news

News September 5, 2025

PKL: బోణీ కొట్టిన తెలుగు టైటాన్స్

image

ప్రో కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్ బోణీ కొట్టింది. జైపూర్ పింక్ పాంథర్స్‌తో జరిగిన మ్యాచులో 37-32 పాయింట్ల తేడాతో గెలిచింది. టైటాన్స్ ప్లేయర్లు విజయ్ మాలిక్, భరత్ చెరో 8 పాయింట్లతో అదరగొట్టారు. డిఫెన్స్‌లో ఏకంగా 14 పాయింట్లు రాబట్టారు. అంతకుముందు రెండు మ్యాచుల్లోనూ తెలుగు టైటాన్స్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే.

News September 5, 2025

ఏయూకు స్టేట్ పబ్లిక్ యూనివర్సిటీ విభాగంలో 4వ స్థానం

image

AP: స్టేట్ పబ్లిక్ యూనివర్సిటీ విభాగంలో ఆంధ్రా యూనివర్సిటీ దేశంలో నాలుగో స్థానంలో నిలిచింది. గతేడాదితో పోలిస్తే ఈ సారి మూడు స్థానాలు మెరుగుపరుచుకుంది. యూనివర్సిటీ విభాగంలో 23వ స్థానానికి చేరుకుంది. ఏయూ ఫార్మసీ కాలేజీ 31, ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ 88వ స్థానంలో, డాక్టర్ BR అంబేడ్కర్ న్యాయ కళాశాల 16వ స్థానంలో నిలిచాయి. AU నాలుగో స్థానంలో నిలవడం పట్ల మంత్రి లోకేశ్ అభినందనలు తెలిపారు.

News September 5, 2025

ఎల్లో అలర్ట్.. ఈ జిల్లాల్లో వర్షాలు

image

TG: రేపు ఉదయం 8.30 గంటల్లోపు రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని IMD తెలిపింది. ADB, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, KNR, జగిత్యాల, సిరిసిల్ల, PDPL, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, MHBD, WGL, HNK, రంగారెడ్డి, HYD, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డికి IMD ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మిగతా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

News September 4, 2025

టెక్ దిగ్గజాలకు ట్రంప్ డిన్నర్.. మస్క్‌కు నో ఎంట్రీ

image

టెక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దిగ్గజ కంపెనీల ఫౌండర్లు, CEOలకు US అధ్యక్షుడు ట్రంప్ ఈ రాత్రికి డిన్నర్ పార్టీ ఇవ్వనున్నారు. దీనికి బిల్‌గేట్స్, టిమ్ కుక్, జుకర్‌బర్గ్, పిచాయ్, సత్య నాదెళ్ల, ఆల్ట్‌మన్ తదితరులు హాజరుకానున్నారు. అయితే మస్క్‌కు మాత్రం ఆహ్వానం అందలేదు. ట్రంప్ అధికారం చేపట్టాక ఆయనకు కీలక పదవి ఇవ్వగా, తర్వాత ఇద్దరికీ చెడింది. దీంతో మస్క్‌ను ట్రంప్ దూరం పెడుతూ వస్తున్నారు.

News September 4, 2025

కూటమి ప్రభుత్వంపై హరిరామ జోగయ్య ప్రశంసలు

image

AP: కూటమి ప్రభుత్వంపై కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామ జోగయ్య ప్రశంసల వర్షం కురిపించారు. చంద్రబాబు, పవన్, లోకేశ్ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం దూసుకుపోతోందని చెప్పారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర నేపథ్యంలో ఆయన లేఖ రాశారు. వీరి నాయకత్వంలో మరో పదేళ్లలో ఏపీ నంబర్ వన్ స్థానంలో ఉంటుందని పేర్కొన్నారు.

