India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

బాలీవుడ్ సెన్సేషనల్ సింగర్ అర్జిత్ సింగ్ ఫ్యాన్స్‌కు షాకిచ్చారు. ప్లేబ్యాక్ సింగింగ్ నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించారు. ‘తుమ్ హి హో’, ‘కేసరియా’ వంటి మెలొడీలతో మెప్పించిన ఆయన 2 నేషనల్ అవార్డులు అందుకున్నారు. ప్రభుత్వం నుంచి పద్మశ్రీ గౌరవాన్నీ పొందారు. సినిమాల్లో ఆయన గొంతు మూగబోతుందన్న వార్త సంగీత ప్రియులను కలచివేస్తోంది. తెలుగులో మనం, ఉయ్యాలా జంపాలా, స్వామి రారా సహా పలు చిత్రాలకు పాడారు.

ఐసీసీ U19 <<18975279>>వన్డే వరల్డ్ కప్<<>> సూపర్-6లో జింబాబ్వేపై 204 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. 353 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన జింబాబ్వే 148 పరుగులకే ఆలౌటైంది. టీమ్ ఇండియా బౌలర్లలో ఉదవ్ మోహన్, ఆయుష్ మాత్రే చెరో 3 వికెట్లు, అంబ్రిష్ 2, హెనిల్ పటేల్, ఖిలాన్ పటేల్ తలో వికెట్ తీశారు.

APSRTCలో 7,673 రెగ్యులర్ పోస్టుల నియామకానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. వీటి భర్తీకి అనుమతించాలని పాలక మండలి తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపింది. వీటిలో డ్రైవర్, కండక్టర్, మెకానిక్, శ్రామిక్ ఖాళీలు ఉన్నాయి. అలాగే ఆన్‌కాల్ డ్రైవర్‌ల వేతనాన్ని ₹800 నుంచి ₹1,000కి, డబుల్ డ్యూటీ చేసే కండక్టర్‌లకు ఇచ్చే మొత్తాన్ని ₹900కు పెంచనున్నారు. బుధవారం జరిగే క్యాబినెట్ భేటీలో తుది నిర్ణయం వెలువడనుంది.

ఇంట్లో చీపురును నిలబెట్టకూడదని, ఇతరులకు కనిపించేలా గుమ్మాల వద్ద ఉంచవద్దని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. ఇల్లు తుడవడం ముగిశాక దాన్ని పడుకోబెట్టాలంటున్నారు. ‘చీపురు ఉంచడానికి ఈశాన్యం, తూర్పు, ఉత్తర దిశలు మంచివి కావు. పడమర/దక్షిణ దిశలో ఉంచాలి. ముఖ్యంగా బాత్రూం, స్టోర్‌రూమ్‌లలో చీపురు ఉండకూడదు. చీపురును రహస్యంగా, అడ్డంగా ఉంచడం వల్ల ఇంట్లో సిరిసంపదలు నిలుస్తాయి’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>

AP: జూన్‌లో రాష్ట్రం నుంచి 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. వీటిలో TDP 1, YCP 3 ఉన్నాయి. బడ్జెట్ సెషన్స్‌లో లేదా తర్వాత వీటికి ఎన్నిక ఉంటుంది. సంఖ్యా బలాన్ని బట్టి ఇవన్నీ కూటమికే దక్కనున్నాయి. వీటిలో 1 BJPకి కేటాయించొచ్చన్న ప్రచారముంది. జనసేన కోరితే 1 ఇచ్చి మిగతా 2 TDP తన వారికి ఇవ్వొచ్చని తెలుస్తోంది. కాగా కౌన్సిల్‌లో ఖాళీ అయ్యే MLC సీట్లలో JSP వాటా అడిగితే RS సీటు ఇవ్వకపోవచ్చని చెబుతున్నారు.

