంగా పంచి పెడతారు. ఈ అన్నాభిషేక కార్యక్రమాన్ని వీక్షించి, ప్రసాదంగా కొంచెం అన్నాన్ని స్వీకరించడం వలన ఎలాంటి రోగాలైన పోతాయని, సమస్త పాపాలు నశించిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. కార్తీక పౌర్ణమి రోజున శ్రీవారి దర్శనార్థం తిరుమల వెళ్తున్న భక్తులకిది మంచి అవకాశం.

News November 3, 2025

CSIR-NEERIలో ఉద్యోగాలు

image

CSIR-నేషనల్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(NEERI) మద్రాస్ కాంప్లెక్స్ 3 ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులను భర్తీ చేస్తోంది. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 7న ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. పోస్టును బట్టి BE, బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. ఎంపికైన వారికి నెలకు రూ.31వేలతో పాటు HRA చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.csircmc.res.in/

News November 3, 2025

పిల్లలకు ఫోన్ చూపిస్తూ ఫుడ్ పెడుతున్నారా?

image

ప్రస్తుతం చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలకు ఫోన్స్‌ను చూపిస్తూ ఆహారం తినిపిస్తున్నారు. త్వరగా ఫుడ్ తింటారనే ‘స్క్రీన్ ఫీడింగ్’ చేయడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల పిల్లల్లో ఆలస్యంగా మాటలు రావడం, ఏకాగ్రత లోపించడం, తల్లిదండ్రులతో మానసిక అనుబంధం తగ్గడం వంటి తీవ్ర సమస్యలు వస్తున్నట్లు తెలిపారు. భోజన సమయంలో మొబైల్‌ను దూరంగా ఉంచాలని సూచిస్తున్నారు. మీరూ ఇలానే చేస్తున్నారా? COMMENT

News November 3, 2025

రోడ్డుపై గుంత, అతివేగం.. 19 మంది బలి!

image

TG: రంగారెడ్డి జిల్లాలో జరిగిన <<18183462>>బస్సు<<>> ప్రమాదానికి టిప్పర్ అతివేగంతో పాటు ఓ గుంత కూడా కారణమని తెలుస్తోంది. చేవెళ్ల నుంచి వికారాబాద్ వెళ్తున్న టిప్పర్ గుంతను తప్పించబోయి అదుపుతప్పి ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును అతివేగంతో ఢీకొట్టినట్లు సమాచారం. దీంతో 50-60 టన్నుల కంకర బస్సుపై పడటంతో అందులోని ప్రయాణికులు ఊపిరాడక చనిపోయారు. బస్సులో కెపాసిటీకి మించి 72 మంది ఉండటంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగింది.

News November 3, 2025

RTC బస్సులకు కెపాసిటీ లిమిట్ రూల్ ఉండదా?

image

ప్రైవేట్ బస్సుల్లో సీటింగ్ కెపాసిటీకి మించి ఒక్కరు ఎక్కువున్నా RTA ఫైన్లు విధిస్తుంది. మీర్జాగూడ ప్రమాదంతో ఇదే రూల్ RTC బస్సులకు వర్తించదా? అనే ప్రశ్న సర్వత్రా వ్యక్తమవుతోంది. RTC సర్వీసుల్లో చాలా రూట్లలో, చాలా సమయాల్లో సీట్లు నిండి లోపల కాలు పెట్టలేనంతగా ప్రయాణికులతో నిండి ఉంటాయి. దీనికి తక్కువ బస్సులు, ప్రజల అవసరాలు లాంటివి కారణం కావచ్చు. కానీ RTCకి ఓవర్ లోడ్ పరిమితి ఉందా? అనేదే అందరి ప్రశ్న.

News November 3, 2025

ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం.. 48 గంటల్లో అకౌంట్లలోకి డబ్బులు

image

AP: ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ రాష్ట్రంలో ప్రారంభమైంది. దీని కోసం 3,013 రైతు సేవా కేంద్రాలు, 2,061 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ ఏడాది 51 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రైతులు 7337359375 వాట్సాప్ నంబర్‌కు HI అని మెసేజ్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. కొనుగోలు చేసిన 24-48 గంటల్లోనే అన్నదాతల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని ప్రభుత్వం తెలిపింది.

News November 3, 2025

బస్సు ప్రమాదంలో చనిపోయింది వీరే

image

TG: <<18184333>>బస్సు ప్రమాదంలో<<>> 19 మంది మరణించగా 15 మందిని అధికారులు గుర్తించారు.
మృతులు: దస్తగిరి బాబా- డ్రైవర్, గుర్రాల అభిత (21)- యాలాల్, మల్లగండ్ల హనుమంతు- దౌల్తాబాద్, షేక్ ఖలీల్ హుస్సేన్, తబస్సుమ్ జహాన్, తాలియా బేగం, ముస్కాన్, సాయిప్రియ, నందిని, తనూష- తాండూరు, తారిబాయ్ (45)- దన్నారం తండా, గోగుల గుణమ్మ, కల్పన (45)- బోరబండ, హైదరాబాద్, బచ్చన్ నాగమణి (55)- భానూరు, ఏమావత్ తాలీబామ్- ధన్నారం తండా

News November 3, 2025

శివయ్య భక్తులకు TGRTC శుభవార్త

image

కార్తీక పౌర్ణమి వేళ అరుణాచలం వెళ్లాలనుకునే భక్తులకు TGRTC శుభవార్త చెప్పింది. నేరుగా హైదరాబాద్ నుంచి అరుణాచలం వెళ్లేందుకు ప్రత్యేక సర్వీసులను ప్రవేశపెట్టింది. HYD దిల్‌షుక్‌నగర్ నుంచి అరుణాచలం గిరి ప్రదక్షిణ మార్గం వరకు ఈ బస్సులను నడుపుతోంది. హైదరాబాద్ నుంచి అరుణాచలంకు నేరుగా చేరుకోవడానికి సరైన రవాణా వ్యవస్థ లేకపోవడంతో భక్తుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకుంది. ఆన్లైన్‌లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు.

News November 3, 2025

కర్నూలు పవర్ ప్రాజెక్టుకు ₹7500 కోట్ల REC ఫండింగ్

image

AP: బ్రూక్‌ఫీల్డ్ క్లీన్ ఎనర్జీ సంస్థ ‘ఎవ్రెన్’ కర్నూలు జిల్లాలో ఏర్పాటుచేసే పవర్ ప్రాజెక్టుకు కేంద్ర సంస్థ REC ₹7500 కోట్లు అందించనుంది. ప్రైవేటు ప్రాజెక్టులో ఆర్ఈసీ అందించే అతిపెద్ద ఫండింగ్ ఇదే. 1.4 GW హైబ్రిడ్ ప్రాజెక్టుకు బ్రూక్‌ఫీల్డ్ ₹9910 కోట్లు వ్యయం చేయనుంది. ఎవ్రెన్ సంస్థలో 51.49% వాటా ఉన్న ఆ సంస్థ ఏపీలో మొత్తంగా 3 WG పవర్ ప్రాజెక్టుకు వీలుగా ప్రణాళికలు సిద్ధం చేసింది.