news

News January 7, 2025

ప్రజలను డైవర్ట్ చేసేందుకే తెరపైకి కేటీఆర్ అంశం: పువ్వాడ అజయ్

image

రైతు భరోసా వైఫల్యం నుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకే KTR అంశం తెరపైకి తెచ్చారని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ వ్యాఖ్యానించారు. KTR అవినీతి చేసినట్టు హైకోర్టు చెప్పలేదని తెలిపారు. పిటిషన్‌ను మాత్రమే కోర్టు కొట్టేసిందని చెప్పారు. అటు, KTR విదేశాలకు పారిపోయే అవకాశం ఉందని, పాస్‌పోర్ట్ సీజ్ చేయాలని MLC బల్మూరి వెంకట్ ఆరోపించారు. సినిమా ఆర్టిస్టుల కంటే గొప్పగా కేటీఆర్ యాక్టింగ్ చేస్తున్నారని విమర్శించారు.

News January 7, 2025

రేవంత్ నోట్ల కట్టలతో దొరికారు.. కేటీఆర్ HYD బ్రాండ్ పెంచారు: హరీశ్

image

TG: గతంలో రేవంత్ అరెస్టుకు ప్రతీకారంగానే ఇప్పుడు ఆయన కేటీఆర్‌పై ఫోకస్ చేశారని భావిస్తున్నారా? అని విలేకరులు ప్రశ్నించగా హరీశ్ స్పందించారు. ‘ఆ కేసుకు, దీనికి సంబంధం లేదు. లంచం ఇస్తూ రేవంత్ రెడ్ హ్యాండెడ్‌గా నోట్ల కట్టలతో దొరికారు. HYD బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి, రాష్ట్ర ఆదాయం పెంచడానికి కేటీఆర్ కృషి చేశారు. ఇక్కడ ఒక్క రూపాయి అవినీతి జరగలేదు’ అని పేర్కొన్నారు.

News January 7, 2025

చైనా వైరస్‌పై రివ్యూ.. రాష్ట్రాలకు కేంద్రం సూచన

image

hMPVపై కేంద్ర వైద్యారోగ్యశాఖ రివ్యూ నిర్వహించింది. కేసులను గుర్తించేందుకు నిఘా పెట్టాలని, నివారణ చర్యలపై దృష్టిసారించాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. 2001 నుంచే hMPV ఉందని, భయపడొద్దని పేర్కొంది. శీతాకాలంలోనే ఈ కేసులు పెరుగుతాయని, అయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. తరచుగా చేతులు కడుక్కోవడం, మాస్క్ ధరించడం, వ్యాధి లక్షణాలున్న వారికి దూరంగా ఉండటంపై అవగాహన కల్పించాలని సూచించింది.

News January 7, 2025

9న కేటీఆర్ విచారణకు హాజరవుతారు: హరీశ్ రావు

image

TG: ఫార్ములా-e రేస్ వ్యవహారంలో అవినీతి జరిగినట్లు హైకోర్టు పేర్కొనలేదని, విచారణ చేయాలని మాత్రమే చెప్పిందని హరీశ్ రావు తెలిపారు. కొందరు న్యాయస్థానం తీర్పును తప్పుగా ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. ‘కేసులు, అరెస్టులు మాకు కొత్త కాదు. వాటికి మేం భయపడం. 9న ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరవుతారు. అధికారులకు సహకరిస్తారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా మేమెప్పుడూ ప్రజా పక్షమే’ అని చెప్పారు.

News January 7, 2025

డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగా కేటీఆర్‌పై అక్రమ కేసులు: హరీశ్ రావు

image

TG: ఫార్ములా-e రేస్ కేసులో KTR క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేయడంపై న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్లు హరీశ్ రావు చెప్పారు. ‘ఏడాది పాలన తర్వాత ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. CM రేవంత్ డైవర్షన్ పాలిటిక్స్‌, కక్ష సాధింపులో భాగంగా KTRపై అక్రమ కేసులు నమోదుచేశారు. ఆయన ఎలాంటి అవినీతికి పాల్పడలేదు. ఎన్ని కేసులు పెట్టినా మా పోరాటం ఆగదు. అక్రమాలను ప్రశ్నిస్తూనే ఉంటాం’ అని స్పష్టం చేశారు.

