news

News August 30, 2025

నేడు బార్ల లైసెన్స్ లాటరీ

image

AP: రాష్ట్రంలో బార్ల లైసెన్స్ దరఖాస్తు గడువు నిన్న రాత్రి 10 గంటలతో ముగిసింది. కొత్త బార్ పాలసీ ప్రకారం మినిమం 4 దరఖాస్తులు వచ్చిన వాటికే లాటరీ తీయనున్నారు. మొత్తం 840 బార్లలో 367 బార్లకే నాలుగు కంటే ఎక్కువ అప్లికేషన్లు వచ్చాయి. దీంతో వాటికే ఇవాళ లాటరీ తీస్తారు. మిగతా 473 బార్లకు మినిమం దరఖాస్తులు వచ్చేవరకు ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్లు ఇవ్వనుంది.

News August 30, 2025

ఇవాళ స్కూళ్లకు సెలవు.. ఎక్కడంటే?

image

TG: భారీ వర్షాలు, వరదలు కామారెడ్డి జిల్లాను అతలాకుతలం చేశాయి. పరిస్థితులు ఇంకా కుదుటపడకపోవడంతో ఆ జిల్లాలో విద్యాసంస్థలకు ఇవాళ కూడా సెలవు ఉంది. మరోవైపు వర్షాల నేపథ్యంలో జేఎన్టీయూ హైదరాబాద్ పరిధిలో ఇవాళ పరీక్షలు వాయిదా పడ్డాయి. త్వరలోనే కొత్త తేదీలు వెల్లడిస్తామని JNTUH ప్రకటనలో తెలిపింది.

News August 30, 2025

పండగ పవన్ కళ్యాణ్‌దేనా..!

image

ఈసారి దసరాకు ‘OG’(SEP 25) మినహా పెద్ద చిత్రాల సందడి కనిపించట్లేదు. మొన్నటి వరకు బరిలో ఉందనుకున్న ‘అఖండ-2’ రిలీజ్ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించడంతో పవన్ సినిమాకు ప్లస్‌గా మారింది. మూవీకి బజ్ ఉండటం, ఆ సమయంలో ఇతర భారీ చిత్రాలు రిలీజ్‌కు లేకపోవడంతో హిట్ టాక్ పడితే బొమ్మ బ్లాక్‌బస్టర్ అవ్వడం ఖాయమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అదే నిజమైతే ఈసారి పండగ పవన్ కళ్యాణ్‌దేనని ఫ్యాన్స్ అంటున్నారు.

News August 30, 2025

రాష్ట్రానికి 21 వేల టన్నుల యూరియా: తుమ్మల

image

TG: ఇవాళో, రేపో రాష్ట్రానికి 21 వేల టన్నుల యూరియా వస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. వచ్చే నెలలో రాష్ట్రానికి అదనపు కేటాయింపులు ఇవ్వాలని కేంద్రానికి లేఖ రాసినట్లు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 30వేల టన్నుల యూరియా ఉందని, రోజుకు సగటున 9-11 వేల టన్నుల అమ్మకాలు జరుగుతున్నాయని వెల్లడించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి అదనంగా 2.38 లక్షల టన్నుల యూరియా కేటాయించాలని కోరినట్లు పేర్కొన్నారు.

News August 30, 2025

మరో అల్పపీడనం.. భారీ వర్షాలు

image

AP: బంగాళాఖాతంలో సెప్టెంబర్ 3న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని APSDMA తెలిపింది. ఇది ఐదోతేదీ నాటికి వాయుగుండంగా బలపడే ఛాన్స్ ఉందని, దీని ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మరోవైపు ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరిలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వానలు పడుతాయని వెల్లడించింది.

