news

News January 14, 2026

ఇంటర్వ్యూతో BARCలో ఉద్యోగాలు

image

ముంబైలోని బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (<>BARC<<>>) 3 పోస్టులను భర్తీ చేయనుంది. MBBS, MD/MS/DNB ఉత్తీర్ణతతో పాటు పనిఅనుభవం గల అభ్యర్థులు జనవరి 22న ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 50ఏళ్లు. నెలకు రూ.92వేలు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://barc.gov.in

News January 14, 2026

విజయ్ మాతో పొత్తు పెట్టుకో.. బీజేపీ ఆఫర్

image

తమిళనాడులో తమతో పొత్తు పెట్టుకోవాలని TVK పార్టీని బీజేపీ ఆహ్వానించింది. వచ్చే ఎన్నికల్లో DMK గెలిచే అవకాశమే లేదని, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను ఏకం చేయాల్సిన అవసరం ఉందని BJP నేత అన్నామలై అన్నారు. డీఎంకే వ్యతిరేక పార్టీలన్నీ కలవాల్సిన అవసరం ఉందని మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. కాగా బీజేపీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని అంతకుముందు TVK డిప్యూటీ జనరల్ సెక్రటరీ నిర్మల్ కుమార్ తేల్చి చెప్పారు.

News January 14, 2026

ఫేక్ రిఫండ్లతో ₹5 కోట్లు కొల్లగొట్టాడు

image

e-కామర్స్ ప్లాట్‌ఫాంల రిటర్న్ సిస్టమ్ లూప్‌హోల్స్‌ను ఆసరా చేసుకొని ఓ యువకుడు రిఫండ్ కింద ఏకంగా ₹5Cr కొల్లగొట్టాడు. చైనాలో లూ అనే వ్యక్తి కాస్మొటిక్ షాపింగ్ ప్లాట్‌ఫాంలో 11900 ఫేక్ రిఫండ్ రిక్వెస్టులు పెట్టాడు. తనకు వచ్చిన వస్తువుల్ని తిరిగి సెకండ్స్ కింద మార్కెట్లో అమ్మేవాడు. 2024లో రిఫండ్‌లపై అనుమానంతో ఓ కంపెనీ ఫిర్యాదు చేయగా స్కామ్ బయటపడింది. చివరకు కోర్టు అతనికి 6ఏళ్ల జైలుశిక్ష విధించింది.

News January 14, 2026

వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో కోహ్లీ నం.1

image

విరాట్ కోహ్లీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో నంబర్-1 స్థానం దక్కించుకున్నారు. ఇటీవల భీకర ఫామ్‌లో ఉన్న అతడు ICC తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో రోహిత్‌ను వెనక్కి నెట్టి నాలుగేళ్ల తర్వాత ఫస్ట్ ప్లేస్‌కి చేరారు. రోహిత్ శర్మ మూడో ర్యాంకుకు పడిపోయారు. గిల్-5, శ్రేయస్-10 స్థానంలో ఉన్నారు. ఇక ఓవరాల్‌గా 28,068 రన్స్‌తో కోహ్లీ రెండో స్థానంలో ఉండగా 34,357 పరుగులతో సచిన్ తొలి స్థానంలో ఉన్నారు.

News January 14, 2026

కొందరి పౌరసత్వ నిర్ధారణ కోసం ఎన్నికల ప్రక్రియను ఆపలేము: ECI

image

పౌరసత్వం తేలేవరకు ఓటు హక్కును తొలగించవచ్చా? అని ECని SC ప్రశ్నించింది. SIR వ్యాజ్యంపై CJI సూర్యకాంత్, జస్టిస్ బాగ్చి విచారించారు. ‘పౌరసత్వంపై కేంద్రానికి నివేదించి EC నిర్ణయం తీసుకుంటుంది. అయితే కేంద్రం తేల్చే వరకు వేచి ఉండకుండా EC నిర్ణయం తీసుకోవచ్చు. ఓటరు పేరు తొలగించొచ్చు. దానిపై సదరు వ్యక్తి అప్పీలు చేయొచ్చు’ అని EC న్యాయవాది ద్వివేది కోర్టుకు తెలిపారు. దీనికోసం ఎన్నిక ప్రక్రియ ఆపలేమన్నారు.

