news

News January 29, 2026

చైనాలో 11 మందికి మరణశిక్ష అమలు

image

క్రూరమైన మింగ్ మాఫియా ఫ్యామిలీకి చెందిన 11 మంది కీలక సభ్యులకు చైనా కోర్టు విధించిన మరణశిక్షను తాజాగా అమలు చేశారు. హత్యానేరం, అక్రమ నిర్బంధం, గ్యాంబ్లింగ్ వంటి 14 రకాల నేరాల్లో వీరు దోషులుగా తేలడంతో సెప్టెంబర్ 2025లో జెజియాంగ్ కోర్టు వీరికి మరణశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. మయన్మార్ సరిహద్దు కేంద్రంగా వీళ్లు సుమారు $1.4 బిలియన్ల ఆన్‌లైన్ మోసాలకు పాల్పడినట్లు విచారణలో తేలింది.

News January 29, 2026

ఒట్రోవర్ట్ గురించి తెలుసా?

image

ఇంట్రోవర్ట్, ఎక్స్​ట్రోవర్ట్, ఆంబ్రివర్ట్ అనే పదాలు వ్యక్తిత్వాన్ని సూచించేందుకు వాడతారు. అయితే ఒట్రోవర్ట్ లక్షణాలున్నవారు ఇంట్రోవర్ట్స్, ఎక్స్​ట్రోవర్ట్స్​ కలిపి పరిస్థితులకు తగ్గట్లు మారిపోతూ ఉంటారు. వీరు ప్రత్యేకమైన సంబంధ శైలిని కలిగి ఉంటారంటున్నారు నిపుణులు. ఇంట్రోవర్ట్, ఎక్స్​ట్రోవర్ట్ మధ్య స్పష్టమైన మూడ్ స్వింగ్‌లను అనుభవించే వ్యక్తులను వివరించడానికి ఒట్రోవర్ట్ పదాన్ని ఉపయోగిస్తున్నారు.

News January 29, 2026

కేసీఆర్‌కు మూడోసారి నోటీసులు

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు మాజీ CM KCRకు పోలీసులు నోటీసులు ఇవ్వడం రాజకీయంగా ఆసక్తిగా మారుతోంది. గతంలోనూ ఆయనకు వేర్వేరు ఇష్యూల్లో నోటీసులు అందాయి. INC అధికారంలోకి వచ్చిన తర్వాత PPAలపై జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ నోటీసులు ఇచ్చింది. దానిపై KCR హైకోర్టుకెళ్లారు. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజీ కూలడంపై ఏర్పాటైన జస్టిస్ ఘోష్ కమిషనూ నోటీసులిచ్చింది. KCR ఆ కమిషన్ ముందు హాజరయ్యారు.

News January 29, 2026

యాసంగి ఆముదం పంటలో పురుగుల కట్టడికి సూచనలు

image

యాసంగిలో సాగు చేసిన ఆముదం పంటలో వివిధ పురుగుల తీవ్రత పెరిగింది. రసం పీల్చే పురుగుల ఉద్ధృతి ఎక్కువగా ఉంటే వీటి నివారణకు ప్రొఫెనోఫాస్ 2ML లేదా ఎసిటామిప్రిడ్ 0.2గ్రా లేదా ఎసిఫేట్ 1.5గ్రా లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పంటను లద్దె పురుగు ఆశిస్తే లీటరు నీటికి నొవాల్యురాన్ 1ML కలిపి పిచికారీ చేయాలి. కాయతొలుచు పురుగు నివారణకు లీటరు నీటికి ప్రొఫెనోఫాస్ 2ML కలిపి పిచికారీ చేయాలి.