News August 30, 2025

‘పిచ్చి కుక్కలు’ అంటూ షమీ మాజీ భార్య పోస్ట్

image

తనను భయపెట్టేందుకు చాలా ప్రయత్నాలు జరిగినా, ఎవరి బెదిరింపులకు భయపడలేదని క్రికెటర్ షమీ <<16902649>>మాజీ భార్య<<>> హసీన్ జహాన్ పోస్ట్ చేశారు. ‘పిచ్చి కుక్కలకు భయపడి ఉంటే 2018లోనే భయపడేదానిని. నన్ను నాశనం చేయాలని చూస్తే తట్టుకొని బలంగా మారుతా’ అని SMలో రాసుకొచ్చారు. ఇటీవల షమీ ఓ ఇంటర్వ్యూలో గతం గురించి వదిలేయాలని, వివాదాల జోలికి వెళ్లదలుచుకోలేదని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో జహాన్ పోస్ట్ చర్చనీయాంశంగా మారింది.

News August 30, 2025

నేడు విశాఖలో జనసేన బహిరంగ సభ

image

AP: విశాఖపట్నంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఇవాళ జనసేన బహిరంగ సభ(సేనతో సేనాని) నిర్వహించనుంది. రెండు రోజులుగా పార్టీ నేతలు, కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించిన పార్టీ చీఫ్ పవన్ భవిష్యత్తు కార్యాచరణపై వారికి దిశానిర్దేశం చేశారు. పార్టీకి జన సైనికులు, వీర మహిళలే బలమని నొక్కి చెప్పారు. ఈ క్రమంలో ఇవాళ సభలో పవన్ ఏం మాట్లాడుతారోననే ఆసక్తి నెలకొంది.

News August 30, 2025

రోడ్డు ప్రమాదాల్లో తెలుగు రాష్ట్రాల స్థానమిదే..

image

దేశంలో 2023లో 4.80 లక్షల రోడ్డు ప్రమాదాలు జరిగితే 1.72 లక్షల మంది మరణించగా, 4.62 లక్షల మంది గాయపడ్డారని కేంద్ర నివేదిక వెల్లడించింది. 2022తో పోలిస్తే ప్రమాదాలు 4.1%, మరణాలు 2.61% పెరిగాయని పేర్కొంది. రాష్ట్రాల వారీగా రోడ్డు ప్రమాదాల్లో ఏపీ(8,276), TG(8,103) ఏడు, ఎనిమిది స్థానాల్లో, మరణాల్లో AP(3,806), తెలంగాణ(3,508) 8, 9 స్థానాల్లో ఉన్నాయి. మరణాల్లో అత్యధికం 35-45 ఏళ్ల వారే ఉన్నారని తెలిపింది.

News August 30, 2025

ఈ ఏడాది చివర్లో నంది అవార్డులు: మంత్రి దుర్గేశ్

image

AP: తెలుగు భాష పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కందుల దుర్గేశ్ అన్నారు. నవంబర్, డిసెంబర్ నెలల్లో నంది అవార్డులు ప్రదానం చేస్తామని తెలిపారు. విశాఖలో నిర్వహించిన తెలుగు భాషా దినోత్సవాల్లో ఆయన మాట్లాడారు. గిడుగు రామమూర్తి, గురజాడ, కందుకూరి కృషి ఫలితంగానే తెలుగు భాషకు మహోన్నత స్థానం లభించిందని చెప్పారు. ఈ క్రమంలో రామమూర్తి అవార్డు గ్రహీతలను సత్కరించి, అవార్డులు, నగదు అందజేశారు.

News August 30, 2025

సింధు ఓటమి.. సాత్విక్ జోడీపైనే ఆశలు

image

వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత మెన్స్ డబుల్స్ ద్వయం సాకేత్-చిరాగ్ విజయం సాధించారు. క్వార్టర్ ఫైనల్లో వరల్డ్ నం.2 జోడీ ఆరోన్, సో వూయ్‌పై 21-12, 21-19 తేడాతో నెగ్గారు. దీంతో కాంస్యం ఖరారు చేసుకున్నారు. మరోవైపు ఉమెన్స్ సింగిల్స్‌లో సింధు నిరాశపరిచారు. ఇండోనేషియా ప్లేయర్ వర్ధనీ చేతిలో 21-14, 13-21, 21-16 పాయింట్ల తేడాతో ఓడారు. మిక్స్‌డ్ డబుల్స్‌లో ధ్రువ్-తనీశా జోడీ ఇంటి దారి పట్టింది.