news

News August 25, 2025

వికలాంగుల పెన్షన్లు రద్దు చేయలేదు: మంత్రి పయ్యావుల

image

AP: వికలాంగుల పెన్షన్లు రద్దు చేశారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఖండించారు. ‘కేవలం నోటీసులు మాత్రమే ఇచ్చాం. 40% పైబడి అంగవైకల్యం ఉన్న వారికే పెన్షన్లు ఇస్తాం. నోటీసులు అందుకున్న వారు మెడికల్ బోర్డు దగ్గర తమ వైకల్యం నిరూపించుకోవాలి. మెడికల్ బోర్డు సర్టిఫికెట్ ఆధారంగానే పెన్షన్లు అందిస్తాం’ అని స్పష్టం చేశారు. అటు SEP 6న అనంతపురంలో CM CBN పర్యటిస్తారని ఆయన వెల్లడించారు.

News August 25, 2025

ఇన్‌స్టా చూడటమే ఉద్యోగం!

image

కొందరు ఎక్కువసేపు సోషల్ మీడియా చూస్తూ కాలక్షేపం చేస్తుంటారు. అలాంటి వారికి ఉద్యోగం ఇచ్చే కంపెనీ ఒకటుంది. ముంబైకి చెందిన మాంక్ ఎంటర్టైన్మెంట్ ‘డూమ్ స్క్రోలర్’ పేరిట ఉద్యోగ అవకాశాన్ని ఇస్తోంది. సదరు ఉద్యోగి ప్రధానంగా ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి ప్లాట్‌ఫామ్స్‌లో కనీసం 6 గంటల సమయం గడుపుతూ ట్రెండింగ్ అంశాలు, వైరల్ కంటెంట్‌ను గుర్తించాలి. వీరికి హిందీ & ఇంగ్లిష్ వచ్చి ఉండాలి.

News August 25, 2025

ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల

image

AP: వైద్యారోగ్యశాఖలో 185 డాక్టర్ల నియామకానికి ప్రభుత్వం <>నోటిఫికేషన్ <<>>ఇచ్చింది. ఒప్పంద విధానంలో పట్టణ ఆరోగ్య కేంద్రాలు, ఆయుష్మాన్ కేంద్రాల్లో ఈ ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. MBBS అర్హతతో 155 వైద్యుల పోస్టులు, టెలిమెడిసిన్ హబ్‌లో 13 జనరల్ మెడిసిన్ పోస్టులు, గైనకాలజిస్టులు-3, చిన్న పిల్లల వైద్యులు-14 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇవాళ్టి నుంచి SEP 10 వరకు దరఖాస్తు చేయవచ్చు.

News August 25, 2025

ఏపీ హైకోర్టుకు ముగ్గురు న్యాయమూర్తుల బదిలీ

image

దేశ వ్యాప్తంగా 14 మంది హైకోర్టు న్యాయమూర్తులు బదిలీ అయ్యారు. ఇందులో ముగ్గురు న్యాయమూర్తులను ఏపీకి బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం తీసుకుంది. గుజరాత్ హైకోర్ట్ జడ్జి జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్, అలహాబాద్ హైకోర్ట్ జడ్జి జస్టిస్ డి.రమేశ్, కలకత్తా హైకోర్ట్ జడ్జి జస్టిస్ సుభేందు సమంత ఏపీ హైకోర్టుకు బదిలీ అయ్యారు.

News August 25, 2025

ఫిజి క్రికెట్ టీమ్‌లకు ఇండియన్ కోచ్: PM మోదీ

image

ఫిజి దేశానికి చెందిన క్రికెట్ జట్లకు ఇండియన్ కోచ్ త్వరలో శిక్షణనిస్తారని PM మోదీ ప్రకటించారు. భారత పర్యటనకు వచ్చిన ఫిజి ప్రధాని సితివేణి రబుకతో ఆయన భేటీ అయ్యారు. ‘క్రీడలు ప్రజలను గ్రౌండ్ నుంచి మైండ్ దాకా కనెక్ట్ చేస్తాయి. ఫిజిలో రగ్బీ, INDలో క్రికెట్ దానికి ఉదాహరణ. గతంలో IND రగ్బీ జట్టుకు ఫిజి కోచ్ శిక్షణనిచ్చారు’ అని గుర్తు చేశారు. కాగా ICCలో ఫిజి అసోసియేట్ మెంబర్‌గా ఉంది.