News January 7, 2025

ACB యాక్షన్ ప్లాన్‌పై ఉత్కంఠ

image

TG: కేటీఆర్ క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేయడంతో ACB యాక్షన్ ప్లాన్‌పై ఉత్కంఠ నెలకొంది. ఈ నెల 9న విచారణకు రావాలని ఆయనకు నోటీసులిచ్చింది. కాగా, కోర్టు తీర్పు నేపథ్యంలో అప్పటి వరకు ఆగుతుందా? ముందే చర్యలకు దిగుతుందా? అనేది చర్చనీయాంశమైంది. దీనిపై న్యాయనిపుణులతో ACB చర్చిస్తోంది. ఇవాళ కోర్టు తీర్పు ఇస్తుందని విచారణకు రాలేనని KTR ఏసీబీకి చెప్పగా, అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.

News January 7, 2025

అది సిద్దరామయ్య ఫేర్‌వెల్ మీటింగే: BJP

image

కర్ణాటక రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. DyCM DK శివకుమార్ లేకుండా CM సిద్దరామయ్య అతిథిగా మంత్రుల మీటింగ్స్ జరుగుతున్నాయి. JAN 2, నిన్న రాత్రి మీటింగ్స్ జరగడంతో కాంగ్రెస్‌లో విభేదాలు మొదలయ్యాయని BJP విమర్శించింది. నిన్న జరిగింది సిద్దూ ఫేర్‌వెల్ మీటింగని ఆరోపించింది. ఒకరికి ఒకే పదవి విధానాన్ని సిద్దూ హైకమాండ్ వద్ద ప్రతిపాదించడంతో DKను PCC చీఫ్‌గా నియమిస్తారని వార్తలు రావడం తెలిసిందే.

News January 7, 2025

విండ్ ఎనర్జీ నైపుణ్యాల కేంద్రంగా AP: మంత్రి

image

AP: దేశంలోనే అతిపెద్ద విండ్ ఎనర్జీ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడానికి సుజ్లాన్ ఎనర్జీ లిమిటెడ్, APSSDC మధ్య ఒప్పందం కుదిరిందని మంత్రి లోకేశ్ వెల్లడించారు. రాబోయే 4 ఏళ్లలో రాష్ట్రాన్ని విండ్ ఎనర్జీ నైపుణ్యాల కేంద్రంగా మార్చడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. యాంత్రిక, ఎలక్ట్రికల్, బ్లేడ్ టెక్నాలజీ, సివిల్ వంటి రంగాల్లో 12 వేల మందికి శిక్షణనిచ్చి ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తామన్నారు.

News January 7, 2025

KTR అరెస్ట్ తప్పదా? ఈనెల 9న ఏం జరగనుంది?

image

TG: ఫార్ములా-ఈ రేసుకు సంబంధించి ఏసీబీ కేసును క్వాష్ చేయాలన్న కేటీఆర్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. ఆయనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. మరోవైపు ఈనెల 9న ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆయన విచారణకు హాజరవుతారా?ఆయనను అధికారులు అరెస్ట్ చేస్తారా? అనేది జనాల్లో చర్చనీయాంశంగా మారింది.

News January 7, 2025

ఆస్కార్ బరిలో ‘కంగువా’, ‘ది గోట్ లైఫ్’

image

తమిళ స్టార్ నటుడు సూర్య హీరోగా నటించిన ‘కంగువా’ ఆస్కార్ బరిలో నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆస్కార్ 2025 పోటీలో నిలిచిన సినిమాల లిస్ట్ రిలీజవగా ఇందులో ‘కంగువా’ చోటు దక్కించుకుంది. దీంతోపాటు పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ‘ది గోట్ లైఫ్’ కూడా ఆస్కార్‌ నామినేషన్స్‌ దక్కించుకోవడం విశేషం. అయితే, బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచిన ‘కంగువా’ ఆస్కార్ బరిలో ఉండటం ఏంటని కొందరు విమర్శలు చేస్తున్నారు.