news

News October 27, 2024

ఎల్లుండి ఉ.10 గంటల నుంచి..

image

AP: రాష్ట్రంలో ఉచిత గ్యాస్ సిలిండర్ల బుకింగ్ ఎల్లుండి నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 29 ఉ.10 గంటల నుంచి బుకింగ్ చేసుకోవచ్చు. గ్యాస్ కనెక్షన్‌తో పాటు తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉండాలని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. తొలుత డబ్బులు చెల్లించి గ్యాస్ సిలిండర్ కొనుగోలు చేస్తే 48 గంటల్లోపు వారి ఖాతాల్లోకి డబ్బు జమ అవుతుంది. ప్రతి 4 నెలలకు ఒకటి చొప్పున ఏడాదికి 3 సిలిండర్లు ఫ్రీగా ఇవ్వనున్నారు.

News October 27, 2024

కరెంట్ ఛార్జీల పెంపు ప్రతిపాదన జగన్ పాపమే: టీడీపీ

image

AP: ఐదేళ్ల <<14468148>>జగన్<<>> దరిద్రపు పాలనలో 9 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచారని TDP ఆరోపించింది. ERC ప్రతిపాదన పాపం జగన్‌దేనని మండిపడింది. ‘గత ప్రభుత్వం ప్రజలపై రూ.6,072 కోట్ల భారం మోపింది. జగన్ అనాలోచిత నిర్ణయాల వల్లే విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పెంపు ప్రతిపాదనలు. ఆ భారమంతా కూటమి ప్రభుత్వంపైనే పడింది. విద్యుత్ కొనుగోలులోనూ అక్రమాలకు పాల్పడ్డారు. చంద్రబాబు ఛార్జీలు పెంచుతామని ఎక్కడా చెప్పలేదు’ అని పేర్కొంది.

News October 27, 2024

అత్యుత్తమ టెస్టు జట్టులో రోహిత్ ఓపెనర్‌గా ఉంటారు: స్మిత్

image

టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆటతీరుపై ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ ప్రశంసలు కురిపించారు. ప్రపంచ ఆటగాళ్లతో అత్యుత్తమ టెస్టు జట్టును తయారుచేస్తే దానికి ఓపెనర్‌గా తాను రోహిత్‌నే ఎంచుకుంటానని తెలిపారు. ‘రోహిత్ చాలా ప్రమాదకర ప్లేయర్. నిర్భయంగా తన షాట్స్ ఆడతారు. అవసరమైతే అద్భుతంగా డిఫెండ్ కూడా చేసుకోగలరు. అతడు క్రీజులో ఉన్నప్పుడు బౌలర్లు ఒత్తిడికి గురవుతారు’ అని పేర్కొన్నారు.

News October 27, 2024

IASలకు పోస్టింగ్స్.. టూరిజం ఎండీగా ఆమ్రపాలి

image

AP: తెలంగాణ నుంచి ఏపీకి వచ్చిన IASలకు రాష్ట్ర ప్రభుత్వం పోస్టింగ్స్ ఇచ్చింది.
*టూరిజం ఎండీ, టూరిజం అథారిటీ సీఈవోగా ఆమ్రపాలి
*వైద్యారోగ్యశాఖ కమిషనర్‌గా వాకాటి కరుణ
*జీఏడీలో సర్వీసుల వ్యవహారాల ముఖ్య కార్యదర్శిగా వాణీ మోహన్
*కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణీ ప్రసాద్
**మరో ఐఏఎస్ రొనాల్డ్ రోస్‌కు ఇంకా పోస్టింగ్ ఇవ్వలేదు.

News October 27, 2024

ఇజ్రాయెల్‌కు మన పవర్ చూపాలి: ఖమేనీ

image

ఇజ్రాయెల్‌కు తమ సత్తా ఏంటో చూపాలని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అధికారులను ఆదేశించినట్లు IRNA తెలిపింది. ‘మనపై జరిగిన దాడులను తక్కువ చేసి చూడొద్దు. ఎక్కువగానూ భావించొద్దు. దేశానికి మేలు జరిగే అనువైన మార్గాన్ని అధికారులే నిర్ణయించాలి’ అని ఆయన వారితో చెప్పినట్లు వెల్లడించింది. మరోవైపు ఇరాన్‌పై శక్తివంతమైన దాడి చేశామని, తమ లక్ష్యాలను పూర్తిగా సాధించామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తెలిపారు.

