news

News August 25, 2025

ఇష్టారీతిన బిల్డింగులు కట్టొద్దు: నారాయణ

image

AP: గత ప్రభుత్వంలో ఎలాంటి ప్లానింగ్ లేకుండా ఇష్టమొచ్చినట్లు బిల్డింగ్స్ కట్టారని మంత్రి నారాయణ ఆరోపించారు. ‘ల్యాండ్ రెగ్యులైజేషన్ స్కీమ్ ఇప్పటికే ఇచ్చాం. బిల్డింగ్ రెగ్యులైజేషన్ స్కీమ్‌పై వర్క్ చేస్తున్నాం. నెలనెలా శాటిలైట్ పిక్చర్స్ స్టడీ చేసి.. ప్లానింగ్‌కి డీవియేషన్ ఉంటే CM చర్యలు తీసుకోమన్నారు. ఎవరైనా సరే డీవియేషన్ లేకుండా భవనాలు కట్టుకోండి. తేడాలుంటే ఇబ్బందులు పడతారు’ అని విజ్ఞప్తి చేశారు.

News August 25, 2025

మళ్లీ ఓయూకు వస్తా.. ఆర్ట్స్ కాలేజీ ముందు మీటింగ్ పెడతా: రేవంత్

image

TG: డిసెంబర్‌లో మరోసారి తాను ఓయూకు వస్తానని CM రేవంత్ ప్రకటించారు. ఆర్ట్స్ కాలేజీ ముందు మీటింగ్ పెట్టి, వర్సిటీకి రూ.వందల కోట్ల నిధులు ఇస్తానన్నారు. ఆరోజు ఒక్క పోలీస్ కూడా క్యాంపస్‌లో ఉండొద్దని DGPని ఆదేశించారు. నిరసన తెలిపే విద్యార్థులకు ఆ స్వేచ్ఛ కల్పిస్తానని తేల్చి చెప్పారు. తాను రావొద్దనే ఆలోచన ఏ విద్యార్థికీ ఉండదని.. గొర్రెలు, బర్రెలు పెంచుకునేటోడికి మాత్రమే ఉంటుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

News August 25, 2025

తల్లి కాబోతున్న హీరోయిన్ పరిణీతి చోప్రా

image

బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా, AAP ఎంపీ రాఘవ్ చద్దా త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ విషయాన్ని వీరు ఇన్‌స్టా వేదికగా వెల్లడించారు. ‘మా చిన్న ప్రపంచం వస్తోంది’ అని 1+1=3 అని ఉన్న ఫొటో & వీడియోతో తమ ఆనందాన్ని పంచుకున్నారు. వీరి వివాహం సెప్టెంబర్ 2023లో రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో వైభవంగా జరిగిన విషయం తెలిసిందే.

News August 25, 2025

స్టాండప్ కమెడియన్స్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం

image

వికలాంగులను కించపరిచేలా వెకిలి వ్యాఖ్యలు చేసిన స్టాండప్ కమెడియన్స్‌పై సుప్రీంకోర్టు ఫైరైంది. సమయ్ రైనా, విపుల్ గోయల్, బాల్‌రాజ్ పరమ్‌జీత్ సింగ్, నిశాంత్ జగదీశ్, సోనాలీ తక్కర్ తమ యూట్యూబ్ ఛానల్స్‌, SM అకౌంట్లలో ఎలాంటి షరతులు లేకుండా క్షమాపణలు చెప్పాలని కోర్టు ఆదేశించింది. ‘ఇతరుల మనోభావాలను దెబ్బతీయొద్దు. ఇది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కాదు.. కమర్షియల్ స్పీచ్’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.