News September 4, 2025

రేపు విశాఖ, విజయవాడలో సీఎం పర్యటన

image

AP: సీఎం చంద్రబాబు రేపు విశాఖపట్నం, విజయవాడల్లో పర్యటించనున్నారు. ఉ.7.30 గంటలకు క్యాంపు కార్యాలయం నుంచి విశాఖకు బయలుదేరుతారు. అక్కడ జరిగే ఇంటర్నేషనల్ మీడియేషన్ కాన్ఫరెన్స్‌కు హాజరై ప్రసంగించనున్నారు. అనంతరం అమరావతికి వెళ్తారు. సాయంత్రం విజయవాడలో జరిగే ఉపాధ్యాయ దినోత్సవాల్లో పాల్గొంటారు. 175 మంది ఉత్తమ టీచర్లకు అవార్డులు అందజేయనున్నారు.

News September 4, 2025

అర్మానీ.. ‘Its a Brand’ 1/2

image

మనలో చాలామందికి సుపరిచితమైన ‘అర్మానీ’ దుస్తుల బ్రాండ్ ఓనర్ జార్జియో అర్మానీ(91) <<17614096>>కన్నుమూశారు<<>>. ఇటలీలో 1975లో అర్మానీ, ఆయన పార్ట్‌నర్ సెర్జియో గలాటీ మెన్స్‌వేర్ దుకాణాన్ని తెరిచారు. అందుకు తమ వద్దనున్న పాత వోక్స్‌వ్యాగన్ కారును అమ్మేశారు. వ్యాపారం బాగా నడవడంతో తర్వాత ఏడాదికి మహిళల దుస్తులనూ విక్రయించడం ప్రారంభించారు. ఆ తర్వాత వారి వ్యాపార సామ్రాజ్యం సరిహద్దులు దాటింది. ఖండాంతరాలకు విస్తరించింది.

News September 4, 2025

అర్మానీ.. ‘Its a Brand’ 2/2

image

అర్మానీ కంపెనీ కేవలం దుస్తులకే పరిమితం కాకుండా యాక్సెసరీస్‌లు, హోమ్ ఫర్నిషింగ్స్, పెర్‌ఫ్యూమ్స్, కాస్మెటిక్స్, బుక్స్, ఫ్లవర్స్, చాకోలెట్స్‌ తదితర విక్రయాల్లోనూ తన బ్రాండ్ పవర్ చూపించింది. జార్జియో అర్మానీకి సొంత బాస్కెట్‌బాల్ టీమ్‌తో పాటు పలు దేశాల్లో బార్లు, క్లబ్‌లు, రెస్టారెంట్లు, హోటళ్లు కూడా ఉన్నాయి. ఫోర్బ్స్ ప్రకారం ఆయన సంపద 10 బిలియన్ డాలర్లు.

News September 4, 2025

ఆ కోర్సుల్లో దృష్టి లోపం గల దివ్యాంగులకు అనుమతి: విద్యాశాఖ

image

AP: మంత్రి లోకేశ్ చొరవతో దృష్టిలోపం ఉన్న దివ్యాంగులకు MPC, బైపీసీ కోర్సులు చదవడానికి అనుమతి లభించింది. ఈ మేరకు కళాశాల విద్యాశాఖ GO జారీ చేసింది. సైన్స్ కోర్సుల్లో తమకు అవకాశం కల్పించాలన్న దివ్యాంగుల విజ్ఞప్తికి స్పందించిన లోకేశ్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ప్రాక్టికల్స్ పరీక్షలకు ఆ విద్యార్థులు హాజరవ్వడం కష్టమని అధికారులు తెలపగా, బదులుగా లఘురూప ప్రశ్నలతో ఎసెస్‌మెంట్ చేయాలని మంత్రి సూచించారు.

News September 4, 2025

నల్ల కళ్లజోడుతో మంత్రి పార్థసారథి.. ఎందుకంటే?

image

AP: క్యాబినెట్ భేటీలో, ఆ తర్వాత మంత్రివర్గ నిర్ణయాలను మీడియాకు వెల్లడించిన సమయంలో మంత్రి పార్థసారథి నల్ల కళ్లజోడుతో కన్పించారు. దీంతో ఆయన ఆరోగ్యంపై పలువురు ఆరా తీశారు. కాగా ఇటీవల మంత్రి హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో కళ్లకు క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయించుకున్నట్లు ఆయన సన్నిహితులు చెప్పారు. అందుకే కళ్లజోడు పెట్టుకొని కనిపించారని వెల్లడించారు.