India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

భద్రతా కారణాలతో T20 WC నుంచి బంగ్లాదేశ్ వైదొలగడం, దానికి మద్దతుగా ఇండియాతో మ్యాచ్‌ను పాక్ <<19024958>>బాయ్‌కాట్<<>> చేయడం తెలిసిందే. ఈ వ్యవహారంపై పాక్ కెప్టెన్ సల్మాన్ అఘా స్పందించారు. ‘బంగ్లాదేశీయులు మా సోదరులు. పాక్‌కు వారిచ్చిన సపోర్టుకు కృతజ్ఞులం. టోర్నీలో వాళ్లు ఆడకపోవడం దురదృష్టకరం’ అని చెప్పినట్లు RevSportz తెలిపింది. INDతో లీగ్ మ్యాచ్ <<19053696>>ఆడబోమన్న<<>> పాక్ PMకు బంగ్లా క్రీడా సలహాదారు నజ్రుల్ థాంక్స్ చెప్పారు.

TG: మున్సి‘పోల్స్’ ప్రచారాలు సోషల్ మీడియా వేదికగా మార్మోగుతున్నాయి. నేతల ఇంటింటి ప్రచారాలతో పాటు పార్టీలు SMనూ ఎక్కువగా వినియోగిస్తున్నాయి. తమను గెలిపిస్తే ఏం చేస్తామో చెబుతూనే ప్రత్యర్థి పార్టీలపై ఆరోపణలు, విమర్శలు గుప్పిస్తున్నాయి. కాగా క్షేత్రస్థాయిలో ఈ ఎన్నికల బాధ్యతలను INC మంత్రులకు, BRS నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లకు అప్పగించాయి. వీరి వ్యూహాల ప్రకారమే నడవాలని శ్రేణులకు సూచించాయి.

జాజికాయని వాడడం వల్ల ముఖంపై మచ్చలు తగ్గడమే కాదు. మొటిమలు కూడా రాకుండా ఉంటాయంటున్నారు నిపుణులు. 2 టీ స్పూన్ల జాజికాయ పొడి, తేనె, పాలు కలిపి పేస్ట్ చేయాలి. దీన్ని ముఖానికి అప్లై చేసి 10 నిమిషాల తర్వాత ఫేస్‌ప్యాక్‌ని క్లీన్ చేయండి. ఇలా చేస్తే ముఖం బ్రైట్‌గా కనిపిస్తుంది. దీని వల్ల మొటిమలు, మచ్చలు తగ్గుతాయి. దీని వల్ల ముఖంపై పేరుకుపోయిన అదనపు నూనె కూడా తొలగిపోతుందంటున్నారు.

నిన్న లోక్‌సభ అర్ధాంతరంగా వాయిదాపడి PM మోదీ ప్రసంగం రద్దవడం తెలిసిందే. అయితే దీనికి కారణం మోదీ కూర్చున్న సీటు చుట్టూ తమ మహిళా MPలను విపక్షం మోహరించడమేనని NDTV పేర్కొంది. నరవణే పుస్తకంపై రాహుల్‌ను అనుమతించకపోవడంతో విపక్షం యుద్ధమార్గంలో వెళ్తున్నట్టుగా ఉందని విశ్లేషించింది. కాగా మోదీపై దాడి చేసేందుకే తమ మహిళా ఎంపీలను PM సీటు వద్ద విపక్షం మోహరించిందని BJP ఎంపీ మనోజ్ తివారీ ఆరోపించారు.

చల్కా నేలల్లో లవణం, ఇసుక సమాన మోతాదులో ఉంటాయి. సేంద్రియ కర్బనం తక్కువగా.. ఐరన్, అల్యూమినియం ఆక్సైడ్‌లు ఎక్కువగా ఉండటం వల్ల సాగులో సమస్యలు వస్తాయి. ఈ భూముల్లో మొలక రాకపోవటం, వచ్చినా దెబ్బతినడం, మొక్కల సాంద్రత తగ్గుతుంది. ఈ భూముల్లో ఏటా ఎకరాకు 4 టన్నుల పశువుల ఎరువును పంట విత్తే ముందు వేసుకోవాలి. మల్చింగ్ వేయాలి. విత్తిన సాళ్ల వెంబడి పశువుల ఎరువును వేస్తే మొలక శాతం పెరుగుతుంది.

AP: దేవుడితో పెట్టుకోవడం మంచిది కాదని YCP నేతలకు సీఎం చంద్రబాబు హితవు పలికారు. ‘వేంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీయాలని కావాలని చేసిన కార్యక్రమం ఇది. అప్పటి TTD బోర్డు ఛైర్మన్ PA ఖాతాలో రూ.4కోట్లకు పైగా నగదు జమైంది. అంతా అప్పటి బోర్డు ఛైర్మన్‌కు తెలిసే జరిగింది. దోషులను శిక్షిస్తాం.. ఎవరినీ వదిలిపెట్టం. దేవుడి పవిత్రత, భక్తుల మనోభావాలను దెబ్బతీసిన వారిని వదిలే ప్రసక్తే లేదు’ అని హెచ్చరించారు.

గ్యాస్ ట్యాంకర్ బోల్తా పడటంతో ముంబై-పుణే ఎక్స్‌ప్రెస్‌వేపై ఏకంగా 33 గంటల పాటు ట్రాఫిక్ స్తంభించింది. ఇందులో పారిశ్రామికవేత్త సుధీర్ మెహతా దాదాపు 8 గంటలు కారులోనే వేచి ఉండి విసిగిపోయారు. ఈక్రమంలో హెలికాప్టర్‌ను పిలిపించుకొని పుణేకు వెళ్లినట్లు ఆయన ట్వీట్ చేయగా వైరలవుతోంది. ఎమర్జెన్సీ సమయాల్లో వీలుండేలా ఎక్స్‌ప్రెస్ వేల వద్ద హెలిప్యాడ్స్ ఏర్పాటు చేయాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

AP: పామాయిల్, కెమికల్స్‌తో కల్తీ నెయ్యి తయారు చేశారని సిట్ నివేదిక ఇచ్చిందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ‘YCP హయాంలో చాలా అపచారాలు చేశారు. మళ్లీ ఎదురుదాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒక కరుడుగట్టిన నేరస్థుడి తరహాలో నిన్న ఆయన అబద్ధాలు చెబుతున్నారు. ఇలాంటివి చేయాలంటే భయపడే పరిస్థితి రావాలి. దీనిని ఇక్కడితో వదిలే ప్రసక్తే లేదు. దీని పవిత్రతను కాపాడేందుకు తగిన చర్యలు తీసుకుంటాం’ అని పేర్కొన్నారు.

AP: వేంకటేశ్వరుడి ముందు మోకరిల్లి YCP వాళ్లు క్షమాపణలు చెప్పాలని Dy.CM పవన్ డిమాండ్ చేశారు. ‘ఏ నివేదికలోనూ క్లీన్ చిట్ రాలేదు. జంతువుల కొవ్వు కలిసిందని చెప్పడం చాలా సున్నితమైన అంశం. 2022లోనే కల్తీ కలిసిందని రిపోర్టులు వస్తే వాటిని తొక్కిపెట్టారు. వాళ్లకి అంతా తెలిసే చేశారు. తిరుమలకు 2 కొండలు చాలు అనే ధోరణి నుంచి వచ్చిన పార్టీ మీది. రథం కాలిపోతే పిచ్చోడు చేశారు అంటారు’ అని వ్యాఖ్యానించారు.

ఢిల్లీలోని ICAR-ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(<
Sorry, no posts matched your criteria.