India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి విజయవాడ ఏసీబీ కోర్టులో రెండు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలని, కుదరకపోతే మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఆయన కోర్టును కోరారు. గతంలో ఆయన వేసిన బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టేయగా, తాజాగా ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో మిథున్ రిమాండ్ ఖైదీగా ఉన్నారు.

AP: గోదావరి, కృష్ణా, పెన్నా నదుల అనుసంధానానికి CM చంద్రబాబు కట్టుబడి ఉన్నట్లు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వెల్లడించారు. ఇందుకోసం రూ.84వేల కోట్లతో ప్రణాళికలు రచిస్తున్నట్లు చెప్పారు. సముద్రంలోకి పోయే జలాలపై రాజకీయ లబ్ధి కోసం కొందరు రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. నదుల అనుసంధానం ద్వారా గోదావరి నుంచి వచ్చే జలాలను సోమశిల, కండలేరులో 150 TMCల చొప్పున నిల్వ చేస్తామని మంత్రి పేర్కొన్నారు.

నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తోన్న ‘అఖండ 2’ మూవీ రిలీజ్‌ను వాయిదా వేస్తున్నట్లు చిత్ర యూనిట్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. రీ రికార్డింగ్, పోస్ట్ ప్రొడక్షన్, వీఎఫ్ఎక్స్ పనులు పెండింగ్ ఉండటంతో పోస్ట్‌పోన్ చేయక తప్పడం లేదని వివరించింది. తదుపరి విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తామని వెల్లడించింది. ఈ సినిమాను సెప్టెంబర్ 25న విడుదల చేయనున్నట్లు గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే.

ఇండియాపై US టారిఫ్స్ ప్రభావం పరిమితమేనని బిజినెస్ మానిటర్ ఇంటర్నేషనల్ అభిప్రాయపడింది. ‘ఈ దశాబ్దం చివరికి IND GDP 6%పైనే ఉంటుంది. 2010-19 యావరేజ్(6.5%)తో పోలిస్తే కొంతే తక్కువ. అయినా ASIAలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎకానమీస్‌లో INDనే టాప్. GST 2శ్లాబుల విధానం, ఆదాయపన్ను కోతలతో కొనుగోళ్లు రూ.5.31 లక్షల కోట్లకు చేరుతాయని SBI అంచనా. ఇవన్నీ గ్రోత్‌పై టారిఫ్స్ ప్రభావాన్ని తగ్గిస్తాయి’ అని తెలిపింది.

KCLలో కొచ్చి బ్లూ టైగర్స్ ప్లేయర్ సంజూ శాంసన్ మరోసారి రెచ్చిపోయారు. అదానీ త్రివేండ్రం రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచులో సంజూ మరో ఫిఫ్టీ బాదారు. 37 బంతుల్లోనే 4 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 62 పరుగులు సాధించారు. కాగా అంతకుముందు త్రిస్సూర్ టైటాన్స్‌పై 89, కొల్లం సెయిలర్స్‌పై 121 పరుగులు బాదిన విషయం తెలిసిందే. తాజా ఫామ్‌తో శాంసన్ టీమ్ ఇండియా ఓపెనర్ స్థానానికి గట్టి పోటీ ఇస్తున్నారు.

అమెరికా టారిఫ్స్ అమల్లోకి రావడంతో వరుసగా రెండో రోజు కూడా భారత స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. ఇవాళ Sensex 705 పాయింట్లు నష్టపోయి 80,080 వద్ద, Nifty 211 పాయింట్ల నష్టంతో 24,500 వద్ద స్థిరపడ్డాయి. శ్రీరామ్ ఫైనాన్స్, HCL టెక్, TCS, ఇన్ఫోసిస్, HDFC, ICICI, ఇండస్ ఇండ్, ఎయిర్టెల్ షేర్లు నష్టపోయాయి. టైటాన్, లార్సెన్, హీరో మోటోకార్ప్, ఏషియన్ పెయింట్స్, మారుతీ సుజుకీ షేర్లు లాభపడ్డాయి.

ఇథనాల్ పెట్రోల్‌తో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కుమారుడు నిఖిల్ కంపెనీ భారీగా లబ్ధి పొందుతోందని కేరళ కాంగ్రెస్ ఆరోపించింది. 2024 జూన్ త్రైమాసికానికి ఆయనకు చెందిన CIAN ఆగ్రో ఆదాయం కేవలం రూ.17 కోట్లు ఉంటే ఏడాది కాలంలోనే అది రూ.511 కోట్లకు చేరిందని తెలిపింది. షేర్ విలువ రూ.43 నుంచి రూ.668కి ఎగబాకిందని పేర్కొంది. E20 పెట్రోల్ వల్ల వాహనాల ఇంజిన్లు నాశనం అవుతుంటే నిఖిల్ వ్యాపారం విస్తరిస్తోందని తెలిపింది.

IBPS క్లర్క్ పోస్టులకు నేటితో దరఖాస్తు గడువు ముగియనుంది. దేశంలోని పలు బ్యాంకుల్లో మొత్తం 10,270 కస్టమర్ సర్వీస్ అసోసియేట్ పోస్టులు ఉండగా ఏపీలో 367, టీజీలో 261 ఖాళీలు ఉన్నాయి. కనీసం డిగ్రీ ఉన్నవారు అప్లై చేయొచ్చు. వయసు 20-28 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ ప్రకారం వయోసడలింపు ఉంది. ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్స్ ద్వారా సెలక్ట్ చేస్తారు. ibps.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

హైదరాబాద్‌లో త్వరలోనే బీచ్ అందుబాటులోకి రానుంది. నగర శివారులోని కొత్వాల్‌గూడలో ఆర్టిఫిషియల్ బీచ్ నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సుమారు 35 ఎకరాల్లో రూ.225కోట్ల వ్యయంతో డిసెంబర్ నుంచి దీని నిర్మాణం మొదలుకానుంది. బీచ్‌లో ఫ్లోటింగ్ విల్లాస్, లగ్జరీ హోటళ్లు, వేవ్ పూల్స్, థియేటర్లు, ఫుడ్ కోర్టులు వంటివి చేర్చనున్నారు. ఇది పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ పద్ధతిలో అభివృద్ధి కానుంది.

తెలుగురాష్ట్రాల్లో గణేశ్ నవరాత్రుల ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఊరూవాడా మండపాలతో శోభాయమానంగా మారాయి. ఆ గణపయ్య తీరొక్క రూపాల్లో కొలువుదీరి భక్తులకు దర్శనమిస్తున్నాడు. పెద్ద విగ్రహాలు, వివిధ ఆకారాలు, అలంకారాలతో ఉన్న వినాయకుడి రూపాలు ప్రస్తుతం SMలో సందడి చేస్తున్నాయి. పెళ్లి కుమారుడిగా, మహా గణపతిగా, ఉయ్యాల్లో సేదతీరుతున్నట్లుగా ఇలా అనేక అవతారాల్లో ఆ గణేశుడు భక్తులను ఆకట్టుకుంటున్నాడు.
Sorry, no posts matched your criteria.