News August 25, 2025

ఓయూపై కుట్ర చేశారు: సీఎం రేవంత్ రెడ్డి

image

TG: ఉస్మానియాను కాలగర్భంలో కలిపేందుకు గత పాలకులు కుట్ర చేశారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఓయూ విద్యార్థుల ఉద్యమంతోనే తెలంగాణ కల సాకారమైందన్నారు. అలాంటి చరిత్ర గల వర్సిటీకి వైస్ ఛాన్స్‌లర్‌ను నియమించకుండా తీవ్ర జాప్యం చేశారని విమర్శించారు. తాను అధికారంలోకి రాగానే ఓయూకు పూర్వ వైభవం తీసుకురావాలని సంకల్పించినట్లు చెప్పారు. 108 ఏళ్ల OU చరిత్రలో దళితుడిని తొలిసారి వీసీగా నియమించినట్లు పేర్కొన్నారు.

News August 25, 2025

ప్రభాకర్ రావు పిటిషన్‌పై విచారణ వాయిదా

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో తనను వేధిస్తున్నారంటూ SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఇప్పటికి 10 సార్లు విచారణకు హాజరైనట్లు ప్రభాకర్ తరఫు లాయర్ ధర్మాసనానికి విన్నవించారు. అయితే విచారణకు ఆయన సహకరించడంలేదని ప్రభుత్వ తరఫు లాయర్ వారించారు. దీంతో మధ్యంతర రక్షణ కొనసాగుతుందని, విచారణకు సహకరించాలని SC ఆదేశించింది. తదుపరి విచారణను SEP 22కు వాయిదా వేసింది.

News August 25, 2025

తెలంగాణ, ఉస్మానియా వర్సిటీ అవిభక్త కవలలు: సీఎం రేవంత్

image

TG: ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణకు ప్రత్యామ్నాయ పదమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘తెలంగాణ, ఉస్మానియా అవిభక్త కవలలు. పీవీ నరసింహారావు ఈ గడ్డ నుంచే ధిక్కారస్వరం వినిపించారు. చెన్నారెడ్డి, జైపాల్ రెడ్డి, జార్జ్ రెడ్డి, గద్దరన్నను అందించిన నేల ఇది. రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా ఉద్యమం ఇక్కడే మొదలవుతుంది’ అని వ్యాఖ్యానించారు.

News August 25, 2025

స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం

image

AP: SEP15కల్లా 1.46 కోట్ల కుటుంబాలకు స్మార్ట్ రేషన్ కార్డులు అందిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. VJA వరలక్ష్మీనగర్‌లో ఆయన కార్డుల పంపిణీ ప్రారంభించారు. ‘వీటితో రేషన్ తీసుకోగానే కేంద్ర, జిల్లా కార్యాలయాలకు సమాచారం వెళ్తుంది. కొత్తవారికి, చిరునామా మార్చిన వారికి ఈ స్మార్ట్ కార్డులిస్తాం. రేషన్ దుకాణాల సంఖ్య పెంచాలని CM ఆదేశించారు. అవసరమైన చోట్ల సబ్ డిపోలు ఏర్పాటు చేస్తాం’ అని తెలిపారు.

News August 25, 2025

భూదాన్ భూముల అన్యాక్రాంతంపై సీఎం సీరియస్

image

TG: యాచారంలో భూదాన్ భూముల అన్యాక్రాంతంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. 250 ఎకరాల భూదాన్ భూముల ఆక్రమణ, ఔషధ పరిశ్రమ భూసేకరణ కింద పరిహారం పొందిన ఆరోపణలపై దర్యాప్తు చేపట్టాలని ఆదేశించారు. ఈ వ్యవహారంపై సమగ్ర నివేదిక అందించాలని రెవెన్యూ సెక్రటరీకి సూచించారు.

News August 25, 2025

KGF నటుడు కన్నుమూత

image

KGF మూవీలో బాంబే డాన్‌ ‘శెట్టి’ పాత్రలో నటించిన దినేశ్ మంగళూరు కన్నుమూశారు. కర్ణాటకలోని మంగళూరుకు చెందిన ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మరణించారు. కాగా ఆయన నటుడిగానే కాకుండా ‘వీర మదకరి’, ‘చంద్రముఖి ప్రాణసఖి’, ‘రాక్షస’ తదితర చిత్రాలతో ఆర్ట్ డైరెక్టర్‌గానూ గుర్తింపు పొందారు.