India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

APలోని ప్రతి కుటుంబానికీ ఫ్యామిలీ కార్డు జారీ చేయాలని CM చంద్రబాబు నిర్ణయించారు. ఫ్యామిలీ బెన్ఫిట్ మానిటరింగ్ వ్యవస్థపై CM సమీక్షించారు. ఈ కార్డులో ప్రభుత్వ పథకాలు సహా అన్ని వివరాలు పొందుపరచాలని అధికారులను ఆదేశించారు. ఆధార్‌లా ఫ్యామిలీ కార్డును ఉపయోగించుకోవాలని సూచించారు. ప్రభుత్వ పథకాల కోసం కుటుంబాలు విడిపోయే పరిస్థితి రాకూడదని, అందరికీ లబ్ధి కలిగేలా స్కీంలు రీ-డిజైన్ చేసేలా చూడాలని చెప్పారు.

రష్యా, ఉక్రెయిన్ పరస్పరం దాడులు కొనసాగిస్తున్నాయి. నిన్న రాత్రి నుంచి ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా చేపట్టిన ఎయిర్‌స్ట్రైక్స్‌లో ఐదుగురు పిల్లలు సహా 14 మంది మరణించారు. మరో 38 మంది గాయపడ్డారు. ఈ దాడిని ఆ దేశ ప్రెసిడెంట్ జెలెన్‌స్కీ తీవ్రంగా ఖండించారు. రష్యాకు యుద్ధం ఆపే ఉద్దేశమే లేదని, చర్చలకు బదులు మిస్సైళ్లను ఎంచుకుందని ఆక్షేపించారు. అటు 102 ఉక్రెయిన్ డ్రోన్స్‌ను కూల్చేశామని రష్యా ప్రకటించింది.

ఇన్‌స్టాగ్రామ్‌లో భర్తకు విడాకులు ఇచ్చిన దుబాయ్ యువరాణి షేఖా మహ్రా అల్ మక్తూమ్ తాజాగా ఓ ర్యాపర్‌తో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. మొరాకన్-అమెరికన్ ర్యాపర్ ఫ్రెంచ్ మోంటానాతో ఆమె నిశ్చితార్థం చేసుకున్నట్లు ఓ అంతర్జాతీయ మీడియా సంస్థ కథనం ప్రచురించింది. కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్న వీరిద్దరూ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నట్లు తెలుస్తోంది. కాగా 40 ఏళ్ల మోంటానాకు ఇప్పటికే పెళ్లై 16 ఏళ్ల కొడుకు ఉన్నాడు.

US వీసాలు దుర్వినియోగం కాకుండా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కఠిన చర్యలకు సిద్ధమైంది. స్టూడెంట్(F), ఎక్స్చేంజ్(J) వీసాలను ఇక నుంచి నాలుగేళ్లకే పరిమితం చేయాలని ప్రతిపాదించింది. ఓపెన్ ఎండెడ్ రూల్ వల్ల చాలామంది USలోనే ఉండిపోతున్నారని పేర్కొంది. కొత్త రూల్‌తో ఆ వీలుండదని తెలిపింది. మరోవైపు ఇతర దేశస్థుల జర్నలిస్ట్ వీసా(I)లను 240 రోజులు, చైనా జర్నలిస్ట్ వీసాలను 90 రోజులకే కుదించాలని ప్రపోజ్ చేసింది.

భారత్ పర్చేసింగ్ పవర్ పారిటీ(PPP) టర్మ్స్ పరంగా 2038 నాటికి ప్రపంచంలో రెండో అతిపెద్ద ఎకానమీగా ఎదగొచ్చని EY రిపోర్ట్ అంచనా వేసింది. $34.2 ట్రిలియన్ల GDP నమోదు చేయొచ్చని పేర్కొంది. దేశ జనాభా సగటు వయసు 28.8 ఏళ్లు, రెండో అత్యధిక సేవింగ్స్ రేట్, ప్రభుత్వ అప్పులు-GDP రేషియో తగ్గుదల తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంది. చైనా 2030కి $42.2 ట్రిలియన్లతో లీడింగ్‌లో ఉన్నా వృద్ధ జనాభా దానికి అడ్డంకి అవుతుందంది.

తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న పాలజ్ గ్రామంలో కర్రతో చేసిన సత్య గణేశుడిని పూజిస్తారు. వినాయక చవితి రోజు ఆలయంలో విగ్రహాన్ని ప్రతిష్ఠించి 11 రోజులు ఉత్సవాలు చేస్తారు. చివరి రోజు ఊరేగించి, నీళ్లు చల్లి ఆలయంలోని గదిలో భద్రపరుస్తారు. 1948లో పాలజ్‌లో కలరా, ప్లేగు వ్యాధులతో చాలా మంది చనిపోవడంతో కర్ర గణపతిని ప్రతిష్ఠించి పూజించడం ప్రారంభించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివస్తుంటారు.

భారీ వర్షాలకు తెలుగు రాష్ట్రాల్లోని పదికి పైగా జిల్లాలో స్కూళ్లకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని కొన్ని జిల్లాల్లో లేటుగా తీసుకున్నారని నెటిజన్లు విమర్శిస్తున్నారు. చాలాచోట్ల స్కూళ్లకు పిల్లలు, టీచర్లు చేరుకున్నాక సెలవు ప్రకటించడమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. వాతావరణ శాఖ నుంచి సూచనలు తీసుకుని ముందు రోజే సెలవుపై నిర్ణయం తీసుకోవడం అంత కష్టమా అంటున్నారు. దీనిపై మీ కామెంట్?

TG: హైదరాబాద్‌లోని గోషామహల్ నియోజకవర్గం హబీబ్‌నగర్‌లో CM రేవంత్ గెటప్‌లో వినాయకుడి విగ్రహం ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. దీంతో సౌత్ వెస్ట్ DCP మండపాన్ని సందర్శించారు. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించొద్దంటూ నిర్వాహకుడు సాయికుమార్‌ను హెచ్చరించారు. పోలీసుల ఆదేశాల మేరకు ఆ విగ్రహాన్ని తొలగించి మరొకటి ఏర్పాటు చేశారు. అంతకుముందు దీనిపై MLA రాజాసింగ్ పోలీసులకు <<17538582>>ఫిర్యాదు<<>> చేశారు.

TG: నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 20 గంటల పాటు అతిభారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మిగతా జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వానలు పడతాయని వెల్లడించింది. కాగా నిన్న కురిసిన వర్షాలకు నిర్మల్, కామారెడ్డి, మెదక్ జిల్లాలు అతలాకుతలం అయ్యాయి.

దాదాపు 3 నెలల తర్వాత RCB Xలోకి రీఎంట్రీ ఇచ్చింది. బెంగళూరు తొక్కిసలాట ఘటనపై స్పెషల్ లెటర్ పోస్ట్ చేసింది. ‘సైలెన్స్ ఆబ్సెన్స్ కాదు.. బాధ. JUN 4th అంతా మార్చేసింది. హృదయాల్ని ముక్కలు చేసింది. ఈ సమయంలో ‘RCB CARES’కి ప్రాణం పోశాం. ఫ్యాన్స్‌కు అండగా నిలిచేందుకు ఈ ప్లాట్‌ఫామ్ తోడ్పడుతుంది. మేం తిరిగొచ్చింది సెలబ్రేషన్‌తో కాదు.. మీతో కలిసి నడవడానికి. పూర్తి వివరాలు త్వరలో తెలియజేస్తాం’ అని పేర్కొంది.
Sorry, no posts matched your criteria.