News August 25, 2025

కేటీఆర్.. అప్పుడు మీ దమ్ముకు ఏమైంది?: MP కిరణ్

image

TG: పార్టీ మారిన MLAలు రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లే దమ్ముందా అంటూ KTR విసిరిన సవాల్‌కు కాంగ్రెస్ MP చామల కిరణ్ కౌంటరిచ్చారు. ‘పదేళ్లలో 60 మంది MLAలు పార్టీ మారితే అప్పుడు మీ దమ్ముకు దుమ్ము పట్టిందా? మీరు HYDలో ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు గెలిచినా పార్లమెంట్‌లో సున్నా వచ్చింది’ అని అన్నారు. BJPని విమర్శిస్తూ ‘కేంద్రం చంద్రబాబు‌కు ఇచ్చే ఇంపార్టెన్స్ BJP MPలకు ఇవ్వడం లేదు’ అని వ్యాఖ్యానించారు.

News August 25, 2025

మెగా DSC.. రేపటి నుంచి కాల్ లెటర్ల డౌన్‌లోడ్‌కు అవకాశం

image

AP: డీఎస్సీ అభ్యర్థులు వ్యక్తిగత లాగిన్‌ ఐడీల ద్వారా రేపు(26.08.2025) మధ్యాహ్నం నుంచి కాల్ లెటర్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని మెగా DSC కన్వీనర్ కృష్ణారెడ్డి తెలిపారు. తమకు కేటాయించిన రోజు అభ్యర్థులు తప్పనిసరిగా సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరు కావాలని సూచించారు. హాజరు కాని లేదా అర్హత లేని అభ్యర్థుల అభ్యర్థిత్వం రద్దు చేసి, మెరిట్ జాబితాలోని తదుపరి అభ్యర్థిని CV కోసం పిలుస్తామని వెల్లడించారు.

News August 25, 2025

TG PECET అడ్మిషన్ల సెకండ్ ఫేజ్ షెడ్యూల్ విడుదల

image

TG PECET-2025 (B.P.Ed, D.P.Ed ) అడ్మిషన్లకు సంబంధించి సెకండ్ (ఫైనల్) ఫేజ్ షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 26 నుంచి 29 వరకు ఆన్‌లైన్ <>రిజిస్ట్రేషన్<<>>&వెరిఫికేషన్, పేమెంట్, సర్టిఫికెట్ల అప్‌లోడ్, 30న అర్హులైన అభ్యర్థుల లిస్టు ప్రకటన, కరెక్షన్స్, సెప్టెంబర్ 1న ఫేజ్-2 వెబ్ ఆప్షన్స్ ఎడిట్ ఉంటుంది. 3న ఎంపికైన అభ్యర్థుల జాబితాను కాలేజీల వారీగా వెబ్‌సైట్‌లో పెడతారు. SEP 4 నుంచి 9 వరకు కాలేజీల్లో రిపోర్ట్ చేయాలి.

News August 25, 2025

ఎంత ఒత్తిడి వచ్చినా పరిష్కారాన్ని కనుగొంటాం: మోదీ

image

US 50% టారిఫ్స్ ఎల్లుండి నుంచి అమల్లోకి రానున్న నేపథ్యంలో <<17512695>>PM మోదీ<<>> పరోక్షంగా స్పందించారు. ‘ఎంత ఒత్తిడి వచ్చినా దానికి పరిష్కారాన్ని కనుగొంటాం. నేడు ప్రపంచంలో ఆర్థిక స్వార్థంతో రూపొందుతోన్న విధానాలను చూస్తున్నాం. అలాంటి చర్యలను భారత్ వ్యతిరేకిస్తుంది. ప్రజల ప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తాం. చిన్న పారిశ్రామికవేత్తలు, రైతులకు నష్టం జరగనివ్వం’ అని అహ్మదాబాద్‌లో ఓ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు.

News August 25, 2025

లారీ కింద నలిగిపోయిన తండ్రీ కూతుళ్లు!

image

TG: ఊహించని ప్రమాదంలో ఒకేసారి తండ్రీ కూతుళ్లు ప్రాణాలు కోల్పోయిన ఘటన రంగారెడ్డి(D) చేవెళ్లలో చోటుచేసుకుంది. గురుకుల స్కూలులో చదువుతున్న కూతురు కృప(12)ను తండ్రి రవీందర్(32) బైకుపై ఇంటికి తీసుకువస్తుండగా వెనుక నుంచి లారీ ఢీకొని వారి పైనుంచి వెళ్లింది. టైర్ల కింద నలిగిన వారిద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. తండ్రీ కూతుళ్ల మరణం స్థానికులను కంటతడి పెట్టించింది.