news

News November 3, 2025

బస్సు ప్రమాదంపై సీఎం రేవంత్ విచారం

image

TG: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై సీఎం రేవంత్​ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని, అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఎప్పటికప్పుడు తెలియజేయాలని సూచించారు. గాయపడిన వారందరినీ వెంటనే హైదరాబాద్​కు తరలించి మెరుగైన చికిత్స అందించేలా ఏర్పాట్లు చేయాలని సీఎస్​, డీజీపీలను ఆదేశించారు.

News November 3, 2025

గుండెలు పగిలే ఫొటో

image

TG: రంగారెడ్డి జిల్లా మీర్జాగూడలో జరిగిన <<18183124>>ఆర్టీసీ బస్సు ప్రమాదంలో<<>> మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటివరకు 17 మంది మరణించగా, అందులో 10 నెలల పాప కూడా ఉంది. తల్లి, బిడ్డ మృతదేహాలను బస్సులో నుంచి బయటకు తీసి రోడ్డుపై ఉంచిన ఫొటో కన్నీరు తెప్పిస్తోంది. ప్రమాద సమయంలో టిప్పర్ మితిమీరిన వేగంతో వెళ్లినట్లు సమాచారం. ఘటనాస్థలం వద్ద ప్రయాణికుల ఆర్తనాదాలతో భీతావహ వాతావరణం నెలకొంది.

News November 3, 2025

బాత్రూమ్‌లోనే గుండెపోట్లు ఎక్కువ.. ఎందుకంటే?

image

బాత్రూమ్‌లో ఎక్కువగా గుండెపోటు కేసులు నమోదవుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. దీనికి స్నానం ప్రధాన కారణం కాదని, మలమూత్ర విసర్జన సమయంలో ఎక్కువగా ఒత్తిడి చేయడమే అసలు సమస్యని స్పష్టం చేశారు. ఈ ఒత్తిడి వల్ల ‘వాల్సాల్వా మ్యాన్యువర్’ జరిగి రక్తపోటులో ఆకస్మిక హెచ్చుతగ్గులు సంభవిస్తాయని తెలిపారు. దీనివల్ల రక్తనాళాలలో కొవ్వు పేరుకుపోయిన వారికి ఆక్సిజన్ సరఫరా తగ్గి గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందంటున్నారు.

News November 3, 2025

ఇవాళే సీఏ ఫైనల్ ఫలితాలు

image

ICAI సెప్టెంబర్ సెషన్ 2025 సీఏ ఫైనల్, ఇంటర్మీడియట్ ఫలితాలు ఇవాళ మధ్యాహ్నం 2గంటలకు విడుదల కానున్నాయి. ఫౌండేషన్ స్థాయి ఫలితాలు సాయంత్రం 5 గంటలకు రిలీజ్ చేస్తారు. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ లేదా రోల్ నెంబర్ నమోదు చేసి ఫలితాలు తెలుసుకోవచ్చు. వెబ్‌సైట్: https://icai.nic.in/

News November 3, 2025

వరల్డ్ కప్‌తో నిద్రలేచిన ప్లేయర్లు

image

అన్ని రోజులూ ఒకేలా ఉండవు కదా.. భారత మహిళా జట్టుకు కలగా ఉన్న వరల్డ్ కప్ నిన్నటి మ్యాచ్‌తో సాకారమైంది. రాత్రంతా సెలబ్రేషన్స్‌తో అలసిపోయి పొద్దున్నే నిద్ర లేచిన ప్లేయర్లు చేతిలో వరల్డ్ కప్‌లో బెడ్‌పై నుంచే ఫొటోకు పోజులిచ్చారు. ఈ ఫొటోను షేర్ చేస్తూ ‘ఇంకా మనం కలలు కంటున్నామా?’ అని క్రికెటర్ జెమీమా రోడ్రిగ్స్ ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ఫొటోలో అరుంధతి, రాధా యాదవ్, స్మృతి మంధాన ఉన్నారు.

News November 3, 2025

162 పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

image

బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో 162 పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. ఇంజినీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ, టెక్నీషియన్-సీ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి డిప్లొమా, ఇంటర్+ ఐటీఐ+ NAC అర్హత కలిగినవారు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 28ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. *మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.

News November 3, 2025

భారత్ విజయం.. మమతా బెనర్జీకి బీజేపీ కౌంటర్

image

భారత మహిళల జట్టుకు అభినందనలు తెలిపిన వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి ఆ రాష్ట్ర బీజేపీ కౌంటర్ ఇచ్చింది. భారత ప్లేయర్ల పోరాటం రాబోయే తరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని ఆమె Xలో పోస్ట్ చేశారు. దానికి ‘మీరేమో అమ్మాయిలు రా.8 గంటలకల్లా ఇంటికి చేరాలని చెప్పారు. వీళ్లేమో రా.12 గంటల వరకు ఆడుతూనే ఉన్నారు’ అంటూ BJP కౌంటర్ ట్వీట్ చేసింది. గతంలో ఓ రేప్ కేసు విషయంలో మమత చేసిన <<17986509>>వ్యాఖ్యలు<<>> వివాదం కావడం తెలిసిందే.

News November 3, 2025

ఆఫీసర్ ట్రైనీ ఉద్యోగాలు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

image

పవర్‌గ్రిడ్‌లో 20 ఆఫీసర్ ట్రైనీ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. CA/ICWA ఉత్తీర్ణులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.500, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28 ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాతపరీక్ష(CBT),ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు రూ.40వేలు చెల్లిస్తారు.వెబ్‌సైట్: www.powergrid.in/

News November 3, 2025

ఇందులో ఏ ఒక్కటి ఆచరించినా మనపై శివానుగ్రహం

image

స్కాంద పురాణం ప్రకారం.. కార్తీక సోమవారం నాడు శివుడి అనుగ్రహం పొందడానికి 6 నియమాలున్నాయి. వీటిలో నక్తం (నక్షత్రాన్ని చూసి నైవేద్యాన్ని స్వీకరించడం), ఉపవాసం, ఏక భుక్తం(ఒక పూట భోజనం), తెల్లవారున చన్నీటి స్నానం, అయాచితం (ఇతరులిచ్చిన ఆహారం మాత్రమే తినడం), తిలధానం(నల్ల నువ్వులు దానం చేయడం) ముఖ్యమైనవి. ఈ నియమాలలో ఏ ఒక్కటి పాటించినా శివుడు సంతోషించి, భక్తుల మనోభీష్టాలు నెరవేరుస్తాడని ప్రగాఢ విశ్వాసం.

News November 3, 2025

అధిక ఆదాయాన్నిచ్చే హైబ్రిడ్ కొబ్బరి రకాలు

image

☛ వైనతేయ గంగ: నాటిన 3-4 ఏళ్లలో కాపునకు వస్తుంది. ఏటా చెట్టుకు 125 కాయల దిగుబడి వస్తుంది. కొబ్బరిలో నూనె దిగుబడి 69 శాతం.
☛ వశిష్ట గంగ: నాటిన 3-4 ఏళ్లలో కాపునకు వస్తుంది. సగటున చెట్టుకు 125 కాయల దిగుబడి వస్తుంది. కొబ్బరిలో నూనె దిగుబడి 69 శాతం.
☛ అభయ గంగ: నాటిన 4 ఏళ్లకు కాపునకు వస్తుంది. సగటున చెట్టుకు 135 కాయల దిగుబడి వస్తుంది. కొబ్బరిలో నూనె దిగుబడి 72 శాతం. కొబ్బరి నూనెకు ఇది అనుకూలం.