India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

పహల్గామ్ అటాక్‌కు సంబంధించి ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు 14 మంది టెర్రరిస్టుల జాబితాను విడుదల చేశాయి. వీరు పాక్ ఆర్థిక సాయంతో జమ్మూకశ్మీర్‌లోనే ఉంటూ ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు తెలిపాయి. 20-40 ఏళ్ల మధ్య వయసున్న వీరంతా హిజ్బుల్ ముజాహిదీన్, లష్కరే తోయిబా, జైషే మహ్మద్ గ్రూపులకు చెందినవారని పేర్కొన్నాయి. ఇప్పటికే ముగ్గురు తీవ్రవాదుల స్కెచ్‌లను అధికారులు విడుదల చేసిన విషయం తెలిసిందే.

AP: TDP ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలోని మత్స్యకారుల దశదిశ మారిందని CM చంద్రబాబు అన్నారు. మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు కృషి చేస్తానని చెప్పారు. శ్రీకాకుళం జిల్లా బుడగట్లపాలెంలో ఆయన మాట్లాడారు. ‘వేట విరామ సమయంలో జాలర్లను ఆదుకునేందుకు కుటుంబానికి రూ.20 వేలు అందించాం. ఇందుకోసం రూ.258 కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశాం. గత ప్రభుత్వం మత్స్యకారుల సమస్యలు పరిష్కరించలేదు’ అని ఆయన విమర్శించారు.

మద్యం విషయంలో ఉన్న అపోహల గురించి మద్యం తయారీ నిపుణురాలు సోనాల్ హోలాండ్ స్పష్టతనిస్తున్నారు. ‘రెడ్ వైన్ గుండెకు మంచిదే. కానీ ఎక్కువగా తాగితే రక్తపోటు పెరగడమే కాక లివర్ పాడవుతుంది. ఖరీదైన టెకీలాతో హ్యాంగోవర్ రాదన్నది కూడా అబద్ధమే. వోడ్కాలో తక్కువ షుగర్ ఉంటుంది కాబట్టి మంచిదని మరో అపోహ ఉంది. కానీ ఏ ఆల్కహాలైనా లివర్ పనితీరును తీవ్రంగా దెబ్బతీస్తుంది. అతిగా తీసుకుంటే అమృతమూ విషమే’ అని వివరించారు.

పాకిస్థాన్‌తో ఉద్రిక్తతల వేళ కేంద్ర సమాచార శాఖ అన్ని మీడియా ఛానళ్లకు కీలక ఆదేశాలు జారీ చేసింది. రక్షణశాఖ కార్యకలాపాలు, భద్రతా బలగాల కదలికలను లైవ్ టెలికాస్ట్ చేయొద్దని కోరింది. ఇది డిఫెన్స్ ఆపరేషన్స్‌పై ప్రభావం చూపే అవకాశం ఉందని పేర్కొంది. సోషల్ మీడియాలో యూజర్లు కూడా భద్రతాపరమైన అంశాల వార్తల వ్యాప్తిపై సంయమనం వహించాలని సూచించింది.

TG: భారత్ సమ్మిట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఏఐసీసీ అగ్ర నేత రాహుల్ గాంధీ హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఆయనకు సీఎం రేవంత్, మంత్రులు స్వాగతం పలికారు. అనంతరం ఆయన నేరుగా ఈవెంట్ జరిగే హైటెక్స్‌లోని నోవాటెల్‌కు బయలుదేరి వెళ్లారు. కాగా భారత్ సమ్మిట్‌కు దాదాపు 400 మంది విదేశీ ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సమావేశం ముగింపు కార్యక్రమానికి రాహుల్ ఇక్కడికి వచ్చారు.

OTTలో వార్ బేస్డ్ యాక్షన్ థ్రిల్లర్స్ చాలా ఉన్నాయి. వాటిలో ది బెస్ట్‌గా నిలిచే ఈ దేశభక్తి మూవీస్‌ని ఈ వీకెండ్‌కి చూసేయండి.
Border(1997)- Youtube, Prime
Ghazi(2017)- Prime
Raazi(2019)- Prime
URI(2019)- Zee5
kesari(2019)- Prime
Shershaah(2021)- Prime *Major(2022)- Netflix

పహల్గామ్ దాడి నేపథ్యంలో AP, TGలోని 14 ప్రాంతాలను పోలీసులు హైఅలర్ట్ జోన్లుగా ప్రకటించారని ఓ మెసేజ్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. దీనిపై TG ఫ్యాక్ట్ చెక్ విభాగం స్పందించింది. ఇది ఫేక్ అని స్పష్టం చేసింది. ఎలాంటి స్పెషల్ అలర్ట్ జారీ చేయలేదని, పోలీసులు ముందు జాగ్రత్తగా బహిరంగ ప్రదేశాలలో నిఘా పెంచారని పేర్కొంది. ఏవైనా భద్రతా ఏర్పాట్లు ఉంటే DGP ఆఫీసు నుంచి అధికారిక ప్రకటన వెలువడుతుందని తెలిపింది.

పహల్గామ్ టెర్రర్ అటాక్ నేపథ్యంలో భారత్, పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. అయితే పాక్‌తో యుద్ధానికి అనుకూలంగా లేమని కర్ణాటక CM సిద్దరామయ్య చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఈ దాడికి భద్రతా వైఫల్యమే కారణమని ఆయన ఆరోపించారు. కేంద్రం కశ్మీర్‌లో భద్రతను కట్టుదిట్టం చేయాలన్నారు. CM వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. ఆయనకు ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదని ఆ రాష్ట్ర LOP అశోక విమర్శించారు.

అన్ని రైల్వే రీజియన్లలో 9,970 అసిస్టెంట్ లోకో పైలెట్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. మే 11 వరకు అప్లై చేసుకునే వీలుంది. పదోతరగతితో పాటు ITI చేసుండాలి. లేదంటే సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్, ఇంజినీరింగ్ డిప్లొమా చేసిన వాళ్లు అర్హులు. 18-30 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. ప్రారంభ వేతనం నెలకు రూ.19,900 ఉంటుంది. రాత, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక ఉంటుంది. పూర్తి వివరాల కోసం <

కైలాస్ మానసరోవర్ యాత్ర ఈ ఏడాది జూన్- ఆగస్టు మధ్య ఉంటుందని కేంద్రం అధికారిక ప్రకటన విడుదల చేసింది. 50 మంది యాత్రికుల చొప్పున 5, 10 బ్యాచులు ఉంటాయని తెలిపారు. ఉత్తరాఖండ్ లిపులేఖ్ పాస్, సిక్కింలోని నాథులా పాస్ మీదుగా యాత్ర సాగుతుంది. Kmy.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక ప్రక్రియ పూర్తిగా డిజిటల్‌గానే ఉంటుందని పేర్కొంది. కరోనా తర్వాత ఇదే తొలి కైలాస్ మానసరోవర్ యాత్ర.
Sorry, no posts matched your criteria.