TG: HYD ఆస్తులు, విపత్తుల టైంలో ప్రాణాలు కాపాడటంలో హైడ్రాపాత్ర అభినందనీయమని CM రేవంత్ ప్రశంసించారు. ‘ప్రభుత్వ ఆస్తులు కాపాడటంతో పాటు చెరువుల రక్షణ, పునరుద్ధరణలో ప్రజా ప్రభుత్వం ఆలోచనలను హైడ్రా ఆచరణలో పెడుతోంది. ఆ క్రమంలో మీర్ ఆలం చెరువు పునరుద్ధరణ సందర్భంగా అక్కడ పనిచేస్తున్న ఇంజినీర్లు, కార్మికులు అనుకోని ఆపదలో చిక్కుకున్నారు. వారి ప్రాణాలు కాపాడిన హైడ్రా సిబ్బందికి అభినందనలు’ అని ట్వీట్ చేశారు.

TG: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో <<18975094>>కోడ్ అమల్లోకి<<>> వచ్చింది. దీంతో ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో వ్యక్తులు గరిష్ఠంగా రూ.50వేల వరకు మాత్రమే నగదు తీసుకెళ్లాలి. అంతకంటే ఎక్కువ నగదు, విలువైన వస్తువులు(బంగారం, వెండి) ఉంటే ఎందుకు, ఎక్కడికి తీసుకెళ్తున్నారో ఆధారాలు చూపాలి. లేదంటే సీజ్ చేస్తారు. ఆ సమయంలో పోలీసులు రిసీట్ ఇస్తారు. తర్వాత అప్పీల్ చేసుకొని ఆధారాలు చూపితే నగదును తిరిగిస్తారు.

TG: దేశంలో ఏ బొగ్గు గనిలోలేని ‘సైట్ విజిట్ సర్టిఫికేషన్’ ఇక్కడే ఎందుకని KTR ప్రశ్నించారు. ‘నిజంగానే కేంద్రం సిఫార్సు చేసుంటే అప్పటి BRS ప్రభుత్వం అమలు చేయలేదు. మరిప్పుడు అవసరంలేని నిబంధన కాంగ్రెస్ ఎందుకు తెచ్చింది. ఇది ఎవరి లాభం కోసం? గవర్నర్ ఇన్వాల్వ్ కావాలి లేదా కిషన్ రెడ్డికి ఆదేశమివ్వాలి. CBIతో ఎంక్వైరీ చేయిస్తారా, సిట్టింగ్ జడ్జికిస్తారా అనేది మీ ఇష్టం’ అని మీడియాతో మాట్లాడారు.

₹10, 20, 50 వంటి చిన్న నోట్ల చెలామణీ పెంచేందుకు కొత్త ATMలను తీసుకురావాలని కేంద్రం యోచిస్తోంది. ₹500, ₹100తోపాటు చిన్న నోట్లు విత్ డ్రా చేసుకునేలా ప్లాన్ చేస్తున్నట్లు Mint తెలిపింది. ముంబైలో పరీక్షిస్తున్నారని, ఆమోదం వస్తే దేశమంతటా అమలు చేస్తారని సమాచారం. ATMలో ఛేంజ్ తీసుకునే అంశాన్నీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఉదాహరణకు మన దగ్గర ఉన్న ₹500 నోటును అందులో ఉంచి, ఐదు ₹100 నోట్లను తీసుకోవచ్చు.

రేపు, ఎల్లుండి JEE మెయిన్ పరీక్షలు జరుగనున్నాయి. దేశవ్యాప్తంగా 15L మంది వరకు వీటికి హాజరుకానున్నారు. ఉ.9-12 వరకు ఫస్ట్ సెషన్, మ.3-6 వరకు రెండో సెషన్ ఉంటుంది. APలో 30, TGలో 14 పట్టణాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేశారు. కాగా అభ్యర్థులు తమతో పాటు అడ్మిట్ కార్డు, సెల్ఫ్ డిక్లరేషన్, పాస్‌పోర్టు సైజ్ ఫొటో, ఒరిజినల్ స్కూల్ ఐడీ లేదా ఇతర ఫొటో IDని తీసుకెళ్లాలి. NTA నిషేధిత వస్తువుల్ని తీసుకుపోరాదు.
Sorry, no posts matched your criteria.