India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ప్రొ.కోదండరాం, అజహరుద్దీన్ క్యాబినెట్ ఖరారు చేసింది. ఇవాళ జరిగిన భేటీలో వీరిద్దరి పేర్లకు ఆమోదం తెలిపింది. గతంలో ప్రొ.కోదండరాం, అమీర్ అలీఖాన్‌ను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమించగా, ఇటీవల వారిద్దరి నియామకాన్ని<<17393463>> సుప్రీంకోర్టు<<>> రద్దు చేసిన సంగతి తెలిసిందే. అమీర్ అలీఖాన్ స్థానంలో అజహరుద్దీన్‌కు అవకాశం కల్పించారు.

X (ట్విటర్)లో TRUMP IS DEAD అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ట్రంప్ వైట్‌హౌస్‌లో కనిపించకపోవడంతో కొందరు X వేదికగా ఈ పోస్టులు చేస్తున్నారు. ట్రంప్ CVI వ్యాధితో బాధపడుతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. దీనికి తోడు దేశంలో ‘టెర్రిబుల్ ట్రాజెడీ’ సంభవిస్తే తాను అధ్యక్ష బాధ్యతలకు సిద్ధంగా ఉన్నట్లు వైస్ ప్రెసిడెంట్ వాన్స్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ రూమర్లను వైట్‌హౌస్ ఖండించింది.

TG: రాష్ట్రంలో యూరియా కొరతపై అసెంబ్లీలో చర్చ పెట్టాలని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ‘కొరతకు కారణం కేంద్రమో, రాష్ట్రమో తేల్చుకుందాం. యూరియా సమస్యను పరిష్కరించాల్సిందే. లేదంటే అప్పటివరకు అసెంబ్లీని స్తంభింపజేస్తాం. యూరియా కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తాం’ అని అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన వెల్లడించారు.

TG: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సెప్టెంబర్‌లో ఎలక్షన్స్ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ప్రభుత్వం లేఖ రాసింది. దీనిపై కాసేపట్లో అధికారిక ప్రకటన రానుంది.

ఎమర్జెన్సీలో రక్తం అందుబాటులో లేకపోవడంతో చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణలోని సంగారెడ్డిలో ‘నారాయణఖేడ్ బ్లడ్ డోనర్స్’ పేరిట 8 ఏళ్లుగా వాట్సాప్ గ్రూప్ నిర్వహిస్తున్నారు. ఎక్కడ, ఎవరికి రక్తం అవసరమైనా దాంట్లో మెసేజ్ చేస్తే చాలు దగ్గరున్నవాళ్లు అక్కడికి వస్తారు. ఇలాంటి వాట్సాప్ గ్రూప్స్ ప్రతి గ్రామానికీ ఉంటే ఆపదలో ఉన్నవారికి ఉపయోగపడటమే కాకుండా ఊరి ప్రజల మధ్య సంబంధాలు బలపడతాయి.

AP: అసత్యాలు చెప్పడంలో YCP దిట్టని చిత్తూరు(D) పరమసముద్రం బహిరంగ సభలో CM చంద్రబాబు విమర్శించారు. ‘గేట్లతో సెట్టింగులేసి నీళ్లు తెచ్చినట్లు డ్రామాలాడటం చూశాం. మల్యాలలో మొదలైతే పరమసముద్రానికి నీళ్లు తెచ్చాం. 27 లిఫ్ట్ ఇరిగేషన్లతో నీళ్లు తరలిస్తున్నాం. కుప్పానికి రెండేళ్ల ముందే కృష్ణా పుష్కరాలొచ్చాయి. రాయలసీమను రతనాలసీమ చేసే బాధ్యత నాదని ముందే చెప్పా. ప్రతి చెరువుకూ నీళ్లిస్తాం’ అని తెలిపారు.

TG: పంచాయతీల్లో రిజర్వేషన్లలో గత ప్రభుత్వం విధించిన 50% పరిమితిని ఎత్తివేయాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించింది. ఇందుకోసం పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285 (A)కు సవరణ చేయనుంది. దీని ద్వారా రిజర్వేషన్లలో 50% సీలింగ్‌ను మార్చనుంది. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తూ జీవో తీసుకురావాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.

AP: 738 కి.మీ. పొడవున్న హంద్రి-నీవా కెనాల్ ఆసియాలోనే అతి పెద్దదని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ‘రాయల పరిపాలనలో.. రాయలసీమ రతనాల సీమగా విలసిల్లేదని చరిత్ర చెబుతోంది. అక్కడి నుంచి TDP ఆవిర్భావం వరకూ సీమ కరవు ప్రాంతంగా ఉండిపోయింది. ఎన్టీఆర్ రాయలసీమకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. రాయలసీమను తిరిగి రతనాల సీమగా మారుస్తున్న చంద్రబాబు అభినవ శ్రీకృష్ణదేవరాయలు’ అని తెలిపారు.

హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం పూర్తయినట్లు రాజస్థాన్ రాయల్స్ ప్రకటించింది. ‘రాహుల్ చాలా సంవత్సరాలుగా రాయల్స్ ప్రయాణానికి కేంద్ర బిందువుగా ఉన్నారు. ఆయన నాయకత్వం ఎంతో మంది ఆటగాళ్లను ప్రభావితం చేసింది. ఫ్రాంచైజీకి రాహుల్ చేసిన సేవకు మేనేజ్మెంట్, ఆటగాళ్లు, లక్షలాది మంది అభిమానులు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు’ అని RR ట్వీట్ చేసింది.

KD Campus ఫౌండర్, ఇంగ్లిష్ ట్రైనర్ నీతూ సింగ్ ఆన్‌లైన్ క్లాసులో ‘పురుషులు కుక్కల వంటివాళ్లు’ అని చెప్పడంపై విమర్శలొస్తున్నాయి. ఏ సందర్భమైనా ఇలాంటి ఉదాహరణలు పురుషులను కించపరచడమేనని, ఆమెను అరెస్ట్ చేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. అయితే పురుషులు యజమానికి కట్టుబడి ఉంటారని ఇలా చెప్పానంటూ టీచర్ వివరణ ఇచ్చినా వివాదం సద్దుమనగట్లేదు. దీనిపై అంతా గొంతు విప్పాలని పిలుపునిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.