news

News May 7, 2025

‘కాళేశ్వరం’ ఎండీపై ఏసీబీ కేసు.. ఆస్తులు చూస్తే కళ్లు తేలేయాల్సిందే

image

TG: కాళేశ్వరం కార్పొరేషన్ MD భూక్యా హరిరామ్‌పై ACB కేసు నమోదు చేసింది. ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే ఆరోపణలతో 14 చోట్ల దాడులు జరిపింది. తనిఖీల్లో షేక్‌పేట్, కొండాపూర్‌లో విల్లాలు, శ్రీనగర్, మాదాపూర్, నార్సింగిలో ఫ్లాట్లు, అమరావతిలో స్థలం, మర్కూక్‌లో 28 ఎకరాలు, బొమ్మలరామారంలో 6 ఎకరాల ఫామ్‌హౌస్, శ్రీనగర్ కాలనీలో 2 ఇళ్లు, కొత్తగూడెంలో బిల్డింగ్, BMW కారు, బంగారం, బ్యాంకు డిపాజిట్లు గుర్తించారు.

News May 7, 2025

ఆదివారం పెట్రోల్ బంకులు బంద్.. నిజమిదే!

image

ఏపీ, తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో ఇక నుంచి ప్రతి ఆదివారం పెట్రోల్ బంకులు పని చేయవని ఓ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు పెట్రోల్ బంకులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు దాని సారాంశం. కాగా, అది 2017 నాటి వీడియో అని తెలుస్తోంది. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి నిర్ణయమేదీ తీసుకున్నట్లు అధికారిక ప్రకటన వెలువడలేదు.

News May 7, 2025

పాక్ నుంచి తిరిగొచ్చేస్తున్న భారతీయులు

image

సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పాకిస్థాన్‌లోని భారతీయులు స్వదేశానికి తిరిగి వచ్చేస్తున్నారు. గత మూడు రోజుల్లో 450 మందికి పైగా ఇండియన్స్ వాఘా బార్డర్ క్రాస్ చేశారు. వీరిలో 23 మంది పాకిస్థాన్ సూపర్ లీగ్‌‌కు సంబంధించిన బ్రాడ్‌కాస్ట్ కంపెనీలో పనిచేసే వారే కావడం గమనార్హం. మరోవైపు భారత్‌లో ఉన్న 200 మంది పాకిస్థానీయులు తమ దేశానికి వెళ్లిపోయారు.

News May 7, 2025

కాసేపట్లో వర్షం

image

తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న 3 గంటల్లో వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, జగిత్యాల, కామారెడ్డి, ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, నిర్మల్, నిజామాబాద్, సిరిసిల్ల, సంగారెడ్డి జిల్లాల్లో వానలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. గంటకు 40కి.మీ వేగంతో గాలులు వీయొచ్చని వెల్లడించింది.

News May 7, 2025

పుతిన్‌కు యుద్ధం ముగించాలని లేదేమో!: ట్రంప్

image

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో ఇవాళ ట్రంప్ భేటీ అయిన విషయం తెలిసిందే. సమావేశం అనంతరం రష్యా అధ్యక్షుడు పుతిన్‌‌ను విమర్శిస్తూ ట్రంప్ SMలో పోస్ట్ చేశారు. ‘నివాస ప్రాంతాలపై పుతిన్ మిస్సైల్ దాడులు చేయడంలో అర్థం లేదు. ఇదంతా చూస్తుంటే ఆయనకు యుద్ధం ఆపాలని లేదనిపిస్తోంది. ఇక చర్చలతో పనయ్యేలా లేదు. ఇతర పద్ధతుల్లో వ్యవహరించాల్సిందే. ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు’ అని వ్యాఖ్యానించారు.

News May 7, 2025

CM పర్యటన నిరుత్సాహానికి గురి చేసింది: సీదిరి

image

AP: CM చంద్రబాబు నేటి శ్రీకాకుళం జిల్లా పర్యటన నిరుత్సాహానికి గురి చేసిందని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. 44 ఏళ్లలో TDP మత్స్యకారులకు ఏం చేయలేదని, భవిష్యత్తులో ఏం చేయబోతుందో ఇవాళ కూడా చెప్పలేదని ఎద్దేవా చేశారు. నేడు ఏ ఒక్క హార్బర్‌కైనా శంకుస్థాపన లేదా ప్రారంభం చేశారా? అని నిలదీశారు. ఓ స్థానిక మత్స్యకార మహిళ గుజరాత్‌లోని వీరావలికి వలస వెళ్తున్నానని చెప్పగానే CM ముఖం మాడిపోయిందని చెప్పారు.

News May 7, 2025

IPL: వర్షంతో నిలిచిన మ్యాచ్

image

PBKS, KKR మ్యాచ్‌కు వరుణుడు అంతరాయం కలిగించాడు. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వద్ద వర్షం మొదలైంది. దీంతో అంపైర్లు మ్యాచ్‌ను నిలిపివేశారు. 202 రన్స్ లక్ష్యంతో బరిలోకి దిగిన KKR వర్షం పడే సమయానికి ఒక ఓవర్‌ ఆడి 7 రన్స్ చేసింది. క్రీజులో ఓపెనర్లు గుర్బాజ్, నరైన్ ఉన్నారు.

News May 7, 2025

వదంతులు వ్యాప్తి చేస్తే కఠిన చర్యలు: DGP

image

AP: పహల్‌గామ్‌లో ఉగ్రదాడి నేపథ్యంలో SMలో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని DGP హరీశ్‌కుమార్ గుప్తా హెచ్చరించారు. కేంద్ర నిఘా సంస్థల పేరుతో కొందరు వదంతులు వ్యాప్తి చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలను హైఅలర్ట్ జోన్స్‌గా ప్రకటించినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి ప్రకటనలేవీ చేయలేదని స్పష్టం చేశారు.

News May 7, 2025

చెరువులో మునిగి నలుగురి మృతి

image

AP: అన్నమయ్య(D)లో విషాదం నెలకొంది. ములకలచెరువులోని పెద్ద చెరువులో మునిగి నలుగురు మృతిచెందారు. ఈశ్వరమ్మ తన పిల్లలు లావణ్య(12), నందకిశోర్(10), పక్కింటి చిన్నారి నందిత(11)తో కలిసి దుస్తులు ఉతికేందుకు చెరువు వద్దకు వెళ్లారు. చిన్నారులు ఆడుకుంటూ నీటిలోకి దిగి గల్లంతయ్యారు. వారిని కాపాడే క్రమంలో ఈశ్వరమ్మ భర్త మల్లేశ్(36) కూడా నీటిలో మునిగి చనిపోయారు. నలుగురి మృతితో గ్రామంలో విషాద‌ఛాయలు అలుముకున్నాయి.

News May 7, 2025

ఓపెనర్ల విధ్వంసం.. పంజాబ్ భారీ స్కోర్

image

కోల్‌కతాతో జరుగుతున్న మ్యాచులో పంజాబ్ కింగ్స్ భారీ స్కోర్ సాధించింది. ఓపెనర్ల విధ్వంసంతో ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 201/4 పరుగులు చేసింది. ఓపెనర్లు ప్రభ్‌సిమ్రన్ (83), ప్రియాన్ష్ ఆర్య (69) కోల్‌కతా బౌలర్లకు చుక్కలు చూపిస్తూ ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఫోర్లు, సిక్సర్లతో మైదానాన్ని హోరెత్తించారు. కెప్టెన్ అయ్యర్ (25*) ఫరవాలేదనిపించారు. KKR బౌలర్లలో వైభవ్ 2, వరుణ్, రస్సెల్ తలో వికెట్ తీశారు.