News January 29, 2026

పేపర్ ప్లేట్‌గా బ్యాంకు డాక్యుమెంట్.. ప్రైవసీ అంటే ఇదేనా?

image

కస్టమర్ పర్సనల్ డీటెయిల్స్ ఉన్న బ్యాంకు డాక్యుమెంట్ రోడ్డు పక్కన పేపర్ ప్లేట్‌గా మారడం ఇప్పుడు వైరలవుతోంది. పేరు, లొకేషన్, పేమెంట్ డీటెయిల్స్ వంటి సెన్సిటివ్ డేటా బహిరంగంగా కనిపించడంతో నెటిజన్లు షాకవుతున్నారు. కస్టమర్ డేటాను బ్యాంకులు ఇంత నిర్లక్ష్యంగా ఎలా వదిలేస్తాయని ప్రశ్నిస్తున్నారు. Moronhumor పేరిట ఉన్న X అకౌంట్‌లో ఈ ఫొటో చూశాక డేటా ప్రైవసీపై SMలో పెద్ద చర్చే నడుస్తోంది.

News January 29, 2026

RBIలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(<>RBI<<>>)కాన్పూర్‌లో 3 మెడికల్ కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు ఫిబ్రవరి 12 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి MBBS, పీజీ(జనరల్ మెడిసిన్)అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. గంటకు రూ.1000 చొప్పున చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://rbi.org.in

News January 29, 2026

KCRకు నోటీసుల్లో దురుద్దేశం లేదు: మహేశ్‌గౌడ్

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో KCRకు నోటీసులివ్వడంలో రాజకీయ దురుద్దేశం లేదని పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ తెలిపారు. ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ అంటే గౌరవం ఉందన్నారు. ఈ కేసులో విచారణ పారదర్శకంగా జరుగుతోందని, SIT ఎవరికైనా నోటీసులు ఇవ్వొచ్చన్నారు. గత CM, మంత్రుల ప్రమేయం లేకుండా అధికారులు ఫోన్ ట్యాపింగ్ చేసే ఛాన్స్ లేదని చెప్పారు. పూర్తి విచారణ జరిగితే నిజాలు బయటపడతాయని, కేసులో భాగస్వాములు ఎవరో తేలాల్సి ఉందన్నారు.

News January 29, 2026

రైల్వేలో 312 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

రైల్వే ఐసోలేటెడ్ కేటగిరీలో 312 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. అర్హత గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి ఇంటర్, డిగ్రీ, LLB, MBA, డిప్లొమా, PG(హిందీ, ఇంగ్లిష్, సైకాలజీ) అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. CBT(1, 2), స్కిల్ టెస్ట్, DV, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. నెలకు జీతం రూ.19,900-రూ.44,900 వరకు చెల్లిస్తారు. సైట్: www.rrbcdg.gov.in/

News January 29, 2026

UGC రూల్స్‌పై సుప్రీం స్టే

image

UGC ప్రవేశపెట్టిన కొత్త రూల్స్‌పై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. తదుపరి విచారణ వరకు 2012 రూల్స్‌ అమలులో ఉంటాయని తెలిపింది. యూజీసీ కొత్తగా ప్రవేశపెట్టిన రూల్స్ అస్పష్టంగా ఉన్నాయని, దుర్వినియోగం చేసే ఛాన్స్ ఉందని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ అభిప్రాయపడ్డారు. కేంద్రానికి నోటీసులు జారీ చేసిన CJI విచారణను మార్చి 19కి వాయిదా వేశారు.

News January 29, 2026

కేసీఆర్‌కు సిట్ నోటీసులు.. రేపు 3pmకు విచారణ

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో KCRకు సిట్ నోటీసులిచ్చింది. HYD నందినగర్‌లోని ఆయన ఇంటికి వెళ్లిన సిట్ అధికారులు CRPC 160 కింద మాజీ సీఎం పీఏకు నోటీసులు అందించారు. రేపు 3pmకు విచారణకు సిద్ధంగా ఉండాలని చెప్పారు. 65సం.లకు పైగా వయస్సు ఉండటంతో స్టేషన్‌కు రావడం తప్పనిసరి కాదని తెలిపారు. PSకు రావాలి అనుకుంటే రావచ్చు, లేదా HYD పరిధిలో ఆయన కోరిన చోట విచారణ చేస్తామని నోటీసుల్లో పేర్కొన్నారు.