news

News January 17, 2026

మద్యం అమ్మకాల్లో వృద్ధి

image

TG: 2025 DEC నాటికి మద్యం అమ్మకాలు, ఆస్తి రిజిస్ట్రేషన్ల ఆదాయంలో రాష్ట్రం గణనీయ వృద్ధిని సాధించింది. ఆస్తి పన్ను వార్షిక లక్ష్యం ₹19,087CR కాగా 59.22% (₹11,304CR) సాధించినట్లు కాగ్ నివేదిక పేర్కొంది. 2024లో ఇది కేవలం 41.28% మాత్రమే. ఎక్సైజ్ ఆదాయం ₹27,263 CR లక్ష్యంలో 63.38% (₹17,507CR) సాధించింది. 2024లో ఇది 54.96%. ఇక అమ్మకపు పన్ను 2024లో DEC నాటికి 71% సాధించగా ఈసారి అది 67.07%కి తగ్గింది.

News January 17, 2026

జపాన్‌ వెకేషన్‌లో అల్లు అర్జున్.. ఫ్యామిలీ పిక్ వైరల్

image

టోక్యోలోని సెన్‌సో-జి ఆలయానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యామిలీతో కలిసి వెళ్లారు. భార్య స్నేహా రెడ్డి, కొడుకు అయాన్, కూతురు అర్హతో దిగిన ఫోటోను SMలో ఆయన షేర్ చేశారు. షేర్ చేసిన క్షణాల్లోనే ఈ పిక్‌ను అభిమానులు వైరల్ చేసేశారు. సినిమాలు, ఫ్యామిలీకి సమానంగా టైమ్ కేటాయిస్తూ ఫ్యామిలీ మ్యాన్ అనిపించుకుంటున్నారని కామెంట్స్ పెడుతున్నారు.

News January 17, 2026

తక్కువ అర్హత పోస్టులకు వారిని మినహాయించొచ్చు: SC

image

ఎక్కువ అర్హతల వారిని తక్కువ అర్హత పోస్టుల నుంచి మినహాయించొచ్చని SC కీలక తీర్పిచ్చింది. బిహార్ GOVT ఫార్మసిస్ట్ రిక్రూట్మెంటులో డిప్లొమా ఫార్మసీని అర్హతగా నిర్ణయించింది. దీనిపై B.ఫార్మా, M.ఫార్మా అభ్యర్థులు HCకి వెళ్లారు. డిప్లొమా వారితో పోలిస్తే వీరికి ప్రాక్టికల్స్ తక్కువన్న GOVT వాదనతో HC ఏకీభవించి పిిటిషన్‌ను కొట్టేసింది. అర్హతలపై తుదినిర్ణయం GOVTదేనంది. SC దీన్నే సమర్థించి తాజా తీర్పిచ్చింది.

News January 17, 2026

నోబెల్ బహుమతి కోసం ఇంత పిచ్చా: కైలాశ్ సత్యార్థి

image

US అధ్యక్షుడు ట్రంప్ ఎట్టకేలకు <<18868941>>మరియా మచాడో<<>> నుంచి నోబెల్ ప్రైజ్ అందుకున్న విషయం తెలిసిందే. ఇది తనను షాక్‌కు గురి చేసిందని నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాశ్ సత్యార్థి చెప్పారు. ‘పీస్ ప్రైజ్ కోసం ఇంత పిచ్చిగా ఉన్న వ్యక్తిని ఎన్నడూ చూడలేదు. అవార్డును బదిలీ చేయలేమని <<18821416>>నోబెల్ కమిటీ<<>> చెప్పినట్లు వార్తలొచ్చాయి’ అని జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్‌లో అన్నారు. 2014లో సత్యార్థి నోబెల్ అందుకున్నారు.