News January 14, 2026

క్యాబినెట్ అజెండాలోకి ‘నల్లమలసాగర్’

image

TG: నల్లమలసాగర్ ప్రాజెక్టుపై క్యాబినెట్ సమావేశంలో చర్చించి ముందుకెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల 18న మేడారంలో జరిగే క్యాబినెట్ అజెండాలో ఈ అంశాన్ని చేర్చింది. నల్లమలసాగర్‌పై APని కట్టడిచేసేలా న్యాయపరమైన అంశాలన్నిటినీ దీనిలో చర్చించనుంది. ఇటీవల వేసిన పిటిషన్‌కు విచారణార్హత లేదని SC చెప్పడంతో TG ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. దీంతో సివిల్ దావాను పగడ్బందీగా దాఖలు చేసేందుకు నిర్ణయించింది.

News January 14, 2026

కుంకుమాది తైలంతో చర్మ సంరక్షణ

image

చర్మసమస్యలను నివారించడంలో కుంకుమాది తైలం ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. దీన్ని మాయిశ్చరైజర్, మసాజ్ క్రీమ్‌లతో కలిపి వాడుకోవచ్చు. ముడతలు, నల్ల మచ్చలు, ఫైన్ లైన్స్, పిగ్మెంటేషన్, వృద్ధాప్య సంకేతాలను తగ్గించడంలో ఇది ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. మొటిమలు ఉన్నవారు దీన్ని వాడకూడదని నిపుణులు చెబుతున్నారు. బాదం, నువ్వులనూనెతో కలిపి అప్లై చేస్తే సీరంలాగా ఉపయోగపడుతుంది.

News January 14, 2026

అపరాల పంటల్లో తెల్లదోమను ఎలా నివారించాలి?

image

తెల్లదోమ అపరాల పంట ఆకుల అడుగు భాగం నుంచి రసం పీల్చడం వల్ల మొక్కలు పాలిపోయి నల్లగా కనబడతాయి. అంతేకాకుండా ఎల్లో మొజాయిక్ (పల్లాకు తెగులు) అనే వైరస్ వ్యాధిని కూడా వ్యాపింపజేస్తాయి. పల్లాకు తెగులు సోకిన మొక్కలను తొలి దశలోనే గుర్తించి కాల్చివేయాలి. తెల్లదోమ నివారణకు పొలంలో ఎకరానికి 20-25 పసుపు రంగు జిగురు అట్టలను అమర్చాలి. లీటరు నీటికి 5 శాతం వేపగింజల కషాయం లేదా వేపనూనె 5ml కలిపి పిచికారీ చేయాలి.

News January 14, 2026

దీన్‌దయాళ్ పోర్ట్ అథారిటీలో ఉద్యోగాలు… అప్లై చేశారా?

image

దీన్‌దయాళ్ పోర్ట్ అథారిటీలో 10 పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. దరఖాస్తు హార్డ్ కాపీ, డాక్యుమెంట్స్‌ను JAN 27వరకు స్పీడ్ పోస్ట్ చేయాలి. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో BE, BTech, BLSc ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. నెలకు జీతం రూ.40,000-రూ.1,40,000 వరకు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.deendayalport.gov.in/

News January 14, 2026

అక్షయ పాత్రతో హరిదాసు – భక్తి కీర్తనల రవళి

image

తెల్లవారగానే వీధుల్లో వినిపించే హరిదాసు కీర్తనలు సంక్రాంతికి అసలు కళను తెస్తాయి. తల మీద అక్షయ పాత్ర, చేతిలో చిడతలు, కాళ్లకు గజ్జెలతో హరిదాసు విష్ణుమూర్తి ప్రతిరూపంగా కనిపిస్తాడు. ఆయన తల మీదున్న పాత్రను కింద దించకుండా ఇంటింటికీ తిరుగుతూ భక్తులు ఇచ్చే ధాన్యాన్ని స్వీకరిస్తాడు. హరిదాసును గౌరవించడమంటే భగవంతుడిని సేవించడమేనని భావిస్తారు. ఈ సంప్రదాయం మనసులో భక్తిని నింపి, దానగుణాన్ని ప్రోత్సహిస్తుంది.