India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: సీఎం రేవంత్ రెడ్డి ఓయూ పర్యటన సందర్భంగా విద్యార్థుల ముందస్తు అరెస్టులు పిరికిపంద చర్య అని మాజీ మంత్రి హరీశ్ రావు అభివర్ణించారు. వెంటనే వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఒక్క విద్యార్థిపై లాఠీ దెబ్బ పడినా తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. సీఎం రేవంత్ ఎమర్జెన్సీ రోజులను తిరిగి తెచ్చారని ధ్వజమెత్తారు. ఉద్యోగాల పేరిట మోసం చేసిన ఆయన OU విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

వెండి ధరలు క్రమంగా పెరుగుతూ ఆల్ టైమ్ రికార్డుకు చేరుకున్నాయి. ఇవాళ కిలో వెండిపై రూ.1,000 పెరిగి తొలిసారి రూ.1,31,000ను తాకింది. గత 5 రోజుల్లో రూ.6,000 పెరగడం గమనార్హం. అటు 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.110 తగ్గి రూ.1,01,510కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ.100 పతనమై రూ.93,050 పలుకుతోంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

లక్ష్యసాధనలో ఉన్నవారిని ప్రోత్సహించేలా వ్యాపారవేత్త హర్ష గోయెంకా చేసిన ట్వీట్ వైరలవుతోంది. ‘ఓ పని మొదలు పెట్టినప్పుడు అది వెంటనే సక్సెస్ అవ్వకపోవచ్చు. మళ్లీ ప్రయత్నించండి. ఒకటి రెండు సార్లు ప్రయత్నించినా రాకపోతే మీ పద్ధతిని మార్చుకోండి. ఇదొక నిరంతర ప్రక్రియ. సమస్య ఉంటే సాయం కోరండి. ఎవరూ చేయకపోతే మీ అనుభవంతో నేర్చుకోండి. పట్టుదలతోనే పురోగతి సాధ్యం. వదిలేయడమే ఓటమికి ఏకైక మార్గం’ అని రాసుకొచ్చారు.

పండగ డిమాండ్ నేపథ్యంలో వచ్చే నెల 22 నుంచి GST కొత్త శ్లాబ్స్ అమలు కానున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సెప్టెంబర్ 3,4 తేదీల్లో జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. GSTని సరళీకరిస్తూ అన్ని వస్తువులపై ట్యాక్స్‌ను రెండు శ్లాబ్స్(5%, 18%)కు పరిమితం చేయాలని కేంద్రం భావిస్తున్న విషయం తెలిసిందే. మీటింగ్‌లో చర్చించి వీటిపై కౌన్సిల్ నిర్ణయం తీసుకోనుంది. అయితే లగ్జరీ వస్తువులకు మాత్రం 40% GST ఉండనుంది.

CM, PM, మంత్రులను తొలగించే బిల్లును విపక్షాలు వ్యతిరేకించడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ‘వాళ్లు జైలుకెళితే అక్కడి నుంచే ప్రభుత్వాన్ని నడిపించాలని చూస్తున్నారు. జైలునే సీఎం, పీఎం నివాసంగా మార్చుకుని ఆర్డర్స్ పాస్ చేస్తారు. 130వ రాజ్యాంగ సవరణ బిల్లు కచ్చితంగా ఆమోదం పొందుతుంది. కాంగ్రెస్, ఇతర పార్టీల్లోనూ చాలామంది నైతిక విలువలు కలిగిన నాయకులున్నారు’ అని స్పష్టం చేశారు.

తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదలయ్యాయి. నవంబర్ నెలకు సంబంధించిన రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వచ్చేశాయి. <

TG: జనాభా లెక్కల అనంతరం కేంద్రం డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టనున్న విషయం తెలిసిందే. దీంతో పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెరగడంతో పాటు జిల్లాలకు తగ్గట్టు సరిహద్దులు మారనున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 38 సెగ్మెంట్లు 2, 3 జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి. డీలిమిటేషన్ తర్వాత వీటితో పాటు కొత్తగా ఏర్పడే నియోజకవర్గాలు సైతం ఒకే జిల్లా పరిధిలోకి రానున్నాయి. దీంతో రాజకీయ సమీకరణాలు కూడా మారుతాయి.

TGలో పలువురు భర్తల వరుస దురాగతాలు ఉలిక్కిపడేలా చేశాయి. HYDలో అనుమానంతో 4 నెలల గర్భవతైన భార్య స్వాతిని భర్త మహేందర్ రెడ్డి చంపి, ముక్కలు చేసి మూసీలో పడేశాడు. అదే అనుమానంతో నాగర్‌కర్నూల్(D) పెద్దకొత్తపల్లిలో భార్య శ్రావణిని భర్త శ్రీశైలం హత్య చేసి, పెట్రోల్ పోసి తగులబెట్టాడు. కొత్తగూడెంలో లక్ష్మీప్రసన్నను రెండేళ్లుగా కడుపు మాడ్చి చంపేయగా, వరంగల్‌లో భార్య గౌతమిని భర్త ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు.

గ్లోబల్ మార్కెట్లో పాజిటివ్ సంకేతాల నేపథ్యంలో దేశీయ సూచీలు ఇవాళ లాభాల్లో మొదలయ్యాయి. సెన్సెక్స్ 223 పాయింట్ల లాభంతో 81,530, నిఫ్టీ 56 పాయింట్ల వృద్ధితో 24,926 వద్ద ట్రేడింగ్ స్టార్ట్ అయింది. టెక్ మహీంద్రా, టీసీఎస్, బజాజ్ ఫైనాన్స్, హిందాల్కో, ట్రెంట్ లాభాల్లో ట్రేడవుతుండగా, ICICI బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫిన్‌సెర్వ్, మారుతీ సుజుకీ, అపోలో హాస్పిటల్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

AP: సినీ నటుడు, MLA బాలకృష్ణకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. ‘స్వర్గీయ NTR నట వారసుడిగా 50 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం పూర్తి చేసుకున్నారు. వైవిధ్యమైన చిత్రాలతో మెప్పిస్తూ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సాధించిన పద్మ భూషణ్ బాలకృష్ణకు మనస్ఫూర్తిగా అభినందనలు. ఆయన మరిన్ని సంవత్సరాలు తన నటనతో ప్రేక్షకులను అలరిస్తూ, ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షిస్తున్నా’ అని ట్వీట్ చేశారు.
Sorry, no posts matched your criteria.