News January 17, 2026

అమరావతి రైతులకు ఒకేచోట ప్లాట్లు!

image

AP: అమరావతి రైతులకు వేర్వేరు చోట్ల ప్లాట్లు ఇవ్వడంతో వాటిని అభివృద్ధి చేయడం ప్రభుత్వానికి సమస్యగా మారింది. చాలా ఖర్చుతో కూడుకుని వారికి అప్పగించడం ఆలస్యమైంది. దీంతో 2వ విడత 20,494 ఎకరాలు సేకరిస్తున్న ప్రాంతంలో రైతులకు ఒకే చోట ప్లాట్లు కేటాయించాలని భావిస్తోంది. ఇలా ఇవ్వడం వల్ల CRDAకి అందే స్థలమూ ఒకే ప్రాంతంలో ఉండి సంస్థలకు కేటాయింపులో మధ్యలో అడ్డంకులు ఉండవని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు.

News January 17, 2026

మరోసారి ముంబైని చిత్తు చేసిన యూపీ

image

WPL-2026: ముంబైపై మరోసారి యూపీ వారియర్స్ సత్తా చాటింది. ఇవాళ 22 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత యూపీ 187/8 రన్స్ చేయగా.. ముంబై 165 పరుగులకే పరిమితమైంది. యూపీ కెప్టెన్ లానింగ్ 45 బంతుల్లో 70 రన్స్‌తో రాణించారు. కాగా జనవరి 15న కూడా ముంబైపై యూపీ గెలిచిన సంగతి తెలిసిందే.

News January 17, 2026

JEE మెయిన్స్ అడ్మిట్ కార్డులు రిలీజ్

image

జేఈఈ మెయిన్స్ అడ్మిట్ కార్డులను NTA విడుదల చేసింది. అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్‌తో లాగినై అధికారిక <>వెబ్‌సైట్‌‌ నుంచి<<>> హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సెషన్-1 ఎగ్జామ్స్ ఈ నెల 21,22,23,24 తేదీల్లో జరగనున్నాయి. ఫిబ్రవరి 12న ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. సెషన్-2 ఎగ్జామ్స్ ఏప్రిల్‌లో జరుగుతాయి.

News January 17, 2026

పొగమంచు తీవ్రత.. ఉ.8 గంటల తర్వాతే బయటికి రావాలి!

image

AP: రాష్ట్రంలో రేపు ఉ.8 గంటల వరకు పొగమంచు ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, ఏలూరు, తూ.గో, ప.గో జిల్లాల్లో తీవ్రత అధికంగా ఉంటుందని వెల్లడించింది. పండగకొచ్చి వాహనాల్లో తిరుగు ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. పూర్తిగా పొగమంచు తొలగిపోయాకే బయటికి రావాలంది. అటు TGలోనూ కొన్ని ప్రాంతాల్లో పొగమంచు వల్ల వాహన రాకపోకలకు ఇబ్బంది కలుగుతోంది.

News January 17, 2026

U-19WC: భారత్ స్కోర్ ఎంతంటే?

image

U-19 వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచులో భారత్ 238 పరుగులకే ఆలౌట్ అయింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన మన జట్టులో కెప్టెన్ ఆయుష్ మాత్రే(6) మరోసారి ఫెయిల్ అయ్యారు. మరో ఓపెనర్ సూర్యవంశీ 72, అభిజ్ఞాన్ కుందు 80 రన్స్‌తో రాణించారు. మధ్యలో వర్షం వల్ల కాసేపు ఆటకు అంతరాయం ఏర్పడింది. దీంతో మ్యాచును 49 ఓవర్లకు కుదించారు. మరి భారత్ ఈ టార్గెట్‌ను కాపాడుకుంటుందా? COMMENT

News January 17, 2026

పిల్లల్లో ఆటిజం ఉందా?

image

ఆటిజమ్ పిల్లలు పెద్దయ్యాక ఎలా ఉంటారన్నది వారికి లభించే ప్రోత్సాహాన్ని బట్టి ఆధారపడి ఉంటుందంటున్నారు నిపుణులు. కొందరు చిన్నారుల్లో సంగీతం, కంప్యూటర్లు, బొమ్మలు వేయటం వంటి నైపుణ్యం ఉంటుంది. అందువల్ల వీరిలో దాగిన నైపుణ్యాన్ని వెలికి తీయటానికి, మరింత సాన బెట్టటానికి ప్రయత్నం చేయాలని చెబుతున్నారు. అలాగే వీరిలో సమన్వయం, ఏకాగ్రత పెరగటానికి ఆటలు బాగా తోడ్పడతాయంటున్నారు నిపుణులు.