India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సంక్రాంతి రద్దీ దృష్ట్యా 7200 స్పెషల్ బస్సులు నడుపుతున్నట్లు APSRTC ప్రకటించింది. రేపటి నుంచి 13 వరకు 3900 స్పెషల్ బస్సులు, హైదరాబాద్ నుంచి 2,153 బస్సులు, బెంగళూరు నుంచి 375 బస్సులు, తిరుగు ప్రయాణాల కోసం 3200 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు తెలిపింది. ఈ బస్సుల్లో ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయడం లేదని పేర్కొంది. రానూపోనూ టికెట్లు ఒకేసారి బుక్ చేసుకుంటే 10శాతం రాయితీగా ఇస్తామని వెల్లడించింది.
TG: హైదరాబాద్‌లోని నాంపల్లిలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ నేతల దాడిని నిరసిస్తూ బీజేపీ నేతలు గాంధీభవన్ ముట్టడికి యత్నించారు. ఈ క్రమంలో వారిని పోలీసులు నిలువరించే ప్రయత్నం చేశారు. అయినా వారు రోడ్డుపై ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించి ముందుకు దూసుకెళ్తున్నారు. దీంతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
భారత్‌లో క్లౌడ్, ఏఐ మౌలికవసతుల విస్తరణకు 3 బిలియన్ డాలర్లు పెట్టుబడిగా పెట్టనున్నట్లు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ప్రకటించారు. ‘భారత్‌లో మునుపెన్నడూ లేని స్థాయిలో భారీగా విస్తరించనున్నాం. మా అజూర్ సామర్థ్యాన్ని మరింతగా పెంచనున్నాం. ప్రధానంగా వివిధ ప్రాంతాలకు సంస్థను విస్తరిస్తున్నాం. 2030నాటికి కోటిమందిని ఏఐ నిపుణులుగా మారుస్తాం’ అని స్పష్టం చేశారు.
నేపాల్-టిబెట్ సరిహద్దుల్లో సంభవించిన భూకంపంలో మరణాల సంఖ్య భారీగా పెరిగింది. ఈ ప్రకృతి విపత్తు ధాటికి టిబెట్‌లో 95 మంది మరణించినట్లు స్థానిక కథనాలు పేర్కొన్నాయి. మరో 130 మంది గాయపడినట్లు వెల్లడించాయి. గంట వ్యవధిలోనే భూమి ఆరు సార్లు కంపించినట్లు పేర్కొన్నాయి. దీంతో భారీ నష్టం వాటిల్లినట్లు తెలిపాయి.
TG: ఫార్ములా-ఈ కారు కేసులో జరుగుతున్న పరిణామాలపై కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘మీ అబద్ధాలు నన్ను అడ్డుకోలేవు. మీ ఆరోపణలు నన్ను నాశనం చేయలేవు. మీ కుట్రలు నా నోరు మూయించలేవు. నేటి అడ్డంకులే రేపటి విజయానికి నాంది. నేను న్యాయానికి గౌరవిస్తాను. న్యాయవ్యవస్థపై నమ్మకం ఉంది. నా మాటలు రాసిపెట్టుకోండి. ఎదురుదెబ్బల నుంచి బలంగా పుంజుకుంటాం’ అని రాసుకొచ్చారు.
BGTలో షమీని ఆడించకపోవడంపై రవిశాస్త్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. షమీ ఆడితే INDకు విజయావకాశాలు ఉండేవని అభిప్రాయపడ్డారు. దేశవాళీ టోర్నీల్లో ఆడిన అతడిని AUSకు ఎందుకు పంపించలేదని ప్రశ్నించారు. అతడి ఫిట్‌నెస్‌పై స్పష్టత ఎందుకు ఇవ్వడం లేదని, ఇంకెన్ని రోజులు NCAలోనే ఉంచుతారని అన్నారు. రవిశాస్త్రి కామెంట్స్‌తో రికీ పాంటింగ్ ఏకీభవించారు. షమీ కొన్ని ఓవర్లు వేసినా బుమ్రాకు మంచి సపోర్ట్ లభించేదని చెప్పారు.
జైలు నుంచి విడుదలయ్యాక కేజ్రీవాల్ వ్యూహాత్మకంగా CM పదవికి రాజీనామా చేశారు. నిజాయితీ నిరూపించుకోవడానికే ఆయన రాజీనామా చేశారని ఆప్ చెబుతోంది. పదేళ్లుగా పాలించిన ప్రభుత్వంపై సాధారణంగా ఏర్పడే వ్యతిరేకతను అధిగమించేలా, ఈ ఎన్నికల్లో ఢిల్లీ ప్రజలకు కేజ్రీవాల్ కావాలా? వద్దా? అనేదే ప్రధాన అజెండాగా ఆప్ ప్రచారం చేస్తోంది. మరి ఢిల్లీ ప్రజలు కేజ్రీవాల్‌ను విశ్వసిస్తారా? లేదా? అన్నది వేచిచూడాలి.
2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘన విజయాన్ని నమోదు చేసింది. 70 స్థానాల్లో 62 చోట్ల విజయం సాధించింది. 8 చోట్ల BJP గెలుపొందింది. కాంగ్రెస్ ఖాతా తెరవలేదు. ఉచిత విద్యుత్, నీటి సరఫరా, విద్యా రంగంలో సంస్కరణలకుగానూ 2015 (67), 2020లో అసెంబ్లీ ఎన్నికలు వన్ సైడ్‌గా నడిచాయి. ఇప్పుడు పదేళ్ల అనంతరం ప్రభుత్వ వ్యతిరేక, అవినీతి ఆరోపణలు, CM మార్పు పరిణామాలతో ఆప్ తీవ్ర పోటీ ఎదుర్కొనుంది.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల షెడ్యూలును ECI విడుదల చేసింది. ఒకే దశలో పోలింగ్ నిర్వహిస్తామని CEC రాజీవ్ కుమార్ తెలిపారు. JAN 10న నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు. నామినేషన్లకు చివరి తేదీని JAN 17గా పేర్కొన్నారు. మరుసటి రోజే స్క్రూటినీ జరుగుతుందన్నారు. FEB 5న ఓటింగ్, FEB 8న ఫలితాలు వెల్లడిస్తామన్నారు.
నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ తెరకెక్కించిన ‘డాకు మహారాజ్’ సినిమా ఈనెల 12న విడుదల కానున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రాన్ని ఏకకాలంలో తెలుగు, హిందీ, తమిళంలో విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమైనట్లు సినీవర్గాలు తెలిపాయి. తమిళంతోపాటు హిందీలో బిగ్ సినిమాలు లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా తెలుగులో ‘గేమ్ ఛేంజర్’, ‘డాకు మహరాజ్’ సినిమాల హవా నడవనుంది.
Sorry, no posts matched your criteria.