India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

రజినీకాంత్ నటించిన ‘కూలీ’ ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టినట్లు సినీ వర్గాలు తెలిపాయి. విడుదలైన 12 రోజుల్లోనే ఈ ఘనత సాధించినట్లు పేర్కొన్నాయి. మరోవైపు ఎన్టీఆర్, హృతిక్ నటించిన ‘వార్-2’ ప్రపంచవ్యాప్తంగా రూ.327 కోట్లకుపైగా వసూలు చేసినట్లు వెల్లడించాయి. తెలుగులో ఈ మూవీ రూ.62.10 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేశాయన్నాయి.

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

✒ తిథి: శుక్ల తదియ మ.12.36 వరకు
✒ నక్షత్రం: హస్త తె.5.50 వరకు
✒ శుభ సమయములు: 1)ఉ.6.00-8.00 వరకు 2)సా.5.12-6.12 వరకు
✒ రాహుకాలం: మ.3.00-4.30 వరకు
✒ యమగండం: ఉ.9.00-10.30 వరకు
✒ దుర్ముహూర్తం: 1)ఉ.8.24-9.12 వరకు 2)రా.10.48-11.36 వరకు ✒ వర్జ్యం: మ.12.51-2.33 వరకు
✒ అమృత ఘడియలు: రా.10.12-11.54 వరకు

☛ ఓయూపై కుట్ర చేశారు: TG సీఎం రేవంత్
☛ ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం
☛ ఉచిత బస్సుల్లో త్వరలో లైవ్ ట్రాకింగ్: AP సీఎం CBN
☛ CM రేవంత్‌కు రక్షణగా బీజేపీ ఎంపీలు: KTR
☛ ఆల్ టైమ్ రికార్డుకు వెండి ధరలు
☛ US 50% టారిఫ్స్.. ఒత్తిడికి తలొగ్గేది లేదన్న పీఎం మోదీ
☛ డ్రీమ్-11తో ఒప్పందం రద్దు: BCCI కార్యదర్శి

ప్రభుత్వ పదవుల్లో ఉన్న వ్యక్తుల అకడమిక్ వివరాలు కూడా వ్యక్తిగత సమాచారమేనని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. PM మోదీ, స్మృతి ఇరానీ విద్యార్హత వివరాలను వెల్లడించాలని <<17514311>>RTI దాఖలవడంపై<<>> విచారణ జరిపింది. ‘వర్సిటీలు విద్యార్థులకు తప్ప ఇతరులకు మార్కులను బహిర్గతం చేయలేవు. మోదీ, స్మృతి విద్యార్హతలను వెల్లడించడంలో ప్రజాప్రయోజనం లేదు. RTI చట్టంలోని సెక్షన్ 8(1)(j) దీనికి మినహాయింపునిస్తుంది’ అని తెలిపింది.

AP: అంతర్జాతీయ బయోడిజైన్ నిపుణులతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. వైద్యారోగ్య రంగంలో పరిశోధన, శిక్షణ, స్టార్టప్‌ల కోసం వీరితో MOU చేసుకున్నారు. ప్రజారోగ్య రంగంలో ఆవిష్కరణలకు భారత్ బయో డిజైన్ రీసెర్చ్ ఇన్నోవేషన్(BRAIN) చేపడతామని తెలిపారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌లో అంతర్భాగంగా ఈ రీసెర్చ్ కార్యక్రమాలు జరుగుతాయన్నారు. ఏఐ, మెడ్‌టెక్ అలయన్స్ ఫౌండేషన్-స్టాన్‌ఫోర్డ్ సహకారంతో ముందుకెళ్తామని ఆయన చెప్పారు.

AP: మహిళల సహకారంతో ‘స్త్రీశక్తి’ గ్రాండ్ సక్సెస్ అయిందని పథకంపై సమీక్ష సందర్భంగా సీఎం చంద్రబాబు అధికారులతో అన్నారు. ‘ఉచిత బస్సుల్లో త్వరలో లైవ్ ట్రాకింగ్ ఏర్పాటు చేస్తాం. స్త్రీశక్తి బస్సులకు రెండు వైపులా బోర్డులు పెట్టండి. రాష్ట్ర మహిళల్లో చైతన్యం ఎక్కువగా ఉంటోంది. ప్రభుత్వ పథకాలు అందిపుచ్చుకొని అభివృద్ధి చెందుతారు’ అని సీఎం తెలిపారు. ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు పథకం అమలవుతోన్న విషయం తెలిసిందే.

SBIలో 6,589 జూనియర్ అసోసియేట్ పోస్టులకు దరఖాస్తు గడువు రేపటితో ముగియనుంది. అభ్యర్థుల వయసు 20-28 ఏళ్లు ఉండాలి. డిగ్రీ చేసిన వారు అర్హులు. ఫైనలియర్ చదువుతున్న వారూ అప్లై చేయవచ్చు. కానీ DEC 31, 2025కి ముందు డిగ్రీ పాసై ఉండాలి. ప్రిలిమినరీ, మెయిన్, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు జనరల్, OBC, EWS కేటగిరీ విద్యార్థులకు ₹750. మిగతా వారికి లేదు.
వెబ్‌సైట్: <

TG: నిజామాబాద్ మెడికల్ కాలేజీ ర్యాగింగ్ ఘటనలో ఐదుగురు హౌస్ సర్జన్లపై చర్యలు తీసుకున్నారు. 6 నెలలు సస్పెండ్ చేయడంతో పాటు హాస్టల్ నుంచి శాశ్వతంగా తొలగించారు. ప్రిన్సిపల్ కృష్ణమోహన్ అధ్యక్షతన ఇవాళ జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదవడంతో పోలీసుల నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయి. కాగా రాహుల్ అనే విద్యార్థిని సీనియర్లు వేధించగా, తిరిగి ప్రశ్నించడంతో అతడిని చితకబాదారు.

ఏపీ, తెలంగాణతో పాటు మొత్తం 4 రాష్ట్రాలకు 30,491 మెట్రిక్ టన్నుల యూరియాను కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. బిహార్‌కు 2,700, ఏపీకి 10,800, తెలంగాణకు 8,100, ఒడిశాకు 8,891 మెట్రిక్ టన్నులు కేటాయించింది. దీని వల్ల యూరియా కొరతతో ఇబ్బందులు పడుతున్న రైతులకు కాస్త ఉపశమనం లభించనుంది.
Sorry, no posts matched your criteria.