India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

అండర్-19 WC ఫైనల్లో తన కుమారుడి ఆట చూసి గర్వంగా ఉందని వైభవ్ సూర్యవంశీ తండ్రి సంజీవ్ తెలిపారు. అతడితో పాటు మిగిలిన అందరు ఆటగాళ్లు అద్భుతంగా ఆడారని ప్రశంసించారు. అయితే వైభవ్ టెస్టులు ఆడనంత వరకు అతడిని పెద్ద క్రికెటర్‌గా చూడనని చెప్పారు. ఇది ఆరంభం మాత్రమేనని, భవిష్యత్‌లో సాధించాల్సింది ఎంతో ఉందని పేర్కొన్నారు. వైభవ్ వల్ల బిహార్‌లో చాలా మంది పిల్లలు క్రికెట్ వైపు వచ్చే అవకాశం ఉందన్నారు.

డెలివరీ తర్వాత మహిళల్లో చాలా ఇబ్బందులు తలెత్తుతాయి. వాటిల్లో ఒకటి కాళ్లవాపు. ప్రెగ్నెన్సీలో కాళ్లవాపు సహజమే కానీ డెలివరీ తర్వాత కూడా అలా ఉంటే జాగ్రత్త పడాలంటున్నారు నిపుణులు. కాళ్లు ఎత్తులో పెట్టుకొని పడుకోవడం, మసాజ్ చేయడం, సాల్ట్ ఎక్కువగా తీసుకోవడం, ఎక్కువసేపు ఒకే పొజిషన్‌లో ఉండటం వల్ల ఇలా జరుగుతుంది. దీన్ని నివారించడానికి ప్రొటీన్లు, పొటాషియం ఉన్న ఆహారాలు డైట్‌లో చేర్చుకోవాలని సూచిస్తున్నారు.

పాక్‌లో చేసిన <<19073745>>దాడి<<>>తో మరోసారి ఇస్లామిక్ స్టేట్(ISIS) పేరు చర్చనీయాంశమవుతోంది. 2014-2017 మధ్య సిరియా, ఇరాక్‌లో అతి దారుణమైన దాడులతో ప్రపంచాన్ని భయపెట్టిందీ సంస్థ. కానీ US దాడులు, దాని చీఫ్ అబు బకర్ బగ్దాదీ హతమవడంతో పతనమైంది. ప్రస్తుతం సిరియా, ఇరాక్, అఫ్గాన్, పాక్‌తోపాటు పలు దేశాల్లో ఉనికిలో ఉంది. దీని నాయకత్వం రహస్యంగా ఉంది. తరచూ దాడులు చేస్తోంది. ఇటీవల <<18561798>>సిడ్నీలో దాడి<<>> చేసింది కూడా IS సానుభూతిపరులే.

సినీ ఇండస్ట్రీలో ఇప్పటివరకూ తండ్రీకొడుకుల కాంబోలు చూశాం. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. 2026లో తండ్రీకూతుళ్ల జోరు సాగుతోంది. మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుస్మిత ‘మన శంకర వరప్రసాద్ గారు’తో నిర్మాతగా సత్తా చాటగా గుణశేఖర్ కుమార్తె నీలిమ ‘యుఫోరియా’ను నిర్మించారు. రవితేజ డాటర్ మోక్షద ‘ఇరుముడి’ నిర్మాణ బాధ్యతలు చూస్తుంటే నటుడు అర్జున్ తన కుమార్తె ఐశ్వర్య హీరోయిన్‌గా ‘సీతా పయనం’ను తెరకెక్కిస్తున్నారు.

AP: టెన్త్ పబ్లిక్ పరీక్షల తేదీల్లో స్వల్ప మార్పు జరిగింది. ఇంగ్లిష్ పరీక్షను మార్చి 20న కాకుండా 21న (శనివారం) నిర్వహించనున్నట్లు ఎస్సెస్సీ బోర్డు అధికారికంగా ప్రకటించింది. 20న రంజాన్ ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. మిగతా అన్ని పరీక్షలు ముందుగా ప్రకటించిన టైమ్ టేబుల్ ప్రకారమే యథావిధిగా జరుగుతాయని స్పష్టం చేసింది. కాగా మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు టెన్త్ పరీక్షలు జరగనున్నాయి.

ముంబై మేయర్‌గా బీజేపీ కార్పొరేటర్ రితూ తావ్డే పేరును ఆ పార్టీ ప్రకటించింది. డిప్యూటీ మేయర్‌గా శివసేన కార్పొరేటర్ సంజయ్ శంకర్ ఘాడీని ఎంపిక చేశారు. కాగా 227 స్థానాలు ఉన్న ముంబై కార్పొరేషన్ ఎన్నికల్లో మహాయుతి కూటమి 118 చోట్ల (బీజేపీ- 89, శివసేన- 29) విజయం సాధించింది. దీంతో 25 ఏళ్ల తర్వాత ముంబై పీఠంపై శివసేన (UBT) పట్టు కోల్పోయింది.

టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్(<

దేవుడున్నాడా లేదా అనే తర్కం కంటే, ఆయన ఉన్నాడు అనే ఊహ ఇచ్చే ఊరట చాలా గొప్పది. కష్టకాలంలో కొండంత అండగా, ఒంటరితనంలో ఆత్మబంధువుగా ఆయనను తలచుకోవడం కంటే ప్రశాంతమైన అనుభూతి మరొకటి ఉండదు. కళ్లు మూసి ‘ఓం నమో భగవతే వాసుదేవాయ నమః’ అని స్మరిస్తే కలిగే పారవశ్యం ముందు ఏ సుఖమూ సాటిరాదు. ఆ నమ్మకమే ఓ ధైర్యం. ఆ భావమే ఓ బలం. ఆ దివ్య అనుభూతిలో తేలియాడటం మనసుకు దొరికే అత్యున్నత ఆధ్యాత్మిక ప్రశాంతత.

కార్శి చెరకు తోటల్లో ఖాళీలు ఎక్కువగా ఉంటే దిగుబడి గణనీయంగా తగ్గుతుంది. దీన్ని నింపడానికి అదే రకానికి చెందిన మూడు కళ్ల ముచ్చెలు లేదా 6 వారాల వయసు గల మొలకలు లేదా మొక్క తోటలోని దుబ్బులను ఉపయోగించాలి. అవి బతికే వరకు నీరు పోయాలి. లేత వయసులో 2, 3 తడులు దగ్గర దగ్గరగా పెట్టడం వల్ల మొక్కలు బతికి త్వరగా పిలకలు తొడుగుతాయి. ఈ ఖాళీలను నింపడం వల్ల హెక్టారుకు సుమారు 8 టన్నుల అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉంది.

U-19 WCలో భారత్ 6వ సారి విజేతగా నిలిచినా ICC నుంచి ఒక్క రూపాయి కూడా రాదు. ఇంగ్లండ్‌ను 100 పరుగుల తేడాతో ఓడించిన టీమ్ ఇండియాకు ప్రైజ్ మనీ లేకపోవడం అభిమానులను షాక్‌కు గురిచేసింది. దీనికి ఒక కారణం ఉంది. ఈ టోర్నీని యువ క్రికెటర్లను ప్రోత్సహించేందుకు మాత్రమే ఐసీసీ రూపొందించింది. అందుకే నగదు బహుమతులు ఇవ్వదు. అయితే ఆటగాళ్ల ప్రతిభను ప్రోత్సహించేందుకు BCCI రూ.7.5 కోట్ల నజరానా ప్రకటించింది.
Sorry, no posts matched your criteria.