India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ప్రముఖ జర్నలిస్టు గౌరీ లంకేశ్ మర్డర్ కేసు నిందితుడు శ్రీకాంత్ పంగర్కర్ MH ‘జల్నా’ కార్పొరేషన్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 2,621 ఓట్ల మెజారిటీతో గెలిచారు. BJP సహా ఇతర పార్టీల అభ్యర్థులను ఓడించారు. ఏక్‌నాథ్ షిండే శివసేన ఇక్కడ అభ్యర్థిని నిలబెట్టలేదు. 2018లో అరెస్టై, 2024 సెప్టెంబర్‌లో కర్ణాటక హైకోర్టు నుంచి పంగర్కర్ బెయిల్ పొందారు. గతంలో అవిభక్త శివసేనలో కార్పొరేటర్‌గా పనిచేశారు.

AIIMS రాయ్‌పూర్ 40 జూనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు జనవరి 19న ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. MBBS ఉత్తీర్ణతతో పాటు DMC/NMC/స్టేట్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. దరఖాస్తు ఫీజు రూ.1000, SC, ST, PwBD, మహిళలకు ఫీజు లేదు. వెబ్‌సైట్: https://www.aiimsraipur.edu.in

మీకున్న చెడు అలవాట్లపై మీరే పన్ను వేసుకోండి. డబ్బు ఆదా చేయడానికి ఇదొక వినూత్న మార్గం. అనవసర ఖర్చు చేసినప్పుడు అంతే మొత్తాన్ని పెనాల్టీగా మీ సేవింగ్స్ అకౌంట్‌లోకి డిపాజిట్ చేయండి. Ex ఒక బర్గర్ కొంటే దానికి సమానమైన డబ్బును వెంటనే అకౌంట్‌కు మళ్లించాలి. ఇలా చేస్తూ వెళ్తే పోగైన డబ్బును బట్టి మీకున్న బ్యాడ్ హాబిట్స్ వల్ల ఎంత నష్టమో తెలుస్తుంది. అలాగే క్రమశిక్షణ అలవడుతుంది. పొదుపు అలవాటవుతుంది.

సాధారణంగా దేశీయ బెండ(లావుగా, పొట్టిగా), హైబ్రిడ్ బెండ రకాలు ఆకుపచ్చగా (లేదా) లేత ఆకుపచ్చగా ఉండటం గమనిస్తాం. కానీ ఎర్ర బెండకాయలను కూడా సాగు చేస్తారని తెలుసా. ‘ఆంతో సయనిన్’ అనే వర్ణ పదార్థం వల్ల ఈ బెండ కాయలు, కాండం, ఆకు తొడిమెలు, ఆకు ఈనెలు ఎర్రగా ఉంటాయి. ఆకుపచ్చ బెండ కంటే వీటిలో పోషకాల మోతాదు ఎక్కువ. ఎర్ర బెండలో ‘కాశి లాలిమ’, ‘పూసా రెడ్ బెండి-1’ రకాలు అధిక దిగుబడినిస్తాయి.

ప్రస్తుతకాలంలో చాలామందిని బాధించే సమస్య PCOS. దీనివల్ల బరువు పెరగడం, పీరియడ్స్ సరిగా రాకపోవడంలాంటి ఎన్నో సమస్యలు వస్తాయి. అయితే PCOSకి చియాసీడ్స్ పరిష్కారం చూపుతాయంటున్నారు నిపుణులు. వీటిలో పీచు అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియను నెమ్మది చేసి, చక్కెర శోషణను తగ్గిస్తాయి. దీనివల్ల రక్తంలో షుగర్ స్థాయిలు స్థిరంగా ఉంటాయి. ఇది ఇన్సులిన్ నిరోధకతను మెరుగుపరుస్తుంది. బరువును తగ్గిస్తుంది.

AP: సంక్రాంతి సందర్భంగా జరుగుతున్న రికార్డింగ్ డాన్సులపై సంఘసేవకురాలు సునీతా కృష్ణన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. యువతులతో అసభ్యకరంగా టాప్‌లెస్ డాన్స్‌లు చేయించడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అనాగరిక పద్ధతిని సమాజం సాధారణ విషయంగా చూడటం అత్యంత ప్రమాదకరమని, మహిళల గౌరవాన్ని కాపాడాలని ఆమె విజ్ఞప్తి చేశారు. వీటిని అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని X వేదికగా సీఎం చంద్రబాబును కోరారు.

<

ఆసియాలోనే అత్యంత ధనిక మున్సిపల్ బాడీ అయిన BMCపై 40 ఏళ్లుగా ఉన్న ఠాక్రేల గుత్తాధిపత్యానికి BJP-షిండే కూటమి గండి కొట్టింది. విభేదాలు పక్కన పెట్టి ఉద్ధవ్, రాజ్ ఠాక్రేలు ఏకమైనా ముంబై ఓటర్లు మాత్రం మహాయుతివైపు మొగ్గు చూపారు. ఇక పవార్‌లకు పెట్టని కోటలైన పుణే, పింప్రి-చించ్వాడ్‌లోనూ ఊహించని ఫలితాలు వచ్చాయి. బాబాయ్ శరద్ పవార్, అబ్బాయ్ అజిత్ పవార్ మనస్పర్ధలు వీడి బరిలోకి దిగినా ప్యూహాలు పటాపంచలయ్యాయి.

ఆపరేషన్ సిందూర్ దెబ్బకు విలవిల్లాడిన పాక్ కొన్నిరోజులుగా సరిహద్దుల్లో తరచూ డ్రోన్లతో కవ్విస్తోంది. భారత రక్షణ వ్యవస్థలో ఎక్కడైనా లోపాలున్నాయా? మన సైన్యం ఎలా స్పందిస్తోంది? అనేవి తెలుసుకోవడమే వారి లక్ష్యమని డిఫెన్స్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. ముఖ్యంగా ఉగ్రవాదుల చొరబాటుకు ఏమైనా దారులున్నాయా అని పాక్ చెక్ చేస్తోందని వివరించారు. అయితే ఎక్కడ డ్రోన్ కనిపించినా మన సైన్యం తూటాలతో స్వాగతం పలుకుతోంది.

TG: గోదావరి నదిపై నిర్మల్ జిల్లాలో నిర్మించిన బ్యారేజీని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. మామడ మం. పొన్కల్ గ్రామంలోని ఆ బ్యారేజీ గేట్లు ఓపెన్ చేసి యాసంగికి నీరు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. అంతకుముందు ఆదిలాబాద్ జిల్లాలోని చనాక-కొరాటా పంప్ హౌస్‌ను సీఎం ప్రారంభించారు.
Sorry, no posts matched your criteria.