News October 27, 2024

కాంగ్రెస్ ప్రభుత్వానివి చౌకబారు రాజకీయాలు: హరీశ్ రావు

image

TG: ప్రత్యర్థులను నేరుగా ఎదుర్కొనలేనప్పుడే కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుంటారని BRS ఎమ్మెల్యే హరీశ్ రావు ట్వీట్ చేశారు. జన్వాడ ఫామ్ హౌస్ పార్టీని ఉద్దేశించి తమ పార్టీని నేరుగా ఎదుర్కోలేని కాంగ్రెస్ చౌకబారు రాజకీయాలు చేస్తోందని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతల అక్రమ అరెస్టును ఖండిస్తున్నట్లు తెలిపారు. రాహుల్ ‘మొహబ్బత్ కా దుకాణ్’ అసలైన రూపం బయటపడిందని దుయ్యబట్టారు.

News October 27, 2024

ఫాంహౌస్ పార్టీ.. DGPకి కేసీఆర్ ఫోన్

image

TG: జన్వాడ <<14465898>>ఫాంహౌస్<<>> పార్టీపై BRS అధినేత కేసీఆర్ ఆరా తీశారు. డీజీపీ జితేందర్‌కు ఫోన్ చేసి రాజ్ పాకాల, ఆయన సోదరుడు శైలేంద్ర విల్లాల్లో తనిఖీలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలీసులు సెర్చ్ వారెంట్ లేకుండా ఎలా సోదాలు చేస్తారని ప్రశ్నించారు. వెంటనే తనిఖీలు ఆపాలని డీజీపీని కోరారు. కాగా, కేటీఆర్ బావమరిది అయిన రాజ్ పాకాలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.

News October 27, 2024

సింగిల్స్‌కు ఫ్రీ వాటర్ బాటిల్స్.. ఎందుకంటే?

image

పంజాబీ సింగర్ దిల్జీత్ దోసాంజ్ ఢిల్లీ కన్సర్ట్‌ మ్యూజిక్ లవర్స్‌ను ఉర్రూతలూగించింది. కన్సర్ట్‌లో సింగిల్స్‌కు ఓ మ్యాట్రిమొనీ వాలంటీర్లు ‘సింగిల్స్ కో పానీ పిలావో యోజన’ పేరుతో ఫ్రీ వాటర్ బాటిల్స్ అందించారు. ‘మా మ్యాట్రిమొనీలో చేరి ఉంటే ఈ బాటిల్‌కు బదులుగా మీ భాగస్వామి చేతులు పట్టుకుని ఉండేవారు’ అని ప్రమోషన్స్ చేశారు. ఫ్రీ బాటిల్స్ అందుకున్న సింగిల్స్ ఫొటోలను నెట్టింట షేర్ చేస్తున్నారు.

News October 27, 2024

BREAKING: కదులుతున్న రైలులో మంటలు!

image

మధ్యప్రదేశ్‌లో కదులుతున్న రైలులో మంటలు అలజడి సృష్టించాయి. ఒక్కసారిగా భయాందోళనకు గురైన ప్రయాణికులు రైలు నుంచి దూకారు. ఈ ఘటన రత్లాం సమీపంలోని ప్రీతమ్ నగర్, రునియా రైల్వే స్టేషన్ మధ్య చోటు చేసుకుంది. దీంతో వెంటనే రైలును నిలిపివేశారు. ప్రయాణికులు ఒక్కసారిగా బయటకు రావడంతో తొక్కిసలాట చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

News October 27, 2024

కేటీఆర్ బంధువులను రేవంత్ టార్గెట్ చేశారు: ప్రశాంత్ రెడ్డి

image

TG: కేటీఆర్ బంధువులను రేవంత్ టార్గెట్ చేశారని BRS నేత ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. కేటీఆర్ బావమరిది సొంతింటి గృహప్రవేశంలో కుటుంబ సభ్యులను కలుసుకుంటే పోలీసులు సీన్ మార్చారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ మండిపడ్డారు. కేటీఆర్ ఎదుగుదల ఓర్వలేకనే ఇలాంటి చర్యలకు దిగుతున్నారని దుయ్యబట్టారు. మరోవైపు జన్వాడలో పార్టీ జరిగితే రాయదుర్గంలో రచ్చ చేస్తున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు.